MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Insurance: కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే

Insurance: కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే

Travel Insurance: రైల్వే కౌంటర్లలో రిజర్వేషన్ టికెట్లు తీసుకునే ప్రయాణికులకు కూడా కేవలం 45 పైసల ప్రీమియంతో రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. భారతీయ రైల్వే అందించిన ఈ గుడ్ న్యూస్ పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 27 2026, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేవలం 45 పైసలకే రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా పొందాలి?
Image Credit : chatgpt

కేవలం 45 పైసలకే రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా పొందాలి?

రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల నుంచి టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు ఇకపై ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యం లభించనుంది. కేవలం 45 పైసల ప్రీమియంతో రూ.10 లక్షల వరకు ప్రయాణ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటివరకు ఈ సదుపాయం ఐఆర్సీటీసీ (IRCTC) ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే పరిమితమైంది. ఒడిశా రైలు ప్రమాదం తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుప్రీంకోర్టు ఆదేశాలు.. డిజిటల్ చెల్లింపుల నిబంధనలు
Image Credit : Asianet News

సుప్రీంకోర్టు ఆదేశాలు.. డిజిటల్ చెల్లింపుల నిబంధనలు

జూన్ 2023లో జరిగిన ఒడిశా రైలు ప్రమాదం తర్వాత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ట్రాక్‌ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, కౌంటర్లలో టికెట్లు కొనే ప్రయాణికులకు ఇన్సూరెన్స్ ఆప్షన్ లేకపోవడం వంటి అంశాలపై కోర్టు దృష్టిసారించింది.

కౌంటర్లలో టికెట్లు కొనేవారికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. 5, 10, 20, 25 పైసల నాణేలు చలామణిలో లేకపోవడం వల్ల, 45 పైసల ప్రీమియం మొత్తాన్ని ప్రయాణికులు డిజిటల్ పద్ధతిలోనే చెల్లించాల్సి ఉంటుంది.

35
ఇన్సూరెన్స్ కవరేజ్ ఎవరికి వర్తిస్తుంది? అర్హతలు ఇవే
Image Credit : AI

ఇన్సూరెన్స్ కవరేజ్ ఎవరికి వర్తిస్తుంది? అర్హతలు ఇవే

ఈ ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కేవలం కన్ఫర్మ్డ్, ఆర్ఏసీ, పాక్షికంగా కన్ఫర్మ్ అయిన రిజర్వ్‌డ్ టికెట్లకూ మాత్రమే వర్తిస్తుంది. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ వంటి అన్ని తరగతుల ప్రయాణికులకు ఇది అందుబాటులో ఉంటుంది. అయితే, అన్ రిజర్వ్‌డ్ (జనరల్) టికెట్లు కొనేవారికి ఈ పాలసీ వర్తించదు.

అలాగే, సగం టికెట్లపై ప్రయాణించే చిన్నారులకు ఈ ఆప్షనల్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తించదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు తమ సరైన మొబైల్ నంబర్‌ను అందించడం తప్పనిసరి.

45
ఏయే సందర్భాలలో క్లైమ్ పొందవచ్చు?
Image Credit : Gemini AI

ఏయే సందర్భాలలో క్లైమ్ పొందవచ్చు?

రైలు పట్టాలు తప్పుడం (డెయిల్‌మెంట్), రెండు రైళ్ల మధ్య ఢీకొనే ప్రమాదం, తీవ్రవాద దాడులు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు. మరణం లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు అందిస్తారు. గాయాలపాలైతే ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.2 లక్షల వరకు, అలాగే మృతదేహాన్ని తరలించేందుకు రూ.10,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే ప్రయాణికుడు ఆత్మహత్యాయత్నం చేసినా, లేదా ఉద్దేశపూర్వకంగా గాయపరచుకున్నా ఎలాంటి పరిహారం లభించదు.

55
క్లైమ్ చేయడం ఎలా? ఇతర ముఖ్యాంశాలు ఇవే
Image Credit : AI Generated

క్లైమ్ చేయడం ఎలా? ఇతర ముఖ్యాంశాలు ఇవే

రైలు ప్రమాదం జరిగిన తేదీ నుంచి నాలుగు నెలల లోపు ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. గాయపడిన వ్యక్తి, నామినీ లేదా చట్టపరమైన వారసుడు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయానికి అవసరమైన పత్రాలతో దరఖాస్తు సమర్పించాలి.

ఆన్‌లైన్ లేదా కౌంటర్లలో టికెట్లు రద్దు చేసుకునే సందర్భంలో, ఇతర ఛార్జీలతో పాటు 45 పైసల ప్రీమియంలో నుంచి 9 పైసలు మినహాయిస్తారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, ఆర్థిక భద్రతతో సాగించేందుకు ఈ ఆప్షనల్ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ప్రయాణం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Silver Rate: పసిడి ధరలకు పశ్చిమాసియా సెగ..తగ్గిందని సంబరపడేలోపే.. మళ్లీ పెరుగుతున్న గోల్డ్ రేట్లు
Recommended image2
LIC: ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. రోజుకు రూ.45 కడితే చాలు.. రూ.25 లక్షలు మీ సొంతం
Recommended image3
Silver Price: రూ. 4 లక్షల నుంచి రూ. 2 లక్షల కంటే తక్కువకు.. వెండి ధర ఎందుకు తగ్గుతోంది?
Related Stories
Recommended image1
IRCTC Jyotirlinga Yatra: ఒక్క టికెట్‌తో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image2
LIC: ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. రోజుకు రూ.45 కడితే చాలు.. రూ.25 లక్షలు మీ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved