MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • MMTS: హైదరాబాద్‌లో 3 కొత్త రైల్వే స్టేష‌న్లు.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ క‌ష్టాల నుంచి విముక్తి

MMTS: హైదరాబాద్‌లో 3 కొత్త రైల్వే స్టేష‌న్లు.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ క‌ష్టాల నుంచి విముక్తి

MMTS: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే మూడు కొత్త స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : May 06 2026, 08:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త స్టేషన్ల ప్రతిపాదనలు సిద్ధం
Image Credit : Gemini AI

కొత్త స్టేషన్ల ప్రతిపాదనలు సిద్ధం

అల్వాల్‌లో లయోలా కాలేజీ సమీపం, ఆనంద్‌బాగ్, మౌలాలీ క్వార్టర్స్ ప్రాంతాల్లో మూడు కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే రైల్వే బోర్డుకు పంపించారు. ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఘట్‌కేసర్ – సనత్‌నగర్ మార్గానికి ప్రాధాన్యం
Image Credit : mmtstraintimings.in

ఘట్‌కేసర్ – సనత్‌నగర్ మార్గానికి ప్రాధాన్యం

ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఘట్‌కేసర్ నుంచి సనత్‌నగర్ వరకు రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో కొత్త స్టేషన్ల అవసరం స్పష్టమైంది. గతంలోనే ఈ రూట్‌లో మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు ఉన్నప్పటికీ, ఇప్పుడు వాటికి మళ్లీ వేగం వచ్చింది.

Related Articles

Related image1
Mutton: ఈసారి మ‌ట‌న్ కొంటే ఈ పార్ట్‌ను క‌చ్చితంగా తీసుకోండి.. రుచి మాత్ర‌మే కాదు ఆరోగ్యం కూడా
Related image2
బ‌య‌ట రూ. 1500 ఉండే మందు బాటిల్ ఆర్మీ క్యాంటీన్‌లో రూ. 600కే ఎందుకు ల‌భిస్తుందో తెలుసా.?
35
ప్రయాణికుల సమస్యలకు పరిష్కారం
Image Credit : mmtstraintimings.in

ప్రయాణికుల సమస్యలకు పరిష్కారం

చర్లపల్లి నుంచి నేరేడ్‌మెట్ వరకు మధ్యలో స్టేషన్లు లేకపోవడం వల్ల మల్కాజిగిరి పరిసరాల ప్రజలు చాలా దూరం ప్రయాణించి రైలు ఎక్కాల్సి వస్తోంది. ఆనంద్‌బాగ్‌లో స్టేషన్ ఏర్పడితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే లయోలా కాలేజీ ప్రాంతంలో స్టేషన్ వస్తే విద్యార్థులకు పెద్దగా ఉపయోగం ఉంటుంది.

45
మౌలాలీ ప్రాంతానికి ప్రత్యేక ప్రయోజనం
Image Credit : mmtstraintimings.in

మౌలాలీ ప్రాంతానికి ప్రత్యేక ప్రయోజనం

మౌలాలీ రైల్వే క్వార్టర్స్ పరిసరాల్లో వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ స్టేషన్ లేకపోవడం వల్ల ఉద్యోగులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు నగరంలోని ఇతర ప్రాంతాలకు నేరుగా చేరుకునే అవకాశం కలుగుతుంది.

55
ట్రాఫిక్ తగ్గింపే లక్ష్యం
Image Credit : mmtstraintimings.in

ట్రాఫిక్ తగ్గింపే లక్ష్యం

తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంఎంటీఎస్ విస్తరణకు మ‌ద్ధ‌తు ఇస్తోంది. రెండో దశ పనులకు నిధులు విడుదల చేసి ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, శివారు ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్నారు. త్వ‌ర‌లోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరించే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
స్థిరాస్తి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bakrid 2026 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడు.. బుధవారమా, గురువారమా?
Recommended image2
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే
Recommended image3
TGSRTC: ఇక‌పై బ‌స్సుల్లో పోకీరిల ఆట‌లు సాగ‌వు.. భ‌రోసా ప్రాజెక్ట్ ప్రారంభించిన తెలంగాణ ప్ర‌భుత్వం
Related Stories
Recommended image1
Mutton: ఈసారి మ‌ట‌న్ కొంటే ఈ పార్ట్‌ను క‌చ్చితంగా తీసుకోండి.. రుచి మాత్ర‌మే కాదు ఆరోగ్యం కూడా
Recommended image2
బ‌య‌ట రూ. 1500 ఉండే మందు బాటిల్ ఆర్మీ క్యాంటీన్‌లో రూ. 600కే ఎందుకు ల‌భిస్తుందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved