- Home
- Telangana
- School Holidays : వచ్చేవారం తెలుగు స్టూడెంట్స్ కు సెలవులే సెలవులు.. స్కూళ్ళు నడిచేది మూడ్రోజులే
School Holidays : వచ్చేవారం తెలుగు స్టూడెంట్స్ కు సెలవులే సెలవులు.. స్కూళ్ళు నడిచేది మూడ్రోజులే
జూలై 20 నుండి 27 వరకు అంటే వచ్చేవారం తెలంగాణ విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ ఎనిమిది రోజుల్లో స్కూళ్లు పూర్తిగా నడిచేది కేవలం మూడురోజులు మాత్రమే. ఏఏ రోజుల్లో స్కూల్ కు సెలవులు ఉంది? ఏఏ రోజులు స్కూల్ నడుస్తుంది? ఇక్కడ తెలుసుకుందాం.

తెలంగాణలో వచ్చేవారం రాబోయే సెలవులివే
Holidays : వేసవి సెలవులు ముగిసి నెలరోజులకు పైనే అయ్యింది. కానీ ఇంకా చాలామంది విద్యార్థులు ఆ హాలిడేస్ జ్ఞాపకాల్లోనే ఉన్నారు. సెలవులు అన్న పదం వింటేచాలు వీరికి పట్టరాని ఆనందం.. ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఇలా ఒకటి రెండు రోజులు సెలవు వస్తేనే వీరిని పట్టలేం... అలాంటిది వారంలో ఐదురోజులు సెలవులు వస్తే పండగ చేసుకుంటారు. ఇలా వచ్చేవారం తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు వరుస సెలవులు వస్తున్నాయి.
సహజంగానే విద్యార్థులు ఎప్పుడెప్పుడు స్కూళ్లకు సెలవులు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. ప్రతివారం సండే ఒక్కరోజు సెలవు వస్తేనే సంబరపడిపోయే పిల్లలకు వారంలో ఐద్రోజులు సెలవులు వస్తే ఏ స్థాయిలో సంతోషిస్తారో మాటల్లో చెప్పలేం. ఇలా తెలుగు రాష్ట్రాల్లో జులై 20 నుండి 27 వరకు ఎన్నిరోజులు సెలవులు వస్తున్నాయి... ఎందుకు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
జులై 20 (ఆదివారం) సెలవు
ప్రతివారం లాగే ఈవారం కూడా ఆదివారం (జులై 20) సెలవుతో ప్రారంభం అవుతుంది. అయితే ఈరోజు మరో ప్రత్యేకత ఉంది... తెలంగాణ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే ఆషాడమాసం బోనాల్లో కీలకమైంది. బోనాలు అనగానే అందరికీ హైదరాబాద్ గుర్తుకువస్తుంది... నగరంలో దాదాపు నెలరోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి.
అయితే ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ముగిశాయి.. ఇక మిగిలింది లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలే. అలాగే నగరవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలన్నింటిలో ఈ ఆదివారమే బోనాల వేడుకలు జరిగేది. కాబట్టి ఈరోజు ఎలాగూ హాలిడేనే కాబట్టి నగర ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకుంటారు.
జులై 21 (సోమవారం) సెలవు
బోనాల పండగ నేపథ్యంలో హైదరాబాద్ లో సోమవారం (జులై 21) కూడా సందడి ఉంటుంది. అలాగే ఆదివారం వేడుకల్లో పాల్గొన్నవారు అలసిపోయి వుంటారు. ఇందుకోసమే బోనాల తర్వాతిరోజు అంటే సోమవారం కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కేవలం హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుంది.
జులై 23 (బుధవారం) సెలవు
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల(జులై) 23న అంటే వచ్చే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ బంద్ కు సహకరించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు, జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరత, స్కాలర్ షిప్ ల విడుదల… ఇలా విద్యావ్యవస్థ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించి విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాల నాయకులు. కాబట్టి బుధవరం తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి.
జులై 26 (శనివారం) సెలవు
ఈ సెలవు కేవలం కొందరు విద్యార్థులకే ఉంటుంది. సాధారణంగా ప్రతి శనివారం కొన్ని విద్యాసంస్థలకు హాఫ్ డే మాత్రమే స్కూల్స్ ఉంటాయి.. మరికొన్నింటికి పూర్తిగా సెలవు ఉంటుంది. హైదరాబాద్ లోని పలు స్కూళ్లకు ఇలా శనివారం సెలవు ఉంది... అలాంటి చోట చదివే విద్యార్థులకు జులై 26న కూడా సెలవే.
జులై 27 (ఆదివారం) సెలవు
ప్రతి వారంలాగే జులై 27 ఆదివారం సాధారణ సెలవు ఉంటుంది. ఈరోజు విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది.
ఇలా మొత్తంగా ఐదురోజులు సెలవులు వస్తున్నాయి. వచ్చేవారంలో కేవలం మంగళ, గురు, శుక్రవారం మాత్రమే స్కూళ్లు పూర్తిగా నడవనున్నాయి. శనివారం కొందరికి హాఫ్ డే, మరికొందరికి ఫుల్ డే సెలవు ఉంటుంది.