- Home
- Telangana
- School Holidays : ఈ ఒక్కరోజే స్కూళ్లు, ఆఫీసులు నడిచేది... తర్వాత వరుసగా పదిరోజులు సెలవులే
School Holidays : ఈ ఒక్కరోజే స్కూళ్లు, ఆఫీసులు నడిచేది... తర్వాత వరుసగా పదిరోజులు సెలవులే
August 8 to 17 Holidays : ఆగస్ట్ 7 అంటే గురువారం ఒక్కరోజు విద్యాసంస్ధలు, కాార్యాలయాలు పూర్తిగా నడిచేది. ఆగస్ట్ 8 శుక్రవారం నుండి వరుసగా పదిరోజులు సెలవులు పొందవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

ఆగస్ట్ 8 నుండి 17 వరకు సెలవులే సెలవులు
Holidays : తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే సమాచారమిది. కొద్దిగా మేనేజ్ చేస్తే చాలు... వరుసగా పదిరోజులు సెలవులు పొందే అద్భుత అవకాశం వచ్చింది. ఇలా ఆగస్ట్ 8 నుండి 17 వరకు అంటే పదిరోజుల్లో ఆరురోజులు సాధారణ సెలవులే. మధ్యలో నాల్రోజులు లీవ్ పెడితే చాలు... ఈ పదిరోజులు ఎంజాయ్ చేయవచ్చు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా ఈ సెలవులు పొందవచ్చు. ఏ రోజు ఎందుకు సెలవుంది? ఏరోజు లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది? ఇక్కడ తెలుసుకుందాం.
ఆగస్ట్ 8 సెలవు
వచ్చే శుక్రవారం(ఆగస్ట్ 8) నుండి తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు, ఉద్యోగులకు సెలవులు ప్రారంభం అవుతాయి. తెలుగింటి ఆడబిడ్డలు ప్రతి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం వరలక్ష్మివ్రతం జరుపుకుంటారు. సామాన్య గృహిణులే కాదు ఉద్యోగాలు చేసే మహిళలు కూడా భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. కాబట్టి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్ట్ 8న ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి. చాలా స్కూల్స్ కి కూడా హాలిడే ఉంటుంది… ఇంకొన్నిస్కూళ్లకు హాఫ్ డే ఉంది.
ఆగస్ట్ 9 సెలవు
ఇక ఆగస్ట్ 9 శనివారం రాఖీపౌర్ణమి/శ్రావణ పౌర్ణమి. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాల పండగ ఇది. తమ సోదరులకు ఆడబిడ్డలు రాఖీ కట్టి ప్రేమను ప్రదర్శిస్తారు... సోదరులు తమ తోబుట్టువుల బహుమతులిచ్చి ఆప్యాయతను చూపిస్తారు. ఈ అనురాగాల పండగ రాఖీ సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆప్షనల్ హాలిడే ఉంది. కానీ ఇది అవసరం లేకుండానే రెండో శనివారం సాధారణ సెలవు ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు పూర్తి సెలవు ఉంటుంది... ఉద్యోగులకు కూడా సెలవే.
ఆగస్ట్ 10 సెలవు
ఆగస్ట్ 10 ఆదివారం... ఎలాగూ సాధారణ సెలవే. ఇలా వరుసగా మూడ్రోజులు విద్యాసంస్థలు, ఉద్యోగులకు సెలవులు వస్తున్నాయి. ఈ సెలవుల్లో పండగలను ఘనంగా జరుపుకుంటూ కుటుంబసభ్యులతో ఆనందంగా గడపవచ్చు.
ఆగస్ట్ 11 నుండి 14 వరకు మేనేజ్ చేయండి
వరుసగా మూడ్రోజుల సెలవుల తర్వాత సోమవారం విద్యాసంస్థలు, కార్యాలయాలు తిరిగా ప్రారంభం అవుతాయి. అయితే కేవలం నాల్రోజులే నడిచేది. తిరిగి మరో మూడ్రోజులు వరుస సెలవులు వస్తాయి.
ఆగస్ట్ 11 నుండి 14 వరకు మేనేజ్ చేసుకోగలిగితే చాలు... అంటే లీవ్ తీసుకుంటే చాలు అటు మూడ్రోజులు(ఆగస్ట్ 8,9,10), ఇటు మూడ్రోజులు (ఆగస్ట్ 15,16,17) సెలవులు కలిసివస్తాయి. అంటే మొత్తంగా లీవ్స్ తో కలిపి పదిరోజులు సెలవు పొందవచ్చు.
విద్యార్థులు మధ్యలో నాల్రోజులు స్కూల్ కి వెళ్లినా సరదాగా గడిచిపోతుంది. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం సన్నాహాలు, ఆటలపోటీలతోనే సరిపోతుంది... ఈ నాల్రోజులు క్లాసులు నడిచేది చాలా తక్కువ. కాబట్టి స్కూలుకి వెళ్ళినా విద్యార్థులపై చదువుల ఒత్తిడి ఉండదు... ఆటపాటలతో ఎంజాయ్ చేయవచ్చు.
ఆగస్ట్ 15 సెలవు
ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం. దేశవ్యాప్తంగా జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. విద్యాసంస్థల్లో త్రివర్ణ పతాకం ఎగరేస్తారు, సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం స్వీట్లు ఇచ్చి విద్యార్థులకు ఇంటికి పంపిస్తారు. అంటే ఈరోజు సెలవు అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జెండా ఆవిష్కరణ తర్వాత సెలవే.
ఆగస్ట్ 16 సెలవు
ఇక ఆగస్ట్ 16 శనివారం హిందువుల పండగ శ్రీకృష్ణాష్టమి... అంటే కృష్ణుడి పుట్టినరోజు. ఈరోజు తమ పిల్లలను కృష్ణుడు, గోపికలుగా తయారుచేసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు... అలాగే ఉట్టికొట్టడం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ పండగ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంది.
ఆగస్ట్ 17 సెలవు
ఆగస్ట్ 17 ఆదివారం... సాధారణంగా సెలవు ఉంటుంది. ఇలా వరుసగా రెండువారాలు లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. మధ్యలో నాల్రోజులు మాత్రమే పనిదినాలు ఉన్నాయి. ఈ రోజుల్లో స్కూల్లో, కార్యాలయాల్లో మేనేజ్ చేయగలిగిన విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా పదిరోజులు సెలవులే. అంటే రేపు(గురువారం) ఒక్కరోజు మినహాయిస్తే వరుసగా పదిరోజులు సెలవులే అన్నమాట.