MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • PM kisan: పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలో పడలేదా? రైతులు వెంటనే చేయాల్సిన పనులివే!

PM kisan: పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలో పడలేదా? రైతులు వెంటనే చేయాల్సిన పనులివే!

PM Kisan 24th Installment: పీఎం కిసాన్ 24వ విడత రూ.2,000 పడలేదా? అయితే, వెంటనే రైతుల కొన్ని పనులు చేస్తే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 30 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీఎం కిసాన్ రూ.2,000 ఇంకా పడలేదా? రైతులు వెంటనే ఈ ఒక్క పని చేయండి!
Image Credit : chatgpt

పీఎం కిసాన్ రూ.2,000 ఇంకా పడలేదా? రైతులు వెంటనే ఈ ఒక్క పని చేయండి!

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లోకి ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం జమ చేస్తుందన్న సంగతి తెలిసిందే. తాజాగా 24వ విడత కింద కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేసే కార్యక్రమం చేపట్టారు.

అయితే చాలా మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు నేరుగా జమ కాగా, మరికొందరికి మాత్రం ఇంకా రాలేదు. ఇలా నిధులు జమ కాని వారు ఎలాంటి కంగారు పడకుండా, ముందుగా ఎందుకు ఆగిపోయాయో తెలుసుకుని కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆన్‌లైన్‌లో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం
Image Credit : AI

ఆన్‌లైన్‌లో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం

మీ ఖాతాలో డబ్బులు ఎందుకు పడలేదు లేదా పథకం వివరాలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి ముందుగా ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

• మొదటగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) ఓపెన్ చేయాలి.

• హోమ్‌పేజీలో కనిపించే 'Farmers Corner' సెక్షన్‌లోకి వెళ్లి 'Know Your Status' పై క్లిక్ చేయాలి.

• మీ రిజిస్ట్రేషన్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Get Data' లేదా 'Get OTP' పైన క్లిక్ చేయాలి.

• మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీ పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అందులో ఈకేవైసీ, ల్యాండ్ సీడింగ్, ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ 'YES' ఉందో లేదో సరిచూసుకోవాలి.

35
డబ్బులు పడకపోతే రైతులు వెంటనే చేయాల్సిన పనులు
Image Credit : chatgpt

డబ్బులు పడకపోతే రైతులు వెంటనే చేయాల్సిన పనులు

స్టేటస్ చెక్ చేసినప్పుడు ఏదైనా ఒక అంశం వద్ద 'NO' అని కనిపిస్తే లేదా సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు ఆగిపోయి ఉంటే రైతులు వెంటనే కింద పేర్కొన్న పనులు పూర్తి చేయాలి..

• ఈ-కేవైసీ పెండింగ్ ఉంటే: అధికారిక పోర్టల్‌లో ఆధార్ నంబర్, మొబైల్ ఓటీపీ ద్వారా వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. లేదా సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కూడా చేయించుకోవచ్చు.

• ఆధార్-బ్యాంక్ సీడింగ్ సమస్య ఉంటే: మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి ఆధార్ కార్డును ఖాతాకు లింక్ చేయించడంతో పాటు ఎన్‌పీసీఐ / డీబీటీ మ్యాపింగ్ యాక్టివేట్ చేయమని కోరాలి.

• ల్యాండ్ సీడింగ్ సమస్య ఉంటే: మీ భూమి పాస్‌బుక్, ఆధార్ కార్డు, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ కాపీ తీసుకుని మీ ప్రాంతంలోని మండల వ్యవసాయ అధికారిని లేదా రెవెన్యూ అధికారులను కలవాలి. రికార్డులను అప్‌డేట్ చేయిస్తే తర్వాతి విడతలో బాకీ నిధులు కూడా జమ అవుతాయి.

45
ఇతర సాంకేతిక కారణాలు
Image Credit : gemini

ఇతర సాంకేతిక కారణాలు

చాలా మంది రైతులకు బ్యాంక్ ఖాతా నంబర్ లేదా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లో చిన్న చిన్న తప్పులు ఉండటం వల్ల కూడా చెల్లింపులు విఫలమవుతుంటాయి. పోర్టల్‌లోని 'Edit Aadhaar Failure Details' ఆప్షన్ ద్వారా లేదా స్థానిక వ్యవసాయ అధికారుల సహాయంతో ఈ తప్పులను సులభంగా సవరించుకోవచ్చు.

అలాగే మీ పేరు, ఆధార్ వివరాలు, భూమి వివరాలు ఒకేలా సరిపోలుతున్నాయో లేదో చూసుకోవడం చాలా అవసరం. ఒకే కుటుంబంలో నిబంధనలకు విరుద్ధంగా ఒకటి కంటే ఎక్కువ మంది ప్రయోజనం పొందుతున్నా లేదా ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉన్నా నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది.

55
సహాయం కోసం సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే
Image Credit : AI Generated

సహాయం కోసం సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

ఆన్‌లైన్‌లో మీ సమస్య పరిష్కారం కాకపోతే, రైతులు నేరుగా ప్రభుత్వ అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.

• పీఎం కిసాన్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు: 155261 లేదా 1800 11 5526

• డైరెక్ట్ నంబర్లు: 011-23381092, 011-24300606

• ఈమెయిల్ ఐడీ: pmkisan-ict@gov.in ఇవే కాకుండా మీ సమీపంలోని మండల వ్యవసాయ కార్యాలయాన్ని లేదా గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదిస్తే వారు మీ సమస్యను పరిష్కరించడంలో తగిన మార్గదర్శనం చేస్తారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వ్యవసాయం (Vyavasayam)
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
4th T20 • NZ vs IND 2026
Live
NZNZ
(9.2 ov)105/3
INDIND
-
IND chose to bowl.
Schedule ›
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
TRS Party : గోల్డ్ మెడలిస్ట్ కి హైదరాబాద్ ఎమ్మెల్సీ టికెట్.. ఎవరీ ఆకాశ్ కొల్లూరు?
Recommended image2
November Holidays : నవంబర్ లో ఏడు రోజులు స్కూల్స్ బంద్... ఎందుకో తెలుసా?
Recommended image3
KTR: కొండా సురేఖ క్ష‌మాప‌ణ‌పై స్పందించిన కేటీఆర్‌.. ఏమ‌న్నారంటే.?
Related Stories
Recommended image1
Snake: నాగుపాము, కట్లపాము, రక్తపింజరి.. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏది?
Recommended image2
World’s Most Expensive Almond: ప్రపంచంలోనే ఖరీదైన బాదం పప్పు ఇదే.. వీటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇంత ధర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved