- Home
- Telangana
- School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి పండగే.. దీపావళికి రెండు కాదు వరుసగా మూడ్రోజులు సెలవులే?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి పండగే.. దీపావళికి రెండు కాదు వరుసగా మూడ్రోజులు సెలవులే?
School Holidays : సాధారణంగా దీపావళికి ఒకేరోజు సెలవు… ఈసారి సండే కలిసిరావడంతో రెండ్రోజులు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు మూడ్రోజులు సెలవులు వచ్చేలా ఉన్నాయి.

ఈవారం కూడా స్కూళ్లకి సెలవులే సెలవులు
School Holidays : తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వరుస సెలవులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ లో దసరా సెలవులతో ప్రారంభమై అక్టోబర్ లో దీపావళి వరకు ఈ హాలిడేస్ ప్రవాహం కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటికే దసరాతో పాటు రెండో శనివారం, ఆదివారాలతో కలిపి వరుస సెలవులు వచ్చాయి... ఇకపై కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కొనసాగనున్నాయి. ఈవారం విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి… మరి ఏరోజు ఎందుకు సెలవుందో ఇక్కడ తెలుసుకుందాం.
దీపావళికి మూడ్రోజులు సెలవులేనా?
ఈ దీపావళికి ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం ఒకేరోజు అధికారిక సెలవుంది... కానీ ఓ ఆదివారం కలిసిరావడంతో రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు మరో సెలవు కలిసివచ్చే అవకాశాలున్నాయి... దీంతో దీపావళి హాలిడేస్ మూడ్రోజులకు పెరిగేలా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తున్నాయి.
అక్టోబర్ 20న అంటే వచ్చే సోమవారం దీపావళి పండగ ఉంది. హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే పెద్దపండగ కాబట్టి దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా స్కూళ్లు, కాలేజీలకే కాదు ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. పండక్కి ముందురోజు ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు కలిసివస్తోంది... ఈరోజు నరక చతుర్దశి సందర్భంగా తెలంగాణలో ఆప్షనల్ హాలిడే ఉంది.. కానీ దీని అవసరం ఉద్యోగులకు లేదు.
శనివారం తెలంగాణ బంద్
అక్టోబర్ 18న కూడా తెలంగాణలో విద్యాసంస్థలు, ఆఫీసులు పనిచేసే అవకాశాలు కనిపించడంలేదు. ఎందుకంటే తెలంగాణలో బిసి రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది... దీంతో ఉద్యమానికి సిద్దం అవుతున్న బిసి సంఘాలు అక్టోబర్ 18న (శనివారం) రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ ప్రభావం విద్యాసంస్థలపై తప్పకుండా ఉంటుంది.
కొన్ని విద్యాసంస్థలు బంద్ నేపథ్యంలో అక్టోబర్ 18న ముందుగానే సెలవు ప్రకటించే అవకాశాలున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు సెలవు ఇవ్వకుండా ఓపెన్ చేసినా బిసి విద్యార్థి సంఘాలు, బంద్ కు మద్దతిచ్చే రాజకీయ పక్షాలు మూసివేయించే అవకాశాలున్నాయి. ఆర్టిసి బస్సులతో పాటు ఇతర ప్రైవేట్ వాహనాలను కూడా అడ్డుకుంటూ ఉద్యమకారులు రోడ్లను నిర్బంధించే అవకాశాలుంటాయి… కాబట్టి సెలవు ఉంటే పర్లేదుగానీ లేకుంటే విద్యార్థులకు తిప్పలు తప్పవు.
తెలంగాణ బంద్ వాయిదా
బిసి సంఘాలు తమ రిజర్వేషన్ల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు అక్టోబర్ 14న అంటే రేపే(మంగళవారం) బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కానీ వివిధ కారణాలతో ఈ బంద్ ను వాయిదా వేస్తున్నట్లు బిసి సంఘం నాయకులు ప్రకటించారు. మరింత పకడ్బందిగా బిసి రిజర్వేషన్ల పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణలో బిసి రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు బిసి జేఏసి ఏర్పాటుచేసుకున్నారు.. దీనికి ఛైర్మన్ గా ఆర్. కృష్ణయ్యను ఎంపికచేశారు. వర్కింగ్ ఛైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో ఛైర్మన్లుగా దాసు సురేష్, రాజరామ్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ బిసి జేఏసియే అక్టోబర్ 14 తెలంగాణ బంద్ ని అక్టోబర్ 18కి వాయిదా వేసింది.
ఈ అక్టోబర్ లో మొత్తం సెలవులెన్ని?
ఈ నెలలో (అక్టోబర్) దాదాపు సగంరోజులు పూర్తయ్యాయి. ఇందులో దసరా, రెండో శనివారం, వర్షాలు, ఆదివారాలు అంటూ వరుస సెలవులు వచ్చాయి... ఇలా సగంరోజులు హాలిడేస్ తోనే గడిచిపోయాయి… ఇక మిగతా సగం నెలలో కూడా వరుస సెలవులున్నాయి. ఈ నెలలో మిగిలిన రోజుల్లో తెలంగాణ బంద్, దీపావళితో పాటు సండే సెలవులున్నాయి. ఇలా మొత్తంగా అక్టోబర్ లో దాదాపు పదిరోజులు సెలవులే ఉన్నాయి... కొన్నిచోట్ల స్థానిక పరిస్థుతులను బట్టి ఈ సెలవులు పెరగవచ్చు.