- Home
- Telangana
- Hyderabad: బీ అలర్ట్.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో 36 గంటలపాటు నీటి సరఫరా బంద్
Hyderabad: బీ అలర్ట్.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో 36 గంటలపాటు నీటి సరఫరా బంద్
Hyderabad: హైదరాబాదీలు అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు నీటి సరఫరా ఉండదని ప్రకటించారు. ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదంటే.

కృష్ణా ఫేజ్–1లో సాంకేతిక లోపం
హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తున్న కృష్ణా ఫేజ్–1 వ్యవస్థలో కీలక సమస్య తలెత్తింది. సర్జ్ ట్యాంక్ సమీపంలో ఉన్న 700 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ పైప్ లైన్ వద్ద లీకేజీ ఏర్పడినట్లు మెట్రోవాటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ లోపం కారణంగా నీటి సరఫరా కొనసాగించడం ప్రమాదకరంగా మారిందని తెలిపారు.
నాసర్లపల్లి–గొడకొండ్ల లైన్‌లో మరమ్మతులు
నాసర్లపల్లి నుంచి గొడకొండ్ల వరకు విస్తరించి ఉన్న 2200 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ లో దెబ్బతిన్న భాగాలను తొలగించి కొత్తవి అమర్చే పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో పాడైన ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్‌లను పూర్తిగా మార్చుతున్నారు. దీంతో పాటు నాసర్లపల్లి వద్ద 600 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ జంక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి.
పంపింగ్ స్టేషన్లలో వాల్వ్ మార్పులు
కోదండాపూర్, నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్లలో ఉన్న 600 మిల్లీమీటర్ల డయా బీఎఫ్ వాల్వ్‌లు, ఎన్‌ఆర్‌వీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. వాటి స్థానంలో కొత్త వాల్వ్‌లను అమర్చే ప్రక్రియ చేపట్టారు. ఈ పనులన్నీ ఒకేసారి జరగడం వల్ల నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేత
మరమ్మతుల కారణంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు, మొత్తం 36 గంటల పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదని మెట్రోవాటర్ బోర్డు ప్రకటించింది. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని సూచించింది.
నీటి సరఫరా ఉండని ప్రాంతాలు ఇవే
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో మీరాలం, కిషన్‌బాగ్, బాల్షెట్టీకేట్, మొగల్‌పురా, ఫలక్‌నామా, బహదూర్‌పురా, జహనుమా, మహబూబ్ మాన్షన్, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్, యాకుత్‌పురా, బొగ్గులకుంట, నారాయణగూడ, ఆడిక్‌మెట్ రిజర్వాయర్, శివం రిజర్వాయర్, చిల్కలగూడ రిజర్వాయర్, అలియాబాద్ రిజర్వాయర్, రియాసత్‌నగర్ రిజర్వాయర్, దిల్‌సుఖ్‌నగర్, హార్డ్‌వేర్ పార్క్, జల్‌పల్లి, తుక్కుగూడ, ఫ్యాబ్‌సిటీ, మన్నెగూడా ఉన్నాయి.

