MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Rain Alert: ఆ రెండు రోజులు అత్యంత జాగ్రత్త.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్లకల్లోలమే

Rain Alert: ఆ రెండు రోజులు అత్యంత జాగ్రత్త.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్లకల్లోలమే

Rain Alert: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రానున్న రోజుల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 14 2026, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల జోరు
Image Credit : Gemini AI

రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల జోరు

భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం తెలంగాణలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఇవి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పూర్తిగా కవర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 18 నుంచి 20 తేదీల మధ్య వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Image Credit : Gemini

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల్లో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.

35
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Image Credit : Gemini AI

సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌తో పాటు జిల్లాల యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీసులు, ట్రాఫిక్ విభాగం, మున్సిపల్ శాఖ, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. రోడ్లు, వంతెనలు, కల్వర్టుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రజారవాణాకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు.

45
రంగంలోకి హైడ్రా బైక్ టీమ్‌లు.. అత్యవసర సేవలకు సిద్ధం
Image Credit : Asianet News

రంగంలోకి హైడ్రా బైక్ టీమ్‌లు.. అత్యవసర సేవలకు సిద్ధం

హైదరాబాద్ నగరంలో వర్షాల సమయంలో వేగంగా స్పందించేందుకు హైడ్రా బైక్ టీమ్‌లు ఇప్పటికే రంగంలోకి దిగాయి. పెద్ద వాహనాలు చేరలేని ప్రాంతాల్లో ఈ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మొత్తం 20 ప్రత్యేక బైక్‌లతో 60 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. చెట్లు కూలిపోవడం, రోడ్లపై అవరోధాలు ఏర్పడటం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం వంటి పరిస్థితుల్లో ఈ బృందాలు వెంటనే స్పందిస్తున్నాయి. ఇటీవల నగరంలో వర్షాల కారణంగా వందల సంఖ్యలో చెట్లు కూలిపోగా, హైడ్రా బృందాలు వాటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించాయి.

55
ప్రజలకు సూచనలు.. ప్రయాణాల్లో జాగ్రత్తలు
Image Credit : Asianet News

ప్రజలకు సూచనలు.. ప్రయాణాల్లో జాగ్రత్తలు

భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యమవడంతో పాటు కొన్ని విమానాలను ఇతర నగరాలకు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో కూడా వాతావరణ ప్రభావం రవాణా వ్యవస్థపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాబోయే వారం రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నందున రైతులు, ప్రయాణికులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
వాతావరణం
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్యార‌డైజ్ హోట‌ల్‌కు ఆ పేరు ఎలా వ‌చ్చింది.? సినిమా థియేట‌ర్‌కి రెస్టారెంట్‌కి సంబంధం ఏంటి?
Recommended image2
Now Playing
AP Telangana Weather:బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్ | Asianet Telugu
Recommended image3
Holidays : వచ్చే సోమవారం కూడా సెలవే... ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Raincoat: వర్షంలో బయటకు వెళ్తుంటారా.? ఈ బాల్ ఉంటే చాలు అస్స‌లు త‌డ‌వ‌రు
Recommended image2
దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved