- Home
- Telangana
- Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు
Medaram Jathara 2026 : కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరలో రూపాయి పెట్టుబడి లేకుండా ఆదాయాన్ని పొందవచ్చు. ఇలా గిరిజన జాతరలో మంచి ఆదాయం వచ్చే టాప్ 5 బిజినెస్ లు ఏవో తెలుసా?

మేడారం జాతరలో రూపాయి ఖర్చులేని వ్యాపారాలివే...
Medaram Jathara 2026 : సరిగ్గా ఏడాదికింద ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా జరిగింది... ఈ సమయంలో అనేక ఆసక్తికర బిజినెస్ ల గురించి బైటపడింది. కోట్లాది మంది హాజరైన ఈ కుంభమేళాను కేవలం ఆధ్యాత్మిక మార్గంగానే కాదు కొందరు ఆదాయ మార్గంగా చూశారు... చివరకు పళ్లు తోముకునేందుకు వేపపుళ్లకు అమ్మి లక్షలు సంపాదించివారు ఉన్నారు. కాస్త తెలివిగా తమ ఆలోచనే పెట్టుబడిగా బిజినెస్ చేసి రూపాయి ఖర్చులేకుండా డబ్బులు సంపాదించారు.
అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు టైమ్ వచ్చింది. మరికొద్దిరోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటైన మేడారం జాతర ప్రారంభంకానుంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు తెలుగు ప్రజలే కాదు వివిధ రాష్ట్రాల నుండి జనాలు తండోపతండాలుగా తరలిరానున్నాయి... నాలుగు రోజుల్లో దాదాపు కోటి మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ జాతరలో కాస్త తెలివిగా వ్యాపారం చేయడంద్వారా భారీ డబ్బులు సంపాదించవచ్చు.
1. చెట్లను అద్దెకు ఇవ్వడం...
ఇప్పటికే మేడారంకు భక్తుల రద్దీ పెరిగింది... దీంతో సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో రద్దీ నెలకొంది. సాధారణంగా గ్రామస్థులంతా కలిసి… లేదంటే కాలనీవాసులు, కుటుంబసభ్యులు, దగ్గరి బందువులంతా కలిసివచ్చి యాటలకు కోసి వంటావార్పు చేసుకుంటారు... ఇందుకోసం సరైన స్థలం కావాల్సి ఉంటుంది. కాబట్టి కొందరు స్థానికులు ఇప్పటికే కొన్ని చెట్లవద్ద ముళ్లపొదలు తొలగించి పరిశుభ్రంగా మార్చారు... వీటిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందుతున్నారు.
మేడారంలో ఒక్కో చెట్లు అద్దె రూ.1000-2000 వరకు ఉందనే ప్రచారం జరుగుతోంది. అంత కాకపోయినా రోజుకు రూ.500 చార్జ్ చేసినా సరిపోతుంది. ఇలా ఓ పది పదిహేను చెట్లను సెట్ చేసుకుంటే ప్రతిరోజు ఐదారువేల ఆదాయం వస్తుంది. హాయిగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ సన్నిహితులతో సరదాగా గడపాలపాలని అనుకునేవారు ఇలాంటి చెట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ వ్యాపారంలో రూపాయి పెట్టుబడి అవసరం లేదు... పైగా భక్తులకు సౌకర్యాలు కల్పించినట్లు ఉంటుంది... ఆదాయం పొందినట్లు ఉంటుంది.
2. గైడ్ గా వ్యవహరించడం...
మేడారం జాతర వందలు, వేల ఎకరాల్లో జరుగుతుంది... అంతా అటవీ ప్రాంతమే కాబట్టి సరైన సౌకర్యాలు ఉండవు. దీంతో అమ్మవారి దర్శనంకోసం ఇతర ప్రాంతాలనుండి వచ్చేవారు ఇబ్బందులు పడతారు. ఇలాంటివారికి మేడారంలో ఏది ఎక్కడ దొరుకుతుందో తెలియజేసే దగ్గరినుండి జంపన్నవాగులో పుణ్యస్నానం, అమ్మవార్ల దర్శనం చేయించేవరకు గైడ్ గా వ్యవహరించవచ్చు. ఇందుకుగాను రూ.500 నుండి రూ.1000 వరకు చార్జ్ చేసినా మంచి ఆదాయం వస్తుంది.
ఇలా మేడారంలో గైడ్ గా వ్యవహరించడం కూడా పెట్టుబడిలేకుండానే ఆదాయాన్ని పొందే మార్గం. కానీ ఈ పని చేయాలంటే ముందుగానే ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉండాలి... అంటే స్థానికులకు ఇది మంచి ఆదాయ మార్గం. నాలుగు రోజులపాటు జరిగే జాతరలో ఓ 100-200 కుటుంబాలకు గైడ్ గా వ్యవహరించినా మంచి ఆదాయమే వస్తుంది.
3. బైక్ ట్యాక్సీ
మేడారం జాతరలో రద్దీ దృష్ట్యా పదుల కిలోమీటర్ల దూరంలనే బస్సులు, ప్రైవేట్ వాహనాలను నిలిపివేస్తారు... ఈ పార్కింగ్ స్థలాల నుండి చాలాదూరం నడవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో భక్తులు చాలా ఇబ్బంది పడతారు... ముఖ్యంగా ముసలివారికి, చిన్నపిల్లలతో వచ్చినవారికి నడవడం చాలా సమస్య. కాబట్టి అలాంటివారిని బైక్ లపై గద్దెల సమీపంవరకు చేర్చడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఇప్పటికే మేడారంలో బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.. స్థానిక యువత ఈవిధంగా ఆదాయం పొందుతున్నారు.
4. వేడినీటి వ్యాపారం
అసలే చలికాలం... అదీ అడవిలో మరింత ఎక్కువ చలి. ఈ చలిలో స్నానం చేయడమే కష్టం... అలాంటిది వాగులో స్నానం మరీ కష్టం. అలాగని స్నానం చేయకుండా అమ్మవార్లను దర్శించుకోలేరు. ఇలాంటివారి కోసమే మేడారంలో వేడినీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. జంపన్న వాగులోని నీటిని వేడిచేసి స్నానానికి ఇస్తున్నారు కొందరు స్థానికులు... ఇందుకుగాను బకెట్ కు రూ.50 నుండి రూ.100 చార్జ్ చేస్తున్నారు. తద్వారా భక్తులకు జంపన్న వాగులో స్నానం చేసినట్లు ఉంటుంది... స్థానికులకు సంపాదించినట్లు ఉంటుంది.
ఇలా వేడినీటి వ్యాపారం ద్వారా స్థానికులు బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే అసలైన జాతర ప్రారంభమయ్యాక భక్తుల రద్దీ పెరుగుతుంది... ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ వేడినీళ్ళ వ్యాపారానికి కూడా పెట్టుబడి ఏం అవసరం లేదు...అడవిలోనే దొరికే కట్టెలు, వాగులోని నీటిని వేడిచేసి ఇవ్వడమే.
5. వేపపుళ్లల అమ్మకం
ప్రయాగరాజ్ మాదిరిగానే మేడారంలో కూడా వేపపుళ్లల అమ్మకం వర్కౌట్ కావచ్చు. అయితే ఈ జాతర అడవిలోనే జరుగుతుంది కాబట్టి ఆ స్థాయిలో డిమాండ్ ఉండకపోవచ్చు. కానీ ఐదు, పది రూపాయలకే వీటిని అమ్మడం ద్వారా భక్తులను ఆకర్షించవచ్చు. చెట్టు కోసం ఏం వెతక్కోవడం... చిల్లర డబ్బులతోనే కొనుక్కోవచ్చే కదా భావించేవారు ఉంటారు. ఈ వేపపుళ్లలు ఫ్రీగానే లభిస్తాయి కాబట్టి ఎంత తక్కువకు వీలైతే అంత తక్కువకు అమ్మాలి. తద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

