MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad Power Cuts : నగరంలో నేడు కరెంట్ కోతలు.. ఏ ప్రాంతాల్లో, ఏ సమయాల్లో, ఎందుకు కరెంట్ ఉండదంటే...

Hyderabad Power Cuts : నగరంలో నేడు కరెంట్ కోతలు.. ఏ ప్రాంతాల్లో, ఏ సమయాల్లో, ఎందుకు కరెంట్ ఉండదంటే...

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో జూన్ 17న అంటే ఇవాళ పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఇలా కరెంట్ ఉండని ప్రాంతాలేవి? ఏ సమయంలో ఎందుకు సరఫరా నిలిపివేస్తారు? ఇక్కడ తెలుసుకుందాం.  

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 17 2025, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్ లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
Image Credit : our own

హైదరాబాద్ లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Telangana Power Cuts : సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు అధికంగా ఉంటాయి... వర్షం కురిసే సమయంలోనే కాదు మిగతా సమయాల్లో కూడా వివిధ కారణాలతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. ఇక కొన్నిసార్లు సాంకేతిక సమస్యల కారణంగా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ముఖ్యంగా ఈదురుగాలులు, పిడుగుపాట్ల కారణంగా పోల్స్ దెబ్బతినడం, తీగలు తెగిపడటం, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం... ఇలా వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే కారణాలు అనేకం ఉన్నాయి.

అయితే పల్లెటూళ్లు, చిన్నచిన్న పట్టణాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పెద్దగా సమస్య ఉండదు... కానీ హైదరాబాద్ వంటి మహానగరాల్లో కరెంట్ పోతే చాలా కష్టం. అన్ని పనులకోసం ఎలక్ట్రిక్ వస్తువులను ఎక్కువగా వినియోగిస్తుంటారు నగరవాసులు.. అలాంటప్పుడు విద్యుత్ సమస్యలు తీవ్ర ఇబ్బంది పెడతాయి. 

సాంకేతిక కారణాలతో కరెంట్ పోతే ఏం చేయలేం... కానీ అధికారులు మెయింటెనెన్స్ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ముందుగానే సమాచారం ఇస్తారు. దీని ప్రకారం ముందుగానే ప్లాన్ చేసుకుంటే కరెంట్ పోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

ఇలా ఇవాళ(జూలై 17 మంగళవారం) హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రిసిటి అధికారులు ప్రకటించారు. కాబట్టి ఏ ప్రాంతాల్లో ఎంతసేపు కరెంట్ ఉండదో ఇక్కడ తెలుసుకుందాం. ఆ ప్రాంతాల ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకుంటే చాలు... కరెంట్ లేకున్నా సమస్య ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జూన్ 17న హైదరాబాద్ కరెంట్ ఉండని ప్రాంతాలివే...
Image Credit : our own

జూన్ 17న హైదరాబాద్ కరెంట్ ఉండని ప్రాంతాలివే...

ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వర్షాకాలంలో ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైర్లు, పోల్స్ పై పడే అవకాశం ఉంటుంది.. కాబట్టి ముందుగానే ఇలా ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయిస్తుంటారు. దీంతోపాటు మరికొన్ని మెయింటెనెన్స్ పనులకోసం అంబర్ పేట పరిధిలోని విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

అంబర్ పేట, విద్యానగర్, కాచీగూడ ప్రాంతాల్లో ఉదయం నుండే విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. ఫీవర్ హాస్పిటల్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ప్రకటించారు . దీని పరిధిలోకి వచ్చే ఫీవర్ హాస్పిటల్, అంజయ్య క్వార్టర్స్, విద్యానగర్, బర్కత్ పురా పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదన్నమాట.

35
హైదరాబాద్ లోని ప్రాంతాల్లోనూ కరెంట్ ఉండదు...
Image Credit : our own

హైదరాబాద్ లోని ప్రాంతాల్లోనూ కరెంట్ ఉండదు...

ఇక బర్కత్ పురా బస్ డిపో ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. మెయింటెనెన్స్ పనుల తర్వాత తిరిగి కరెంట్ సరఫరాను పునరుద్దరిస్తారు. ఈ ఫీడర్ పరిధిలోని రత్న నగర్, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అరవింద్ డిగ్రీ కాలేజీ పరిసర ప్రాంతాలున్నాయి... ఇక్కడ మధ్యాహ్నమంతా కరెంట్ ఉండదు.

కాచీగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో కూడా మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. కాచీగూడ రైల్వే స్టేషన్ ఫీడర్ పరిధిలో మెయింటెనెన్స్ పనుల నిమిత్తం కరెంట్ తీసేయనున్నారు. మధ్యాహ్నం 3.30 నుండి  సాయంత్రం 5 గంటలవరకు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు బస్ డిపో, బిజెపి ఆపీస్ లేన్, పారగాన్ అపార్ట్ మెంట్ లేన్, వైఎంసిఏ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు.

45
ఈ ప్రాంతాల ప్రజలు ముందుగానే జాగ్రత్త పడండి..
Image Credit : our own

ఈ ప్రాంతాల ప్రజలు ముందుగానే జాగ్రత్త పడండి..

ఇలా విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాల ప్రజలు ముందుగానే జాగ్రత్తపడితే మంచిది. మీ ఫోన్లను ఫుల్ చార్జింగ్ చేసుకోవాలి... లేదంటే ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అలాగే ఈవి స్కూటర్లు, కార్లను కూడా ఫుల్ చార్జింగ్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ వస్తువుల అవసరం ఉంటే ఎప్పుడు ఉపయోగించాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. 

వ్యాపార సముదాయాల్లో అయితే విద్యుత్ కోతల వేళ బిజినెస్ కు ఇబ్బందిలేకుండా జనరేటర్లు లేదంటే ఇన్వర్టర్లు రెడీ చేసుకోవాలి. పెద్దపెద్ద అపార్ట్ మెంట్స్ లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కారణంగా లిప్టులు పనిచేయవు. కాబట్టి అందులో ఉండే ప్రజలు కరెంట్ ఉన్న సమయంలో పనులు చక్కబెట్టుకోవాలి. 

55
మీ ప్రాంతంలో విద్యుత్ సమస్యలుంటే ఈ నంబర్లకు కాల్ చేయండి..
Image Credit : our own

మీ ప్రాంతంలో విద్యుత్ సమస్యలుంటే ఈ నంబర్లకు కాల్ చేయండి..

హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఎక్కడ ఎలాంటి విద్యుత్ సమస్యలున్నా పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉంటారు.. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా సమస్యను తెలియజేయడమే. ఇందుకోసం రాష్ట్ర విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లను నిర్వహిస్తోంది... ఫోన్ చేసి సమస్య చెబితే చాలు అధికారులు పరిష్కారానికి చర్యలు చేపడతారు.

విద్యుత్ కోతలతో పాటు ఇతర ఎలక్ట్రిసిటీ సమస్యల కోసం TSNPDCL టోల్ ఫ్రీ నంబర్ 1800-4252424 కు గానీ TSSPDCL నంబర్ 1800-599-01912 నంబర్లకు కాల్ చేయవచ్చు. లేదంటే 1912 హెల్ప్ లైన్ నంబర్ కాల్ చేసి కస్టమర్ సర్వీస్ ప్రతినిధిని సంప్రదించవచ్చు. వారి సూచనలను పాటించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.

ఇక తెలంగాణ విద్యుత్ శాఖ అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా ఏదయినా సమస్య ఉంటే ఫిర్యాదు చేయవచ్చు... వెంటనే పరిష్కారం పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఇవేవీ కాదంటే స్థానిక విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Cyclone Murasu : ఏపీనే కాదు తెలంగాణను వదలని మురసు తుపాను.. ఇక కుండపోత వర్షాలే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image2
వారికి వెంట‌నే చేయూత పింఛ‌న్‌.. కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం
Recommended image3
పేరుకు గ‌ర్ల్స్ హాస్ట‌ల్‌, లోప‌ల జ‌రిగేది మాత్రం వేరే క‌థ‌.. యువ‌తుల నుంచి అండాలను సేక‌రిస్తూ
Related Stories
Recommended image1
Hyderabad : ఓల్డ్ సిటీ ముందు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లు జూజుబి... ఇక్కడ గజం ధర ఎంతో తెలుసా?
Recommended image2
Hyderabad: గాలిలో కారు పార్కింగ్‌.. హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం, ఎక్క‌డంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved