MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad : హైదరాబాద్‌లో భారీ శబ్దాలు, ప్రకంపనలు.. అసలేం జరిగింది? భయాందోళనలో ప్రజలు

Hyderabad : హైదరాబాద్‌లో భారీ శబ్దాలు, ప్రకంపనలు.. అసలేం జరిగింది? భయాందోళనలో ప్రజలు

Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ శబ్దాలు, ప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేవలం ప్రకంపనలా లేదా భూకంపం వచ్చిందా? అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 27 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్‌లో భారీ శబ్దాలు, ప్రకంపనలు: భయాందోళనలో జనం
Image Credit : Chatgpt

హైదరాబాద్‌లో భారీ శబ్దాలు, ప్రకంపనలు: భయాందోళనలో జనం

హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వింత శబ్దాలు రావడం, దానికితోడు భూమి కంపించినట్లు అనిపించడంతో స్థానికులు తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయాన్నే ఏం జరుగుతుందో తెలియక పసిపిల్లలతో సహా వీధుల్లోకి పరుగులు తీశారు.

మంగళవారం ఉదయం 9:15 గంటల సమయంలో రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్ ప్రాంతాల్లో వరుసగా భారీ పేలుళ్లను తలపించేలా శబ్దాలు వినిపించాయి. ఈ ఒక్కసారే వచ్చిన వింత శబ్దంతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
10 సెకన్ల పాటు కంపించిన భూమి.. కిటికీలు కొట్టుకుని గందరగోళం
Image Credit : Asianet News

10 సెకన్ల పాటు కంపించిన భూమి.. కిటికీలు కొట్టుకుని గందరగోళం

శబ్దం రావడమే కాకుండా, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కదిలినట్లు అనిపించడంతో భయం రెట్టింపైంది. ఇళ్లలోని వస్తువులు కిందపడిపోవడం, కిటికీలు గట్టిగా కొట్టుకోవడంతో అసలు భూకంపం వచ్చిందా లేక ఎక్కడైనా బాంబు పేలుళ్లు జరిగాయా అని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బిల్డింగుల పైకి, రోడ్లపైకి జనాలు పరుగులు తీయడంతో ఆయా ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది.

35
రంగంలోకి పోలీసులు, బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు
Image Credit : Gemini AI

రంగంలోకి పోలీసులు, బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు

సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వింత శబ్దాలకు గల అసలు కారణాలను తెలుసుకోవడానికి బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రంగంలోకి దించారు. ఎక్కడైనా క్వారీ బ్లాస్టింగ్స్ జరిగాయా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

45
హైదరాబాద్‌లో నిజంగానే భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందా?
Image Credit : Gemini AI

హైదరాబాద్‌లో నిజంగానే భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందా?

ఈ ఘటనతో నగరంలో భూకంపం వచ్చిందంటూ రకరకాల రూమర్స్ షికారు చేశాయి. అయితే, భౌగోళిక శాస్త్రవేత్తలు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. భారతదేశంలోని సీస్మిక్ జోన్ వర్గీకరణ ప్రకారం హైదరాబాద్ జోన్-2 పరిధిలోకి వస్తుంది. అంటే ఇక్కడ తీవ్రమైన భూకంపాలు వచ్చే ప్రమాదం అత్యల్పం. హైదరాబాద్ నగరం స్థిరమైన దక్కన్ పీఠభూమి రాతి పొరలపై ఉండటం వల్ల టెక్టోనిక్ ప్లేట్స్ కదలికల ప్రభావం తక్కువగా ఉంటుంది.

55
భయపడాల్సిన అవసరం లేదంటున్న NGRI శాస్త్రవేత్తలు
Image Credit : Tumisu to Pixabay

భయపడాల్సిన అవసరం లేదంటున్న NGRI శాస్త్రవేత్తలు

హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) నిపుణుల ప్రకారం.. అప్పుడప్పుడు గోదావరి బేసిన్ సరిహద్దుల్లో వచ్చే చిన్న మార్పులు లేదా భూగర్భ నీటి మట్టాల్లో వ్యత్యాసాల వల్ల కుత్బుల్లాపూర్, గాజులరామారం, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 2.0 నుంచి 3.5 తీవ్రతతో స్వల్ప ప్రకంపనలు రావచ్చు. ఇవి ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టాన్ని కలిగించవని, కాబట్టి ప్రజలు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని సూచిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coldest Areas in Hyderabad : హైదరాబాద్ లో అత్యంత చలిగా ఉండే టాప్ 5 ఏరియాలేవో తెలుసా?
Recommended image2
IRCTC Jyotirlinga Yatra: ఒక్క టికెట్‌తో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image3
Cyclone Arnab Alert: సైక్లోన్ అర్నబ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలకు పెను ముప్పు.. ఆ తేదీల్లో భారీ వర్షాలు
Related Stories
Recommended image1
Insurance: కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Cyclone Arnab: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved