MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • PM Modi: పెళ్లి కోసం ప్లాన్ మార్చుకున్న మోదీ.. 18 కిలోమీటర్లు రోడ్డుపైనే ప్రయాణం.. వైరలవుతున్న ప్రధాని నిర్ణయం!

PM Modi: పెళ్లి కోసం ప్లాన్ మార్చుకున్న మోదీ.. 18 కిలోమీటర్లు రోడ్డుపైనే ప్రయాణం.. వైరలవుతున్న ప్రధాని నిర్ణయం!

PM Modi : హైదరాబాద్ పర్యటన సందర్భంగా పెళ్లి బృందానికి ఇబ్బంది కలగకూడదని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రధాని తన హెలికాప్టర్ ల్యాండింగ్‌ను మార్చుకుని 18 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 10 2026, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెక్యూరిటీ కంటే జనమే ముఖ్యం: ప్రధాని మోదీ తీసుకున్న డెసిషన్ మామూలుగా లేదుగా
Image Credit : Asianet News

సెక్యూరిటీ కంటే జనమే ముఖ్యం: ప్రధాని మోదీ తీసుకున్న డెసిషన్ మామూలుగా లేదుగా

హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నిర్ణయంతో అందరి మనసు గెలుచుకున్నారు. ఒక వివాహ వేడుకకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో తన హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లాన్‌ను చివరి నిమిషంలో మార్చుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఆయన హైటెక్స్ వద్ద హెలికాప్టర్‌లో దిగాల్సి ఉంది. అయితే, సరిగ్గా అక్కడే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎం.సి. కోటి రెడ్డి కుమారుడు అజిత్ రెడ్డి, ఐపీఎస్ అధికారిణి లక్ష్మి సౌజన్యల వివాహం జరుగుతోందని మోదీ దృష్టికి వచ్చింది. ఈ పెళ్లి కోసం సుమారు 5,000 మంది అతిథులను ఆహ్వానించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రధాని తీసుకున్న నిర్ణయం ఇదే
Image Credit : Asianet News

ప్రధాని తీసుకున్న నిర్ణయం ఇదే

ప్రధాని వస్తున్నారంటే భద్రతా ఏర్పాట్లు చాలా కఠినంగా ఉంటాయి. చివరి నిమిషంలో అక్కడ హెలికాప్టర్ దిగితే, సెక్యూరిటీ కారణాల వల్ల పెళ్లికి వచ్చే వేలాది మంది అతిథులు తీవ్ర ఇబ్బందులు పడతారని ప్రధాని భావించారు. రాజకీయాలో ఏవైనా ఉండొచ్చు, కానీ సామాన్యులకు ఇబ్బంది కలగకూడదని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే తన హెలికాప్టర్ ప్లాన్‌ను క్యాన్సిల్ చేసుకుని, దాదాపు 18 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలోనే ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకున్నారు.

ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. "రాజకీయ విభేదాల కంటే ప్రజల సౌకర్యమే ముఖ్యం" అని నిరూపించిన ప్రధానిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక పక్క వీవీఐపీ ప్రోటోకాల్ ఉన్నా, సామాన్యుల పెళ్లి వేడుక చెడిపోకూడదని మోదీ చూపిన చొరవ ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

34
బెంగళూరులో పీఎం మోదీ పర్యటన వేళ హైఅలెర్ట్
Image Credit : X

బెంగళూరులో పీఎం మోదీ పర్యటన వేళ హైఅలెర్ట్

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేగింది. ప్రధాని వెళ్లాల్సిన మార్గంలో, సభా ప్రాంగణానికి అతి సమీపంలో పేలుడు పదార్థాలను తయారు చేసేందుకు ఉపయోగించే 'జిలెటిన్ స్టిక్స్' లభించడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో భద్రతా సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

44
బెంగళూరులో ఏం జరిగిందంటే?
Image Credit : Asianet News

బెంగళూరులో ఏం జరిగిందంటే?

బెంగళూరులోని కగలిపుర ప్రాంతంలో ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని రాకకు ముందు పోలీసులు, భద్రతా సిబ్బంది సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఫుట్‌పాత్ పక్కన రెండు జిలెటిన్ స్టిక్స్ పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు.

ప్రధాని మోదీ పాల్గొనే ప్రధాన కార్యక్రమం జరిగే ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గానికి సమీపంలోనే ఇవి ఉండటంతో సెక్యూరిటీ ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా గాలిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి అసలు వీటిని ఎందుకు అక్కడ పెట్టాడు? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
నరేంద్ర మోదీ
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Credit Card: క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది? వడ్డీ భారం నుంచి ఎలా తప్పించుకోవాలి?
Recommended image2
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved