MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Kavitha: క‌విత తిరుగుబాటు మొదలైన‌ట్లేనా.? మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, ఇంత‌కీ ఆమె టార్గెట్ ఎవ‌రు

Kavitha: క‌విత తిరుగుబాటు మొదలైన‌ట్లేనా.? మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, ఇంత‌కీ ఆమె టార్గెట్ ఎవ‌రు

ఎమ్మెల్సీ క‌విత వ్య‌వ‌హార‌శైలి తెలంగాణ రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా క‌విత చేసిన వ్యాఖ్య‌లు దుమారాన్ని రేపుతున్నాయి.

1 Min read
Author : Narender Vaitla
| Updated : May 29 2025, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బీఆర్‌ఎస్‌ను విలీనం చేసే కుట్ర జ‌రుగుతోంది.
Image Credit : twitter

బీఆర్‌ఎస్‌ను విలీనం చేసే కుట్ర జ‌రుగుతోంది.

బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలనే కుట్ర సాగుతోందని క‌విత ఆరోపించారు. తాను జైలులో ఉన్నప్పుడే ఈ కుట్రకు శ్రీకారం ప‌డిన‌ట్లు ఆమె అన్నారు. “ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టుల‌తో మాట్లాడిస్తారా.?” అని క‌విత‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
నా లేఖ ఎవ‌రు లీక్ చేశారు.?
Image Credit : Asianet News

నా లేఖ ఎవ‌రు లీక్ చేశారు.?

తనపై వచ్చిన ఫేక్ న్యూస్‌లను పార్టీ ఖండించకపోవడాన్ని క‌విత‌ విమర్శించారు. "పార్టీ సోషల్ మీడియా నుంచే నన్ను టార్గెట్ చేయడం బాధాకరం. నా లేఖ ఎవరు లీక్ చేశారు చెప్పాలి. లీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారు" అని తీవ్రంగా విమర్శించారు.

Related Articles

Related image1
Revanth Reddy: కులం కాదు, విద్యనే గొప్పతనం తీసుకొస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి
Related image2
Trump: ట్రంప్ నిర్ణ‌యంతో మారుతోన్న తెలుగు విద్యార్థుల ఆలోచ‌న‌.. అమెరికా వ‌ద్దంటే..
35
కేసీఆర్‌ నాయకత్వం తప్ప మేము ఒప్పుకోం..
Image Credit : X/RaoKavitha

కేసీఆర్‌ నాయకత్వం తప్ప మేము ఒప్పుకోం..

“పార్టీలో ఒక్క నాయకుడు ఉంటే అదే కేసీఆర్‌. ఆయన తప్ప ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను” అని కవిత స్పష్టం చేశారు. “కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకునే వాళ్లను చూసి ఆశ్చర్యం కలుగుతోంది. కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లు మీరా?” అని క‌విత ప్ర‌శ్నించారు. కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదని, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారని కవిత అన్నారు. 

45
న‌న్ను ఓడించే కుట్ర‌లు జ‌రిగాయి..
Image Credit : our own

న‌న్ను ఓడించే కుట్ర‌లు జ‌రిగాయి..

త‌న‌ను ఎంపీగా ఓడించడమే లక్ష్యంగా కొన్ని శక్తులు పని చేశాయన్నారు క‌విత‌. త‌న‌కు, కేసీఆర్‌కి మధ్య దూరం పెంచే కుట్ర సాగుతోందని ఆరోపించారు. త‌న‌ను పార్టీకి దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుస్తుందని చెప్పుకొచ్చారు.

55
కాంగ్రెస్ మునిగిపోయే నావ
Image Credit : ANI

కాంగ్రెస్ మునిగిపోయే నావ

కాంగ్రెస్‌ పార్టీ ఓ మునిగిపోయే నావ అని, అలాంటి పార్టీతో రాయబారాలు జరిపే అవసరం త‌న‌కు లేద‌ని క‌విత చెప్పుకొచ్చారు. తాను వారిలా చిచోరా రాజకీయాలు చేయనని, హుందాగా ఉంటాన‌ని తెలిపారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున తాను చేస్తున్నా అని చెప్పుకొచ్చారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
కల్వకుంట్ల కవిత
భారత రాష్ట్ర సమితి

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాదీలు మీకు ఈ విష‌యం తెలుసా.? 3 నెల‌ల‌పాటు ఆ రూట్‌లో వాహ‌నాల‌కు నో ఎంట్రీ
Recommended image2
Now Playing
బండి భగీరథ్ ను రిమాండ్ కు తరలించిన పోలీస్ లు | Bandi Bhagirath Case | Asianet News Telugu
Recommended image3
Now Playing
Bandi Bhagirath Case: బండి భగీరథ్ పై కవిత సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
Revanth Reddy: కులం కాదు, విద్యనే గొప్పతనం తీసుకొస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి
Recommended image2
Trump: ట్రంప్ నిర్ణ‌యంతో మారుతోన్న తెలుగు విద్యార్థుల ఆలోచ‌న‌.. అమెరికా వ‌ద్దంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved