- Home
- Telangana
- School Holidays : విద్యార్థులకే కాదు ఉద్యోగులకు వరుస సెలవులు... అక్టోబర్ హాలిడేస్ లిస్ట్ ఇదే
School Holidays : విద్యార్థులకే కాదు ఉద్యోగులకు వరుస సెలవులు... అక్టోబర్ హాలిడేస్ లిస్ట్ ఇదే
October Holidays : అక్టోబర్ 2025 లో సెలవులే సెలవులు వస్తున్నాయి. కేవలం విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా బాగానే సెలవులు వచ్చాయి.. వస్తున్నాయి. మొత్తంగా ఈనెల సెలవుల నెలగా మారిపోయింది.

ఈ అక్టోబర్ హాలిడే హాలిడే లిస్ట్ పెద్దదే గురూ..!
School Holidays : దసరా సెలవులు ముగిశాయి. స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులే కాదు ఆఫీసులకు వెళ్లేందుకు ఉద్యోగులు కూడా కాస్త భారంగానే ఫీలవుతున్నారు. ఎందుకంటే విద్యార్థులకు వరుసగా 13 రోజులు సెలవులు వచ్చాయి…. అలాగే ఉద్యోగులకు బతుకమ్మ, దసరాకు అధికారిక సెలవులు... దుర్గాష్టమి, మహర్నవమి పర్వదినాలకు ఐచ్చిక సెలవులు ఇచ్చారు... వీటికి శని, ఆదివారం సెలవులు అదనం. ఇలా విద్యార్థులకు వరుసగా రెండువారాలు సెలవులు వస్తే ఉద్యోగులకు అందులో సగం అంటే ఆరేడురోజులు సెలవులు వచ్చాయి. అందుకే విద్యార్థుల మాదిరిగానే ఉద్యోగులకు ఈ వారం భారంగా గడుస్తోంది.
విద్యార్థులు, ఉద్యోగులకు ఊరట
అయితే దసరా సెలవులు ముగిసినా ఈ అక్టోబర్ లో మరికొన్ని సెలవులు ఉన్నాయి. దసరా స్థాయిలో కాకున్నా వరుసగా రెండుమూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఇవి దసరా సెలవులు ముగిసాయని బాధపడుతున్న విద్యార్థులు, ఉద్యోగులకు ఊరటనిస్తాయి. ఇలా ఈ అక్టోబర్ లో విద్యాసంస్థలు, ఆఫీసుల హాలిడే లిస్ట్ గురించి తెలుసుకుందాం... అందుకు తగ్గట్లుగా కుటుంబం, స్నేహితులతో పండగలు, టూర్స్ ప్లాన్ చేసుకొండి.
ఈ నెలలో ఇప్పటికే ముగిసిన హాలిడేస్
ఒకే నెలలో (అక్టోబర్ 2025) రెండు ప్రధాన పండగలు వచ్చాయి. ఇప్పటికే దసరా (అక్టోబర్ 02) వేడుకలు పూర్తవగా దీపావళి (అక్టోబర్ 20) కోసం ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరీముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులకు టపాసులు కాలుస్తూ సరదగా ఎంజాయ్ చేయడమే కాదు సెలవు వస్తుందన్న ఆనందం ఉంటుంది. ఉద్యోగులకు దీపావళికి బోనస్, గిప్టులతో పాటు సెలవు ఆనందం ఉంటుంది.
ఇలా ఈ అక్టోబర్ లో దసరాతో ప్రారంభమైన సెలవులు దీపావళితో ముగుస్తున్నాయి. అక్టోబర్ 1-3 వరకు స్కూళ్లకు దసరా సెలవులే కొనసాగాయి... ఇక శనివారం మినహాయిస్తే ఆదివారం సెలవే. అంటే ఈ నెల మొదటి ఐదురోజుల్లో స్కూళ్లు నడిచింది ఒక్కరోజే... వరుస సెలవులతో ప్రారంభమైన అక్టోబర్ లో మరిన్ని సెలవులున్నాయి.
అక్టోబర్ లో ఇక మిగిలిన సెలవులివే
అక్టోబర్ 11 రెండో శనివారం కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉంది. తర్వాత అక్టోబర్ 12 ఆదివారం ఎలాగూ సాధారణ సెలవే. ఇలా ఈ వీకెండ్ లో వరుసగా రెండ్రోజులు హాలిడేస్ వస్తున్నాయి.
వచ్చేవారం కూడా వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. అక్టోబర్ 20 (సోమవారం) దీపావళి పండగ... కాబట్టి స్కూళ్లకు అఫిషియల్ హాలిడే ఉంటుంది. ముందురోజు (అక్టోబర్ 19) ఆదివారమే కాబట్టి సెలవు. ఇలా దీపావళి సండే కలిసిరావడంతో రెండ్రోజులు పండగ సెలవులే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్టోబర్ 18 (శనివారం) ధన త్రయోదశి... ఈరోజు కూడా కొన్ని హిందూ ధార్మిక విద్యాసంస్థలు సెలవు ఇచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి కొందరు విద్యార్థులకు ఈ దీపావళికి మూడ్రోజులు సెలవులు వచ్చినా ఆశ్చర్యం లేదు.
అక్టోబర్ 26న ఆదివారం కాబట్టి సెలవు... దీనితో ఈ నెలలో సెలవుల జాబితా ముగుస్తుంది. మొత్తంగా దసరా, రెండో శనివారం, ఆదివారాలు, దీపావళితో లెక్కిస్తే అక్టోబర్ లో విద్యాసంస్థలకు తొమ్మిది లేదా పదిరోజుల సెలవులున్నాయి. ఈ సెలవుల్లో కుటుంబంసభ్యులతో కలిసి పండగలను సెలబ్రేట్ చేసుకోవచ్చు లేదంటే మంచి హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఈ నెలలో ఉద్యోగులకు సెలవులే సెలవులు
ఉద్యోగులకు కూడా అక్టోబర్ సెలవులతోనే ప్రారంభమయ్యింది. ఈ నెల మొదటితేదీ (అక్టోబర్ 1న) మహర్నవమి సందర్భంగా ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. తర్వాతిరోజు (అక్టోబర్ 2న) విజయదశమితో పాటు గాంధీ జయంతి వచ్చింది... ఆరోజు అధికారికంగా సెలవు. దసరా పండగ తర్వాతిరోజు అంటే అక్టోబర్ 3న తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు ఇచ్చింది. కొందరు ఉద్యోగులకు శనివారం వీకెండ్ సెలవు ఉంటుంది... దీనికితోడు అక్టోబర్ 4 యజ్ దహుంషర్ఫీ సందర్భంగా ఐచ్చిక సెలవు ఇచ్చారు. తర్వాతిరోజు ఆదివారమే కాబట్టి సెలవు. ఇలా అక్టోబర్ ప్రారంభంలోనే వరుసగా ఐద్రోజుల సెలవులు వచ్చాయి.
అక్టోబర్ 11, 12 (రెండో శనివారం, ఆదివారం) ఉద్యోగులకు సెలవు ఉంటుంది. దీపావళికి కూడా రెండ్రోజుల సెలవులు కలిసివస్తున్నాయి... అక్టోబర్ 19 ఆదివారమే కాదు నరక చతుర్దశి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది. తర్వాతిరోజు (అక్టోబర్ 20న) సోమవారం దీపావళి. ఈ నెలలో చివరగా అక్టోబర్ 26న ఆదివారం సెలవు వస్తోంది. ఇలా విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా అక్టోబర్ లో అధికంగానే సెలవులు వచ్చాయి... ఇంకా వస్తూనే ఉన్నాయి.