MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Mallela Theertham: నల్లమల అడవుల్లో బాహుబలి రేంజ్ వాటర్ ఫాల్స్.. మల్లెల తీర్థం రూట్ మ్యాప్ ఇదే

Mallela Theertham: నల్లమల అడవుల్లో బాహుబలి రేంజ్ వాటర్ ఫాల్స్.. మల్లెల తీర్థం రూట్ మ్యాప్ ఇదే

Mallela Theertham Waterfalls: నల్లమల అడవుల్లో దాగున్న మల్లెల తీర్థం జలపాతం వీకెండ్ ట్రిప్‌కు బెస్ట్ ఆప్షన్. హైదరాబాద్‌కు దగ్గర్లోనే ఉన్న ఈ బహుబలి రేంజ్ వాటర్ ఫాల్స్ విశేషాలు, కంప్లీట్ ట్రావెల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 05 2026, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్‌కు దగ్గర్లోనే అదిరిపోయే వాటర్ ఫాల్
Image Credit : Youtube/TravelWithLaxman

హైదరాబాద్‌కు దగ్గర్లోనే అదిరిపోయే వాటర్ ఫాల్

వీకెండ్ వస్తే చాలు.. హైదరాబాద్ సిటీ లైఫ్, ట్రాఫిక్, ఆఫీస్ టెన్షన్ల నుంచి కాస్త బ్రేక్ కావాలని అందరూ కోరుకుంటారు. అలాంటి వాళ్ల కోసం నల్లమల అడవుల్లో ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది. అదే మల్లెల తీర్థం జలపాతం. తెలంగాణలోని నాగర్ కర్నూల్ (పాత మహబూబ్‌నగర్) జిల్లా పరిధిలోకి వచ్చే వటువర్లపల్లి గ్రామానికి దగ్గర్లో, దట్టమైన నల్లమల అడవుల మధ్య ఈ వాటర్ ఫాల్ ఉంది.

చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, రాతి లోయల మధ్య 150 అడుగులు అంటే సుమారు 45 మీటర్లు ఎత్తు నుంచి నీళ్లు కిందకు పడుతుంటే వచ్చే ఆ మజానే వేరు. హైదరాబాద్ నుంచి కేవలం 140 కిలోమీటర్లు, శ్రీశైలం నుంచి దాదాపు 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లేస్ నేచర్ లవర్స్‌కు ఒక పర్ఫెక్ట్ స్పాట్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మల్లెల తీర్థం జలపాతం.. ఆయుర్వేద నీళ్లు.. ఆధ్యాత్మిక చరిత్ర
Image Credit : Youtube/TravelWithLaxman

మల్లెల తీర్థం జలపాతం.. ఆయుర్వేద నీళ్లు.. ఆధ్యాత్మిక చరిత్ర

ఈ మల్లెల తీర్థం కేవలం చూడటానికి మాత్రమే కాదు.. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ వాటర్ ఫాల్ నీళ్లు అడవిలోని ఎన్నో రకాల ఆయుర్వేద మూలికలు, ఔషధ మొక్కల మీదుగా ప్రవహిస్తూ వస్తాయి. అందుకే ఈ నీటిలో స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని, రోగాలు నయమవుతాయని నమ్ముతారు.

అంతేకాదు, ఈ ప్లేస్‌కు ఆధ్యాత్మిక చరిత్ర కూడా ఉంది. పూర్వం ఇక్కడ శతాబ్దాల క్రితం మునులు, సాధువులు శివుడి కోసం ఘోర తపస్సు చేశారని స్థానికులు చెబుతారు. అందుకే మహా శివరాత్రి పండుగ సమయంలో ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి, జలపాతంలో పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు.

Related Articles

Related image1
Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే
Related image2
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
35
మల్లెల తీర్థం జలపాతం: 250 మెట్ల క్రేజీ ట్రెక్కింగ్
Image Credit : Youtube/TravelWithLaxman

మల్లెల తీర్థం జలపాతం: 250 మెట్ల క్రేజీ ట్రెక్కింగ్

ఈ జలపాతాన్ని చూడాలంటే రోడ్డు పక్కన నిలబడితే కుదరదు. మెయిన్ రోడ్డు నుంచి పార్కింగ్ ఏరియాకు చేరుకున్నాక, అక్కడ నుంచి దట్టమైన అడవి గుండా కిందకు వెళ్లాలి. ఇందుకోసం కొండ వాలులో కొండరాళ్లతో చెక్కిన 250 మెట్లు దిగాల్సి ఉంటుంది. వర్షం పడినప్పుడు ఇవి కాస్త జారే ప్రమాదం ఉంది. కిందకు దిగడానికి 15 నుంచి 20 నిమిషాలు పడితే, తిరిగి పైకి రావడానికి 20 నుంచి 25 నిమిషాల టైమ్ పడుతుంది.

వయసుతో సంబంధం లేకుండా కాస్త ఓపిక ఉన్నవాళ్లంతా ఈ ట్రెక్కింగ్ చేయవచ్చు. వెళ్లేటప్పుడు మంచి గ్రిప్ ఉన్న షూస్ వేసుకోవడం చాలా ముఖ్యం. అడవిలో పక్షుల కిలకిలరావాలు వింటూ నడవడం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ నీరంతా ప్రవహించి చివరకు కృష్ణా నదిలో కలుస్తుంది.

45
మల్లెల తీర్థం : హైదరాబాద్ నుంచి వన్ డే ట్రిప్ ప్లాన్ ఇలా చేసుకోండి
Image Credit : Youtube/TravelWithLaxman

మల్లెల తీర్థం : హైదరాబాద్ నుంచి వన్ డే ట్రిప్ ప్లాన్ ఇలా చేసుకోండి

ఈ క్రేజీ లొకేషన్‌ను ఒకే రోజులో చూసి రావడానికి పర్ఫెక్ట్ టైమ్ టేబుల్ గమనిస్తే.. ఉదయం 6:00 గంటలకు హైదరాబాద్‌లో స్టార్ట్ అయి శ్రీశైలం హైవే మీదుగా వెళ్లాలి. ఉదయం 10:00 గంటల కల్లా వటువర్లపల్లి గ్రామ సమీపంలోని మల్లెల తీర్థం టర్నింగ్ వద్దకు చేరుకోవచ్చు. అక్కడ నుంచి 8 కిలోమీటర్ల లోపలి సింగిల్ రోడ్డులో వెళ్తే పార్కింగ్ ఏరియా వస్తుంది.

10:15 గంటలకు మెట్లు దిగడం స్టార్ట్ చేస్తే, 11:00 కల్లా వాటర్ ఫాల్ దగ్గరకు చేరవచ్చు. మధ్యాహ్నం 1:00 గంట వరకు జలపాతంలో స్నానాలు చేసి, ఫొటోలు క్లిక్ మనిపించవచ్చు. మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 వరకు అక్కడే లంచ్ ముగించుకుని, 3:30 వరకు చుట్టుపక్కల ఫొటోగ్రఫీ చేయవచ్చు. ఆ తర్వాత 4:30 కల్లా మెట్లు ఎక్కి పైకి వచ్చి, సాయంత్రం 5:00 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తే రాత్రి 9:00 గంటల కల్లా హైదరాబాద్ చేరుకోవచ్చు. అచ్చంపేట రూట్ లో కూడా ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు.

55
పర్యాటకులు గుర్తుంచుకోవాల్సిన టిప్స్
Image Credit : Youtube/TravelWithLaxman

పర్యాటకులు గుర్తుంచుకోవాల్సిన టిప్స్

మల్లెల తీర్థం వెళ్లాలనుకునే వాళ్లు కొన్ని విషయాలు కచ్చితంగా మైండ్‌లో పెట్టుకోవాలి. వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు వెళ్లడం ఉత్తమం. ఎంట్రీ ఫ్రీ, నామినల్ పార్కింగ్ ఫీజ్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి హోటళ్లు, షాపులు లేదా రెస్ట్ రూమ్స్ ఉండవు. కాబట్టి ప్రతీ ఒక్కరు కనీసం 2 లీటర్ల మంచి నీళ్లు, ఫుడ్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంట తీసుకెళ్లడం మంచిది. ప్లాస్టిక్ వాడకం ఇక్కడ పూర్తిగా నిషేధం.

మొబైల్ నెట్‌వర్క్ విషయానికి వస్తే బీఎస్ఎన్ఎల్ వస్తుంది. మిగతా నెట్ వర్క్ లు చాలా లైట్‌గా పనిచేస్తాయి. చుట్టుపక్కల ఉమామహేశ్వరం, శ్రీశైలం దేవాలయం, అక్కమహాదేవి గుహలు వంటి ఇతర పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే
Recommended image2
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఉచితంగా బైక్‌లు, స్కూటీలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Recommended image3
Hyderabad: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. మరో రెండు భారీ ప్రాజెక్టులు.. ఈ ప్రాంతాల రూపురేఖలు మారబోతున్నాయి !
Related Stories
Recommended image1
Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే
Recommended image2
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved