MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Sathya sai: సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల సేవా ప్రయాణం

Sathya sai: సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల సేవా ప్రయాణం

Sathya sai: కర్ణాటకలోని ముద్దేనహళ్లి పేరు వినగానే భారతరత్న సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య, భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా గుర్తుకొస్తారు. విశ్వేశ్వరయ్య జన్మస్థలం అయిన ముద్దేనహళ్లిలో ఏర్పడిన విద్యా ప్రాంగణం కాలక్రమంలో విశాలమైన సేవా కేంద్రంగా ఎదిగింది.

5 Min read
Author : Narender Vaitla
Published : Sep 27 2026, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మడియాల నారాయణ భట్‌ సంకల్పంతో సత్యసాయి గ్రామానికి శ్రీకారం
Image Credit : Asianet News

మడియాల నారాయణ భట్‌ సంకల్పంతో సత్యసాయి గ్రామానికి శ్రీకారం

నందిగిరి పర్వతపాద ప్రాంతంలో ఉన్న ముద్దేనహళ్లిని ‘సిద్ధసంకల్ప క్షేత్రం’గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో సత్యసాయి గ్రామం ఆవిర్భావానికి శ్రీ మడియాల నారాయణ భట్‌ కీలక పాత్ర పోషించారు. 1927లో దక్షిణ కన్నడ జిల్లాలోని అలికె గ్రామంలో జన్మించిన నారాయణ భట్‌ విద్య ద్వారా సమాజ సంస్కరణ సాధ్యమని బలంగా విశ్వసించారు. దేశ పునరుజ్జీవనానికి లక్షలాది మంది త్యాగజీవులు అవసరమనే భావనతో ఆయన అనేక మందిని సేవా మార్గంలో నడిపించారు.

ఉపాధ్యాయుడిగా పనిచేయాలన్నది ఆయన చిన్ననాటి కల. 1960లో అలికెలో ‘లోకసేవా వృంద’ను ప్రారంభించారు. 1961లో ‘శ్రీ సత్యసాయి లోకసేవా ప్రౌఢశాల’ను స్థాపించారు. ఈ పాఠశాలకు కర్ణాటకవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. మరిన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలన్న సూచనలు వచ్చిన సమయంలో చిక్కబళ్లాపుర తాలూకాలోని ముద్దేనహళ్లి నారాయణ భట్‌కు ప్రత్యేకంగా నచ్చింది. తన గురువు, దైవంగా భావించే భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబాను కలుసుకోవడానికి అనుకూలమైన ప్రాంతం కావడం కూడా దీనికి ఒక కారణంగా నిలిచింది.

1971లో బాబా సూచనతో ముద్దేనహళ్లిలో విద్యాసంస్థ ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. 1973లో బాబా మణిపాల్‌ పర్యటన సందర్భంగా ముద్దేనహళ్లి క్యాంపస్‌కు స్వయంగా ‘సత్యసాయి గ్రామం’ అని పేరు పెట్టారు. నారాయణ భట్‌ ఆదేశాలతో బి.ఎన్. నరసింహమూర్తి ముద్దేనహళ్లికి చేరుకుని విద్యాసంస్థల అభివృద్ధికి అంకితమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1973లో పాఠశాల ప్రారంభం.. రికార్డు స్థాయి ఫలితాలతో ప్రత్యేక గుర్తింపు
Image Credit : Asianet News

1973లో పాఠశాల ప్రారంభం.. రికార్డు స్థాయి ఫలితాలతో ప్రత్యేక గుర్తింపు

ముద్దేనహళ్లిలో తొలి వసతి సదుపాయాలతో కూడిన ఉన్నత పాఠశాల 1973 జూన్‌ 11న ప్రారంభమైంది. తొలి దశలో 27 మంది విద్యార్థులతో సాగిన ఈ విద్యాసంస్థ 1976 నాటికి 100 మంది విద్యార్థులకు చేరుకుంది. అదే ఏడాది తొలి బ్యాచ్‌ ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి అవిభాజ్య కోలార్‌ జిల్లాలో ఇప్పటివరకు నమోదు కాని 100 శాతం ఫలితాలను సాధించడం ద్వారా ‘లోకసేవా వృంద గురుకుల పాఠశాల’ ప్రత్యేక రికార్డు సృష్టించింది.

విద్యతో పాటు సంస్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం సంస్థకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. 1977లో 5వ తరగతి ప్రారంభించగా, 1982లో ప్రీ-యూనివర్సిటీ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో సుమారు 70 శాతం మంది విద్యార్థులు హాస్టల్‌లోనే ఉండేవారు. మరో 20 శాతం మంది సమీప గ్రామాల నుంచి వచ్చి వెళ్లేవారు. విద్యార్థుల నుంచి పాఠశాల ఫీజు వసూలు చేయకుండా, హాస్టల్‌లో ఉండేవారి నుంచి వసతి ఖర్చులను మాత్రమే తీసుకునే విధానం ఉండేది. మొత్తం ఖర్చును విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విభజించి వసూలు చేసేవారు.

1976లో 100గా ఉన్న విద్యార్థుల సంఖ్య 1982 నాటికి 400కు చేరింది. తొలుత కన్నడ మాధ్యమంలో మాత్రమే బోధన సాగగా, తర్వాత కన్నడ, ఇంగ్లిష్‌ రెండు మాధ్యమాల్లో విద్య అందించే విధానం ప్రారంభమైంది. 1977 జనవరి 8న నారాయణ భట్‌ ప్రమాదంలో మరణించారు. ఆయన కోరిక మేరకు సంస్థలను 1976 జనవరి 6న భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబాకు సమర్పించారు. అనంతరం బాబా సంస్థల బాధ్యతను స్వీకరించి, వాటి నిర్వహణకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు.

35
బాబా సేవా దృక్పథంతో విద్యా ప్రాంగణం నుంచి విశాల సేవా కేంద్రంగా
Image Credit : Asianet News

బాబా సేవా దృక్పథంతో విద్యా ప్రాంగణం నుంచి విశాల సేవా కేంద్రంగా

భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా తొలిసారిగా 1978 ఆగస్టు 14న ముద్దేనహళ్లికి వచ్చారు. ఆయన సూచనతో ‘లోకసేవా వృంద’ పేరు ‘శ్రీ సత్యసాయి లోకసేవా ట్రస్ట్‌’గా మారింది. బాబా ఆధ్వర్యంలో అనేక భవనాలు నిర్మించబడ్డాయి. సత్యసాయి గ్రామాన్ని ఆయన మొత్తం 30 సార్లు సందర్శించగా, 2009 ఫిబ్రవరి 14న చివరిసారిగా ఇక్కడికి వచ్చారు.

2011లో భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఆయన సూక్ష్మరూపంలో మార్గదర్శకత్వం అందించారనే విశ్వాసం అనుచరుల్లో ఉంది. బాబా అనుచరుడు, విద్యార్థి అయిన మధుసూదన్‌ నాయుడు అనంతరం నిరంతర సాధనతో సద్గురు శ్రీ మధుసూదన సాయిగా ప్రజాదరణ పొందారు. ప్రస్తుతం ముద్దేనహళ్లినే తన కర్మభూమిగా చేసుకుని బాబా ఆశయాలను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.

సద్గురు నాయకత్వంలో సత్యసాయి గ్రామం విద్యతో పాటు వైద్యం, పౌష్టికాహారం, ఆధ్యాత్మిక సేవలకు కేంద్రంగా మారింది. ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌’కు ఇది ప్రపంచ కేంద్రంగా నిలిచింది. సుమారు 100 దేశాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. గత ఏడాది సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా నిర్వహించిన విశ్వ సాంస్కృతిక మహోత్సవం సుదీర్ఘ సాంస్కృతిక ఉత్సవంగా రికార్డు సృష్టించింది. ముగింపు కార్యక్రమంలో జరిగిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రాలో 65 దేశాలకు చెందిన కళాకారులు పాల్గొనడం మరో రికార్డుగా నిలిచింది.

45
విద్య నుంచి వైద్యం, పౌష్టికాహారం వరకు.. ‘మినీ భారత్‌’గా సత్యసాయి గ్రామం
Image Credit : Asianet News

విద్య నుంచి వైద్యం, పౌష్టికాహారం వరకు.. ‘మినీ భారత్‌’గా సత్యసాయి గ్రామం

నేడు ముద్దేనహళ్లిలోని సత్యసాయి గ్రామాన్ని సందర్శిస్తే ఒకే ప్రాంగణంలో అనేక సేవా కార్యక్రమాలు కనిపిస్తాయి. ఉత్తర ప్రాంతం నుంచి వచ్చే వారికి ముందుగా ‘సాయి ష్యూర్‌’ కర్మాగారం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా పిల్లలకు ఉచిత పౌష్టిక అల్పాహారం అందించే కార్యక్రమానికి ఇది కేంద్రంగా పనిచేస్తోంది. అక్కడి నుంచి ముందుకు వెళ్తే ఆధ్యాత్మికత, జీవన విలువలపై మార్గదర్శకత్వం అందించే పుస్తకాల విక్రయ కేంద్రం కనిపిస్తుంది.

అమెరికా క్యాపిటల్‌ భవన నిర్మాణశైలిని పోలిన ఆసుపత్రి భవనం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శ్రీ మధుసూదన సాయి ఆసుపత్రి ప్రతిరోజూ వేలాది మంది రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. శ్రీ సత్యసాయి మానవ అభ్యుదయ విశ్వవిద్యాలయం పీజీ కేంద్రంతో పాటు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల కోసం తరగతి గదులు, వసతి గృహాలు ఉన్నాయి.

ఒకప్పుడు కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభమైన చిన్న విద్యాసంస్థ నేడు వేలాది మంది విద్యార్థులు, రోగులు, ఆధ్యాత్మిక సాధకులకు సేవలు అందించే విస్తారమైన సముదాయంగా మారింది. మడియాల నారాయణ భట్‌ ప్రారంభించిన సేవా సంకల్పం ఐదు దశాబ్దాల తర్వాత ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌’ రూపంలో ప్రపంచవ్యాప్త మానవతా ఉద్యమంగా విస్తరించింది.

55
‘కంపాషన్ ఇన్ యాక్షన్‌’లో సద్గురు.. నైపుణ్య విద్య, విలువల విద్యపై దృష్టి
Image Credit : Asianet News

‘కంపాషన్ ఇన్ యాక్షన్‌’లో సద్గురు.. నైపుణ్య విద్య, విలువల విద్యపై దృష్టి

సత్యసాయి గ్రామం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ నగరాల్లో ‘కంపాషన్ ఇన్ యాక్షన్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 25న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌’ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి పాల్గొన్నారు. టాలీవుడ్‌ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్‌ చైర్మన్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ దగ్గుబాటి సురేశ్‌బాబు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

పారిశ్రామిక రంగ అవసరాలకు, ప్రస్తుత విద్యా విధానానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సద్గురు తెలిపారు. నైపుణ్యాధారిత స్వల్పకాలిక కోర్సులు ప్రస్తుత తక్షణ అవసరం అని త్వరలో తమ విద్యాసంస్థల్లో ఇలాంటి కోర్సులను రూపొందించనున్నట్లు చెప్పారు. అమెరికాతో పాటు పలు అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యార్థులు దీర్ఘకాలిక కోర్సుల పట్ల ఆసక్తి చూపడం లేదని, భారత్‌లో కళాశాలల్లో నేర్చుకునే అంశాలకు పారిశ్రామిక అవసరాలకు మధ్య వ్యత్యాసం ఉందని వివరించారు.

విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారకూడదని, విలువలు, నైతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సద్గురు సూచించారు. నైతిక విద్య తరగతులను కొందరు తల్లిదండ్రులు సమయం వృథాగా భావిస్తున్నారని, యువతపై దీనివల్ల ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు. జెన్‌-జీపై ఉన్న అభ్యంతరాల గురించి అడిగినప్పుడు ఈ తరం యువత పెద్దల కంటే వేగంగా నేర్చుకుంటారని, చురుకుగా ఉంటారని చెప్పారు. అదే సమయంలో యువత నిదానంగా జీవించడాన్ని కూడా అలవాటు చేసుకోవాలని సూచించారు.

ముద్దేనహళ్లిలోని మధుసూదన సాయి వైద్య విజ్ఞాన, పరిశోధనా సంస్థలో పలు వైద్య పరిశోధనలు జరుగుతున్నాయని సద్గురు తెలిపారు. వెల్‌నెస్‌, లాంజివిటీ కోసం నాలుగు విధానాలను సమన్వయం చేసిన చికిత్సా పద్ధతిని రూపొందించామని, దానికి పేటెంట్‌ పొందేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రెసిషన్‌ మెడిసిన్‌, టార్గెటెడ్‌ మెడిసిన్‌, జీనోమిక్స్‌ వంటి అంశాలపై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం క్యాంపస్‌లో 10వ తరగతి చదువుతున్న భావన తన జీవిత అనుభవాన్ని పంచుకున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్న ఆమె, సద్గురు తనకు అండగా నిలిచి భవిష్యత్తుపై ఆశలు కల్పించారని భావోద్వేగానికి గురయ్యారు.

కార్పొరేట్‌ కంపెనీల అధిపతులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి వాస్తవ సమస్యలను గమనించి పరిష్కారాలను రూపొందించాలని లాయిడ్స్‌ టెక్నాలజీ సెంటర్‌ ఆపరేషన్స్‌ విభాగం అధిపతి రాజేష్‌ కె.ఎస్. సూచించారు. సత్యసాయి సంజీవని ఆసుపత్రుల సమూహానికి చెందిన ట్రస్ట్‌ ఆఫీసర్‌ సౌమ్య కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కాన్సల్‌ జనరల్‌ లోరా విలియమ్స్‌ సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇలా ముద్దేనహళ్లిలో చిన్న విద్యాసంస్థగా ప్రారంభమైన సత్యసాయి గ్రామం ఐదు దశాబ్దాల్లో విద్య, వైద్యం, పౌష్టికాహారం, విలువల విద్య, ఆధ్యాత్మిక సేవలకు కేంద్రంగా ఎదిగింది. మడియాల నారాయణ భట్‌ ప్రారంభించిన సేవా సంకల్పం కాలానుగుణంగా విస్తరిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా మానవతా సేవలకు వారధిగా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AI in Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో అధునాతన టెక్నాలజీ.. ఏఐతో మరింత కచ్చితత్వం
Recommended image2
Ganesh Laddu Auction 2026: ఈసారి అత్యధిక ధర పలికిన టాప్ 10 లడ్డూ వేలాలు ఇవే
Recommended image3
KTR: చాలా ఏళ్ల త‌ర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నా.. వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ట్వీట్
Related Stories
Recommended image1
Snakes: మీ ఇంటి దగ్గర ఈ చెట్లు ఉన్నాయా.? పాములు క్యూ క‌ట్ట‌డం ఖాయం
Recommended image2
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved