- Home
- Telangana
- Cold Wave Alert : అక్వాన్ తుపాను ఏపీలో కాకుండా అక్కడ తీరం దాటిందో.. తెలంగాణలో గడ్డకట్టే చలి..!
Cold Wave Alert : అక్వాన్ తుపాను ఏపీలో కాకుండా అక్కడ తీరం దాటిందో.. తెలంగాణలో గడ్డకట్టే చలి..!
ఇప్పటికే తెలంగాణలో చలి ఇరగదీస్తోంది… ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరువలో నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో అక్వాన్ తుపాను ఎఫెక్ట్ తో చలిగాలులు మరింత పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ అయ్యాయి,

తెలంగాణలో పెరిగిన చలి
Cold Wave Alert : ప్రస్తుతం తెలుగు ప్రజలను చలి గజగజా వణికిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు మరింత పడిపోతున్నాయి... కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ కు చేరువలో నమోదవుతున్నాయి. అయితే త్వరలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అక్వాన్ తుపాను తెలంగాణలో చలిగాలులపై ప్రభావం చూపనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి తుపాను చలిని తగ్గిస్తుందా లేక పెంచుతుందా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణపై ఆక్వాన్ తుపాను ఎఫెక్ట్..
బంగాళాఖాతంలో నవంబర్ 16 (సోమవారం) లేదా 17 (మంగళవారం) అక్వాన్ తుపాను ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. దీని ప్రభావం కేవలం ఆంధ్ర ప్రదేశ్ పైనే కాదు తెలంగాణపైనా ఉంటుందని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. అయితే ఇది ఎక్కడ తీరం దాటుతుంది అనేదాన్ని బట్టి తెలంగాణలో వర్షాలు, చలి ఆధారపడి ఉంటుందంటున్నారు.
అర్నబ్, మురసు మాదిరిగానే ఈ అక్వాన్ కూడా ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశాలే ఎక్కువగా తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా. ఇదే జరిగితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో నవంబర్ 21 నుండి 24 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
అయితే అక్వాన్ తుపాను ఒడిషా-పశ్చిమ బెంగాల్ ల వైపు పయనిస్తే తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారిపోతాయని అంటున్నారు. ఇదే జరిగితే నవంబర్ 20 తర్వాత చలి తీవ్రత తగ్గుతుందని... ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఇక తుపాను బంగ్లాదేశ్-మయన్మార్ వద్ద తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు తెలంగాణ వెదర్ మ్యాన్. ఇదే జరిగితే తెలంగాణలో చలి మరింత పెరుగుతుందని... ఉష్ణోగ్రతల దారుణంగా పడిపోతాయని తెలిపారు. అంటే ఇప్పుడే 10 డిగ్రీలకు చేరువగా టెంపరేచర్స్ ఉంటున్నాయి... మరింత తగ్గుతాయంటే సింగిల్ డిజిట్ కు పడిపోయే అవకాశాలుంటాయన్నమాట. ఇలా తుపాను దిశను బట్టి తెలంగాణ చలి తీవ్రత ఎలా ఉంటుందో తేలనుంది.
AKVAN CYCLONE ALERT - 1 ⚠️🌀
Low pressure - November 13
Depression - November 15 - 100% chance
Cyclone - November 17 - 85% chance
Likely to cross anywhere between Nellore/Ongole till Odisha/Bengal on November 19-20
PROBABILITIES 🌀
Case 1 - AP - 55% chances
East Telangana to get MODERATE - HEAVY RAINS during November 21-24, other parts will be mostly dry
Case 2 - Odisha/Bengal - 25% chances
Telangana will be dry, ongoing cold weather conditions will reduce after November 20
Case 3 - Bangladesh/Myanmar - 20% chances, COLDWAVE will grip Telangana with massive drop in temperatures, dry weather expected
Stay tuned for more updates ⏳
#CycloneAkvan
— Telangana Weatherman (@balaji25_t) November 11, 2026
తెలంగాణపై పంజా విసురుతున్న చలి
ప్రస్తుతం తెలంగాణలో చలి ఇరగదీస్తోంది. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ ప్రాంతంలో 10 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఆదిలాబాద్ లో 12 డిగ్రీలకు చేరువలో ఉంది. నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, హన్మకొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు అటుఇటుగా ఉష్ణోగ్రతలు ఉంటూ చలి చంపేస్తోంది.
హైదారాబాద్ లో కూడా చలిగాలులు వీస్తున్నాయి... ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటోంది. అత్యల్పంగా రాజేంద్ర నగర్ లో 12.5, పటాన్ చెరు ఈక్రిశాట్ ప్రాంతంలో 13 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మౌలాలి, శేరిలింగంపల్లి, ఆల్వాల్, దూలపల్లి, వెస్ట్ మారేడ్ పల్లి, హయత్ నగర్, కాప్రా, మేడ్చల్ ప్రాంతాల్లోనూ అత్యధిక చలి ఉంది. నవంబర్ 20 వరకు చలిగాలులు కొనసాగుతాయని... ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
అక్వాన్ తుపాను లోడింగ్..
ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ, ఆర్టీజిఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది వాయవ్య దిశగా పయనించి ఎల్లుండి (నవంబర్ 15) ఉదయానికి వాయుగుండంగా, సోమవారం (నవంబర్ 16) సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆదివారం నుంచి సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ప్రఖర్ జైన్ హెచ్చరించారు.వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. అక్వాన్ తుపాను ప్రభావంతో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిమీ గరిష్ఠంగా 60కిమీ వేగంతో గాలులతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు–కోస్తాంధ్ర తీరాల వైపు వచ్చే అవకాశం ఉందన్నారు.
అయితే ప్రస్తుతం అక్వాన్ తుపాను కచ్చితంగా ఏ దిశగా వెళ్తుంది, ఎంతవరకు బలపడుతుంది, ఎక్కడ తీరం దాటుతుంది అనే విషయాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందన్నారు ప్రఖర్ జైప్. ఈ వాతావరణ పరిస్థితులని నిశితంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు.













