MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Most Liveable Cities 2026: వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? ఇండియా, పాకిస్థాన్‌ నగరాల ర్యాంకులు ఇవే

Most Liveable Cities 2026: వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? ఇండియా, పాకిస్థాన్‌ నగరాల ర్యాంకులు ఇవే

Most Liveable Cities 2026: చాలా మంది ఇష్టపడే నగరాలు ఎన్నో ఉన్నాయి. కానీ, వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్‌ 2026లో టాప్ లో నిలిచిన నగరాలు ఏవి? ఇండియా, పాకిస్థాన్ నగరాల ర్యాంకులు ఎంత? అనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 23 2026, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నివాసానికి బెస్ట్ సిటీలు ఇవే
Image Credit : Gemini

నివాసానికి బెస్ట్ సిటీలు ఇవే

ప్రపంచంలో జీవించడానికి అత్యంత సౌకర్యవంతమైన నగరాలు ఏవి? ఎక్కడ ఉంటే ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం గడపవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ‘ది ఇకనామిస్ట్’ గ్రూప్‌కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026’ జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 173 నగరాలను పరిశీలించి ఈ ర్యాంకులను ఖరారు చేశారు.

నగరాల్లోని విద్యా సౌకర్యాలు, శాంతిభద్రతలు, వైద్య సేవలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అలాగే సంస్కృతి, పర్యావరణం వంటి ఐదు కీలక అంశాల ఆధారంగా ఈ స్కోర్లను కేటాయించారు. ఈ ఏడాది విడుదలైన జాబితాలో కొన్ని దేశాల నగరాలు టాప్ లో మెరవగా, మరికొన్ని ఆసియా నగరాలు తీవ్ర నిరాశపరిచాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాప్ లో కోపెన్‌హేగన్, వియన్నా
Image Credit : X-@denmarkdotdk

టాప్ లో కోపెన్‌హేగన్, వియన్నా

2026 ఇండెక్స్‌లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్ వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నగరం 100కు గాను 98 పాయింట్లు సాధించింది. స్టెబిలిటీ, ఎడ్యుకేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో 100కు 100 పర్ఫెక్ట్ స్కోర్ సాధించడం విశేషం. హెల్త్‌కేర్‌లో 96, కల్చర్‌లో 95 పాయింట్లు రాబట్టి అత్యుత్తమ ప్రజాసేవలు, భద్రతకు నిదర్శనంగా నిలిచింది.

రెండో స్థానంలో ఆస్ట్రియా రాజధాని వియన్నా 97.1 స్కోరుతో నిలిచింది. గతంలో పలుమార్లు తొలి స్థానంలో నిలిచిన వియన్నా, ఈసారి కూడా తన అద్భుతమైన అర్బన్ మేనేజ్‌మెంట్, మౌలిక వసతులతో టాప్-2లో కొనసాగుతోంది. ఇక మూడు, నాలుగు స్థానాలను ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్, సిడ్నీ నగరాలు సాధించాయి. మెల్‌బోర్న్ మూడో స్థానంలో నిలవగా, సిడ్నీ నాల్గో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన మూడు నగరాలు టాప్ 10లో ఉండటం విశేషం.

ఐదో స్థానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన జూరిచ్, ఆరో స్థానంలో జెనీవా నిలిచాయి. సంస్కృతి, పర్యావరణ విభాగాల్లో స్కోరు కాస్త తగ్గడంతో ఈ రెండు నగరాలు ఒక్కో మెట్టు కిందకు దిగాయి. ఏడో స్థానంలో జపాన్‌కు చెందిన ఒసాకా నగరం నిలిచింది. అత్యుత్తమ వైద్య వసతులు, తక్కువ నేరాల రేటు ఒసాకాకు ప్లస్ పాయింట్‌గా మారాయి.

Related Articles

Related image1
Cheap Fuel Countries: లీటర్ పెట్రోల్ రూ. 3 మాత్రమే! ఈ దేశాల్లో నీళ్ల కంటే చౌకగా ఇంధనం.. పూర్తి లిస్ట్ ఇదే
Related image2
Global Air Power Ranking: చైనాకి మైండ్ బ్లాక్.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎయిర్ ఫోర్స్‌గా భారత్ రికార్డ్
35
ఇండియా నగరాల పరిస్థితి ఏంటి?
Image Credit : Getty

ఇండియా నగరాల పరిస్థితి ఏంటి?

ఈ అంతర్జాతీయ జాబితాలో భారతదేశానికి చెందిన ఏ ఒక్క నగరం కూడా టాప్ 100లో చోటు దక్కించుకోలేకపోయింది. భారత్‌లోని ప్రముఖ మెట్రో నగరాలు చాలా వెనుకబడి ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 120వ ర్యాంకులో నిలిచింది. దీని తర్వాత ముంబై 121వ స్థానం, చెన్నై 123వ స్థానం, ఐటీ హబ్ బెంగళూరు 127వ స్థానంలో ఉన్నాయి.

ఢిల్లీ మొత్తం స్కోరు 100కు 48.1గా నమోదైంది. విద్య రంగంలో 66.7 స్కోరుతో మెరుగ్గా ఉన్నప్పటికీ, వైద్య రంగంలో 41.7, పర్యావరణం, సంస్కృతి విభాగంలో కేవలం 35.4 స్కోరు మాత్రమే సాధించింది. విపరీతమైన వాయు కాలుష్యం, మౌలిక వసతుల కొరత, వేగవంతమైన పట్టణీకరణ వల్ల వచ్చే సమస్యలే భారత నగరాలు వెనుకబడటానికి ప్రధాన కారణాలుగా ఈ సర్వే పేర్కొంది.

45
పాతాళంలో పాకిస్థాన్.. కరాచీ ర్యాంక్ ఎంతంటే?
Image Credit : Getty

పాతాళంలో పాకిస్థాన్.. కరాచీ ర్యాంక్ ఎంతంటే?

మన పొరుగు దేశమైన పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ సర్వే నిర్వహించిన 173 నగరాల్లో పాకిస్థాన్‌కు చెందిన కరాచీ నగరం 170వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే జీవించడానికి అత్యంత అనుకూలం కాని నగరాల జాబితాలో కరాచీ ఒకటని రిపోర్టు వెల్లడించింది.

కరాచీకి మొత్తం 100కు గాను కేవలం 43 స్కోరు మాత్రమే వచ్చింది. శాంతిభద్రతల విభాగంలో అతి తక్కువగా 20 పాయింట్లు, హెల్త్‌కేర్‌లో 54, పర్యావరణంలో 36, విద్యలో 75, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 52 పాయింట్లు వచ్చాయి. కరాచీ కంటే కింద కేవలం ఢాకా, త్రిపోలీ, డమాస్కస్ నగరాలు మాత్రమే ఉన్నాయి.

55
ఆసియా నగరాల పురోగతి
Image Credit : Asianet News

ఆసియా నగరాల పురోగతి

మొత్తంగా చూస్తే ఈఐయూ 2026 గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ప్రకారం ఐరోపా, ఆస్ట్రేలియా నగరాలు అగ్రస్థానాల్లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నాయి. అదే సమయంలో ఆసియా నగరాల్లో ముఖ్యంగా వైద్య సేవల్లో మెరుగుదల కనిపిస్తోంది. అయితే వేగంగా పెరుగుతున్న జనాభా, కాలుష్యం, మౌలిక వసతుల లేమి వంటి సమస్యల వల్ల దక్షిణ ఆసియా నగరాలైన ఇండియా, పాకిస్థాన్‌లలోని మెట్రోలు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Shiva Purana Rules: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివాభిషేకం చేసేటప్పుడు ఏ వైపు నిలబడాలి? శివపురాణం ఏం చెప్తోంది?
Recommended image2
అన్నీ ఉన్నాయన్న పొగరు పనికి రాదు.. జీవితం ఎప్పుడెలా పరీక్ష పెడుతుందో తెలియ‌దు
Recommended image3
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Related Stories
Recommended image1
Cheap Fuel Countries: లీటర్ పెట్రోల్ రూ. 3 మాత్రమే! ఈ దేశాల్లో నీళ్ల కంటే చౌకగా ఇంధనం.. పూర్తి లిస్ట్ ఇదే
Recommended image2
Global Air Power Ranking: చైనాకి మైండ్ బ్లాక్.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎయిర్ ఫోర్స్‌గా భారత్ రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved