- Home
- Andhra Pradesh
- Cyclone Akvan : బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను లోడింగ్.. ఎక్కడ తీరం దాటితే ఏం జరుగుతుంది?
Cyclone Akvan : బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను లోడింగ్.. ఎక్కడ తీరం దాటితే ఏం జరుగుతుంది?
అర్నబ్, మురసు తుపానుల మాదిరిగానే రాబోయే అక్వాన్ తుపాను కూడా ఏపీ తీరంవైపే దూసుకువచ్చే అవకాశాలే ఎక్కువట. దీని దారి మారితే మాత్రం ఇతర తీరాలవైపు వెళుతుందట. మరి ఈ తుపాను ఏ తీరానికి చేరితే ఏం జరుగుతుంది?

మరో తుపాను గండం
Akvan Cyclone : ఇప్పటికే అర్నబ్, మురసు తుపానులు ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేశాయి. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ఊహించని స్థాయిలో ఆస్తినష్టం మిగిల్చాయి... కొన్నిప్రాంతాల్లో ప్రాణనష్టం కూడా జరిగింది. వరదనీరు పంటపొలాల్లోకి చేరి రైతులను, జనావాసాల్లోకి చేరి ప్రజలను ఇబ్బందిపెట్టింది. ఈ తుపాను దెబ్బనుండి ఇంకా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో తుపాను లోడ్ అవుతోందన్న హెచ్చరికలు వస్తున్నాయి. మరి ఈ తుపాను కూడా ఏపీ తీరంవైపు దూసుకువస్తే మరోసారి అల్లకల్లోలం తప్పదన్నమాట.
అక్వాన్ తుపాను లోడింగ్..
ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో మరో రెండ్రోజుల్లో అంటే ఈ శుక్రవారం (నవంబర్ 13న) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇది మరింత బలపడి శనివారం (నవంబర్ 14) తీవ్ర అల్పపీడనంగా, ఆదివారం (నవంబర్ 15) వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపిఎస్డిఎంఏ ఎండి, RTGS CEO ప్రఖర్ జైన్ తెలిపారు.
అయితే ఈ వాయుగుండం బలపడి తుపానుగా ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా చేంజ్ అయితే చెప్పలేంగాని ఇప్పటికయితే తుపాను ఏర్పడే అవకాశాలు 85 శాతం ఉన్నాయంటున్నారు. తుపాను ఏర్పడితే అక్వాన్ గా పేరు పెడతారు. నవంబర్ 17న ఈ అక్వాన్ తుపాను ఏర్పడే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా.
అక్వాన్ తుపాను ఎక్కడ తీరం దాటితే ఏం జరుగుతుంది?
బంగాళాఖాతంలో ఏర్పడే కొత్త తుపాను అక్వాన్ కూడా ఆంధ్ర ప్రదేశ్ వైపే దూసుకువచ్చే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాచ్ చెబుతున్నారు. ఒకవేళ ఇది రూట్ మార్చుకుంటే మాత్రం ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాలవైపు వెళ్లవచ్చని అంటున్నారు. తుపాను ఎటువైపు వెళుతుంది అనేదాన్నిబట్టి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఆదారపడి ఉంటాయి.
ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు వచ్చే అవకాశాలు 55 శాతం ఉన్నాయి... నెల్లూరు-ఒంగోలు వద్ద ఈ తుపాను తీరందాటవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే నవంబర్ 19-20 తేదీల మధ్య తీరం దాటవచ్చని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. దీంతో నవంబర్ 21 నుండి 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయట. తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వెదన్ మ్యాన్ వెల్లడించారు.
ఇక అక్వాన్ తుపాను ఒడిషా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశాలు 25 శాతం ఉన్నాయంటున్నారు వెదర్ మ్యాన్. ఇదే జరిగితే తెలంగాణలో వర్షాలు ఉండవని.... ఉష్ణోగ్రతలు పెరిగి నవంబర్ 20 తర్వాత చలి తగ్గుతుందని అంటున్నారు. పెరుగుతుందట.
అక్వాన్ తుపాను మయన్మార్-బంగ్లాదేశ్ మధ్య తీరందాటే అవకాశాలు 20 శాతం ఉన్నాయట. ఇదే జరిగితే తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి చలి తీవ్రత పెరుగుతుందంటున్నారు. ఇలా అక్వాన్ తుపాను ఎక్కడ తీరందాటినా తెలంగాణపై ప్రభావం ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటనను బట్టి తెలుస్తోంది.
అక్వాన్ తుపానుతో సముద్రం అల్లకల్లోలం
అక్వాన్ తుపాను ప్రభావంతో ఈ శనివారం నుండి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం వైపు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం లేదని... రానున్న రోజుల్లో ఇది ఏటు వైపు పయనిస్తుందనే అంశంపై స్పష్టత రానుందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.
తెలంగాణను వణికిస్తున్న చలి
ఇదిలావుంటే ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి... రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. ఇవాళ ఉదయం (నవంబర్ 11, బుధవారం) అత్యల్పంగా మెదక్ జిల్లాల్లో 13.4 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 13.5, హన్మకొండలో 14, ఖమ్మంలో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్ లో అయితే ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోతున్నాయి. ఇవాళ రాజేంద్రనగర్ లో 12, పటాన్ చెరు (ఈక్రిశాట్ ప్రాంతంలో) 12.6, బేగంపేటలో 16.1, హయత్ నగర్ లో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండుమూడు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉదంటోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.













