MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?

హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?

Hyderabad: హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో రూ.100 కోట్ల వ్యయంతో ఇన్నోవేషన్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. బిట్స్ పిలానీ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ పార్కును నిర్మించనున్నాయి. ఈ పార్కు ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 18 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా
Image Credit : Gemini AI

యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో రూ.100 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఇన్నోవేషన్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీతో పాటు యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. దేశంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి, బలమైన వ్యవస్థను నిర్మించడమే ఈ పార్కు ప్రధాన లక్ష్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైద్య పరికరాల తయారీపై ప్రత్యేక దృష్టి
Image Credit : Gemini AI

వైద్య పరికరాల తయారీపై ప్రత్యేక దృష్టి

పారిశ్రామిక పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో ఈ పార్కు కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, బయోఫార్మా, హెల్త్‌కేర్, వైద్య పరికరాల తయారీ రంగాలపై ఇది ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ ఇన్నోవేషన్ పార్కు నిర్మాణం కోసం యాక్సిస్ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుండి రూ.100 కోట్ల గ్రాంట్‌ను అందిస్తుంది.

Related Articles

Related image1
Motivatioal Song: జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వింటే బ‌తికే విధాన‌మే మారుతుంది
Related image2
Viral News: ఇథ‌నాల్ పెట్రోల్‌కు చీమ‌లు వ‌స్తున్నాయా.? ఈ వైర‌ల్ న్యూస్‌ నిజ‌మేనా.?
35
ఇన్నోవేషన్ పార్కు లక్ష్యాలు, ప్రాముఖ్యత
Image Credit : Gemini AI

ఇన్నోవేషన్ పార్కు లక్ష్యాలు, ప్రాముఖ్యత

ఈ ఇన్నోవేషన్ పార్కును దాదాపు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో అత్యాధునిక ప్రయోగశాలలు, స్టార్టప్‌ల కోసం ఇంక్యుబేషన్ సెంటర్లతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) అవసరమైన మౌలిక సదుపాయాలు ఒకే చోట లభిస్తాయి. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీకి సమీపంలో ఈ పార్కు ఏర్పాటు కావడం వల్ల, తెలంగాణలోని లైఫ్ సైన్సెస్ రంగానికి ఇది ఎంతో ఊతమివ్వనుంది.

45
మేక్ ఇన్ ఇండియా ల‌క్ష్య సాధ‌న ల‌క్ష్యం
Image Credit : Gemini AI

మేక్ ఇన్ ఇండియా ల‌క్ష్య సాధ‌న ల‌క్ష్యం

ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశ్యం తక్కువ ధరలో ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను కనుగొనడం అలాగే 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాలను సాధించడంలో తోడ్పడటం. బిట్స్ పిలానీ ఛాన్సలర్ కుమార్‌ మంగళం బిర్లా మాట్లాడుతూ, దేశంలో పటిష్టమైన ఆవిష్కరణల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇటువంటి సహకారాలు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. ఇది అత్యాధునిక పరిశోధనలు, వ్యవస్థాపకత రంగాల్లో బిట్స్ పిలానీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి సహాయపడుతుందన్నారు.

55
భవిష్యత్తుపై ప్రభావం
Image Credit : Gemini AI

భవిష్యత్తుపై ప్రభావం

యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అమితాబ్ చౌదరి ఈ విషయమై మాట్లాడుతూ.. జ్ఞానం, ఆవిష్కరణతో పాటు ఉద్దేశ్యం కలిసినప్పుడే అద్భుతమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది సామాజిక సవాళ్లను పరిష్కరించే దిశగా తమ ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఈ పార్కు విద్యావేత్తలు, పరిశోధకులతో పాటు పరిశ్రమ నిపుణులు కలిసి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి అవకాశాలను కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అకాడమిక్ నైపుణ్యాన్ని అలాగే పారిశ్రామిక వనరులను ఒకచోట చేర్చడం ద్వారా భారతదేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu
Recommended image2
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే
Recommended image3
Now Playing
CM Revanth Reddy: వంట చేసి విద్యార్థులతో కలిసి తిన్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
Related Stories
Recommended image1
Motivatioal Song: జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వింటే బ‌తికే విధాన‌మే మారుతుంది
Recommended image2
Viral News: ఇథ‌నాల్ పెట్రోల్‌కు చీమ‌లు వ‌స్తున్నాయా.? ఈ వైర‌ల్ న్యూస్‌ నిజ‌మేనా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved