MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ ఇదే.. ఆ బౌలర్ కెరీర్ క్లోజ్ !

IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ ఇదే.. ఆ బౌలర్ కెరీర్ క్లోజ్ !

37 Runs in One Over IPL Record : ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ సృష్టించిన ఒకే ఓవర్ లో 37 పరుగుల రికార్డ్ చెక్కుచెదరకుండా ఉంది. గేల్ దెబ్బకు ఆ బౌలర్ కెరీర్ కూడా క్లోజ్ అయింది. ఆ ఆసక్తికరమైన ఓవర్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 06 2026, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్‌లో పరుగుల వరద
Image Credit : our own

ఐపీఎల్‌లో పరుగుల వరద

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) అంటేనే రికార్డుల అడ్డా. గత రెండు మూడు ఏళ్లుగా ఐపీఎల్‌లో బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిపోయింది. ఒకప్పుడు టీ20 క్రికెట్‌లో 200 పరుగుల స్కోరు సాధిస్తే విజయం ఖాయమని భావించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు 230 పరుగులు చేసినా సరే, ఆ స్కోరు ఏమాత్రం సురక్షితం కాదు. బౌలర్లు ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటర్ల దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఐపీఎల్ 19వ సీజన్ ఉత్సాహంగా సాగుతున్న వేళ, సరిగ్గా 15 ఏళ్ల క్రితం నమోదైన ఒక అద్భుతమైన రికార్డు గురించి చర్చ సాగుతోంది. అదే ఒకే ఓవర్ లో 37 పరుగుల రికార్డు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
యూనివర్స్ బాస్ విధ్వంసం: 15 ఏళ్లనాటి రికార్డ్
Image Credit : Getty

యూనివర్స్ బాస్ విధ్వంసం: 15 ఏళ్లనాటి రికార్డ్

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ల జాబితా తీస్తే, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. యూనివర్స్ బాస్ గా పేరొందిన గేల్, తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులను సృష్టించాడు. యువ బ్యాటర్లకు ఇప్పటికీ ఆ రికార్డులను అందుకోవడం కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా 2011 ఐపీఎల్ సీజన్‌లో గేల్ చేసిన ఒక విధ్వంసం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఒకే ఓవర్లో ఏకంగా 37 పరుగులు రాబట్టి గేల్ రికార్డ్ సృష్టించాడు. ఈ అద్భుతం జరిగి 15 ఏళ్లు గడుస్తున్నా, నేటికీ ఆ రికార్డ్ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.

36
అసలేం జరిగింది? కోచి టస్కర్స్‌తో మ్యాచ్
Image Credit : our own

అసలేం జరిగింది? కోచి టస్కర్స్‌తో మ్యాచ్

2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న సమయంలో క్రిస్ గేల్ ఈ ఘనత సాధించాడు. కోచి టస్కర్స్ కేరళతో జరిగిన ఈ మ్యాచ్‌లో కోచి జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి గేల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఇన్నింగ్స్ మూడవ ఓవర్లో అప్పుడే ఎదుగుతున్న యంగ్ ఫాస్ట్ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్‌ను గేల్ టార్గెట్ చేశాడు. ఆ ఓవర్లో గేల్ బ్యాట్ నుంచి సిక్సర్ల సునామీ కురిసింది.

46
37 పరుగుల ఓవర్ రికార్డు సాగింది ఇలా
Image Credit : our own

37 పరుగుల ఓవర్ రికార్డు సాగింది ఇలా

ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన ఆ ఓవర్లో గేల్ 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. ఇందులో ఒక నో బాల్ కూడా ఉంది, దానికి కూడా గేల్ సిక్సర్ కొట్టాడు.

ఆ ఓవర్ సాగిందిలా..

1. మొదటి బంతి: సిక్సర్ + నో బాల్ (మొత్తం 7 పరుగులు)

2. రెండవ బంతి: సిక్సర్ (6 పరుగులు)

3. మూడవ బంతి: ఫోర్ (4 పరుగులు)

4. నాలుగవ బంతి: ఫోర్ (4 పరుగులు)

5. ఐదవ బంతి: సిక్సర్ (6 పరుగులు)

6. ఆరవ బంతి: సిక్సర్ (6 పరుగులు)

7. ఏడవ బంతి: ఫోర్ (4 పరుగులు)

మొత్తంగా ఆ ఒక్క ఓవర్లోనే 37 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇంతకంటే ఖరీదైన ఓవర్ మరొకటి నమోదు కాలేదు.

56
బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ కు షాక్
Image Credit : Getty

బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ కు షాక్

క్రిస్ గేల్ చేతిలో ఊచకోతకు గురైన ప్రశాంత్ పరమేశ్వరన్ ఐపీఎల్ కెరీర్ ఆ తర్వాత పెద్దగా సాగలేదు. విచిత్రం ఏమిటంటే, 2011లో గేల్ ఎవరినైతే చీల్చి చెండాడాడో, అదే ప్రశాంత్ పరమేశ్వరన్ 2012లో గేల్‌తో కలిసి ఆర్‌సీబీ జట్టులోనే సభ్యుడిగా చేరాడు. ప్రశాంత్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. కానీ, గేల్ కొట్టిన ఆ 37 పరుగుల ఓవర్ మాత్రం అతని పేరుతో ఒక చేదు రికార్డుగా మిగిలిపోయింది.

66
రికార్డుల మోత మోగిస్తున్న ఐపీఎల్
Image Credit : our own

రికార్డుల మోత మోగిస్తున్న ఐపీఎల్

ప్రస్తుత తరం క్రికెట్‌లో ఎంతో మంది పవర్‌ఫుల్ హిట్టర్లు వచ్చారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి వారు కూడా ఒకే ఓవర్లో 36 పరుగులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. జడేజా 2021లో హర్షల్ పటేల్ ఓవర్లో 37 పరుగులు సాధించాడు, అయితే అందులో గేల్ రికార్డ్ సమం అయింది కానీ బ్రేక్ కాలేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత భీకరమైన ఇన్నింగ్స్‌లలో గేల్ చేసిన ఈ 37 పరుగుల విధ్వంసం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. యూనివర్స్ బాస్ రిటైర్ అయినా, అతను సృష్టించిన ఈ సునామీ రికార్డులు మాత్రం నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
RCB vs CSK: సీఎస్కే కథ కంచికే.. కోహ్లీ టీమ్ ఆర్సీబీ కొట్టిన దెబ్బకు ధోనీ టీమ్ విలవిల !
Recommended image2
Tim David : ఇది కదా ఊరమాస్ అంటే! ఒకే ఓవర్‌లో 30 రన్స్.. 8 సిక్సర్లతో చెన్నై బెంబేలు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved