Sankranti Holidays : కేవలం నాల్రోజులే సంక్రాంతి హాలిడేస్.. కానీ 11 సెలవులు ఎక్స్ట్రా
Sankranti Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారమిది. ఈ సంక్రాంతికి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే హాలిడేస్ కు మరికొన్ని సెలవులు కలిసివస్తున్నాయి. ఇలా ఈ పండక్కి ఎన్నిరోజుల సెలవులు వస్తున్నాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు
School Holidays : తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండగ కోసం ప్రతి ఏడాది జనవరిలో స్కూల్ విద్యార్థులకు భారీగా సెలవులు ఇస్తారు... ఇలా ఈసారి కూడా పండగ హాలిడేస్ రాబోతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో పండగ హాలిడేస్ కి మరికొన్ని సెలవులు కలిసివస్తున్నాయి... ఇది విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.
తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
తెలంగాణ విద్యాశాఖ గతంలో ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం కేవలం నాలుగు రోజులే సంక్రాంతి సెలవులున్నాయి. జనవరి 12 నుండి 15 వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు. కానీ ఈ పండగ హాలిడేస్ కు మరికొన్ని సెలవులు కలిసిరానున్నాయి.... దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగానే 9 రోజులు సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సెలవులు విద్యాసంస్థలకు బట్టి మారవచ్చు.
సంక్రాంతి సెలవు తొమ్మిది రోజులెలా..?
తెలంగాణ ప్రభుత్వం అధికారికంగానే సంక్రాంతికి జనవరి 12 నుండి 15 వరకు సెలవులు ఇస్తోంది. అయితే వీటికి జనవరి 10న రెండో శనివారం, జనవరి 11న ఆదివారం సెలవులు కలిసిరానున్నాయి. అంటే జనవరి 12 నుండి కాదు 10 నుండే సెలవులు ప్రారంభం అవుతాయన్నమాట.
ఇక జనవరి 16న (శుక్రవారం) విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి... కానీ తర్వాతిరోజు జనవరి 17న (శనివారం) కొన్ని ప్రైవేట్ కార్పోరేట్ విద్యాసంస్థలకు సాధారణ వీకెండ్ సెలవు ఉంటుంది. అలాగే ఈరోజు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే షబ్-ఈ మేరాజ్ ఉంది... దీంతో ఈరోజు ఆప్షనల్ హాలిడే కూడా ఉంది. ఇక తర్వాత జనవరి 18 ఎలాగూ ఆదివారమే.
కేవలం జనవరి 16 ఒక్కరోజు కోసం విద్యార్థులు స్కూళ్లకి వచ్చే అవకాశాలు ఉండవు... కాబట్టి జనవరి 19న స్కూళ్లు పూర్తిస్థాయిలో నడుస్తాయి. ఇలా సెలవులు కలిసివస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమే జనవరి 10 నుండి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
జనవరి 2026 లో మొత్తం సెలవులెన్ని..?
జనవరిలో కేవలం సంక్రాంతికి మాత్రమే కాదు ఇంకా అనేక సెలవులు వస్తున్నాయి. నెలలో సగంరోజులు సెలవులే. ఇలా తెలంగాణలో వచ్చే సాధారణ, ఆప్షనల్ హాలిడేస్ ఏవో తెలుసుకుందాం.
1. న్యూ ఇయర్ - 01 జనవరి ( గురువారం) - ఆప్షనల్ హాలిడే
2. హజ్రత్ అలీ భర్త్ డే - 03 జనవరి (శనివారం) - ఆప్షనల్ హాలిడే
3. భోగి - 14 జనవరి (బుధవారం) - అధికారిక సెలవు
4. సంక్రాంతి - 15 జనవరి (గురువారం) - అధికారిక సెలవు
5. కనుమ - 16 జనవరి (శుక్రవారం) - ఆప్షనల్ హాలిడే
6. షబ్-ఈ- మేరాజ్ - 17 జనవరి ( శనివారం) - ఆప్షనల్ హాలిడే
7. శ్రీ పంచమి - 23 జనవరి (శుక్రవారం) - ఆప్షనల్ హాలిడే
8. రిపబ్లిక్ డే - 26 జనవరి (సోమవారం) - జాతీయ సెలవు
వీటితో పాటు జనవరి 4,11,18, 25 (నాలుగు ఆదివారాలు) ఎలాగూ సెలవే... జనవరి 10న రెండో శనివారం కూడా సెలవే. ఇలా ఉద్యోగులకు 13 రోజులు సెలవులు వస్తున్నాయి. విద్యార్థులకు కూడా ఇదేస్థాయిలో సెలవులున్నాయి.
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పట్నుంచో తెలుసా?
ఆంధ్ర ప్రదేశ్ లో జనవరి 10 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలకే కాదు ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. జనవరి 9న సాయంత్రం స్కూల్స్ తలుపులు మూసుకుంటే తిరిగి జనవరి 19న ఉదయం తెరుచుకుంటాయి. ఇలా సంక్రాంతికి మొత్తం తొమ్మిది రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

