MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Viral News: ఇథ‌నాల్ పెట్రోల్‌కు చీమ‌లు వ‌స్తున్నాయా.? ఈ వైర‌ల్ న్యూస్‌ నిజ‌మేనా.?

Viral News: ఇథ‌నాల్ పెట్రోల్‌కు చీమ‌లు వ‌స్తున్నాయా.? ఈ వైర‌ల్ న్యూస్‌ నిజ‌మేనా.?

Viral News: భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా E20 పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 18 2026, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైరల్ వీడియోలో ఏముంది?
Image Credit : Bharat Petroleum/X

వైరల్ వీడియోలో ఏముంది?

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఒక కారు ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ చుట్టూ చీమలు తిరుగుతూ కనిపించాయి. ఆ క్యాప్‌పై E20 స్టికర్ కూడా ఉండటంతో, E20 పెట్రోల్‌లో ఇథనాల్ ఉండటం వల్ల చీమలు ఆకర్షితమవుతున్నాయని కొందరు ప్రచారం చేశారు. ఈ వీడియో వేగంగా వైరల్ కావడంతో చాలా మంది వినియోగదారులు నిజంగానే E20 పెట్రోల్ వల్ల ఇలాంటి సమస్య వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
BPCL ఏమి చెప్పింది?
Image Credit : X

BPCL ఏమి చెప్పింది?

ఈ ప్రచారంపై BPCL స్పష్టమైన వివరణ ఇచ్చింది. E20 పెట్రోల్ కారణంగా చీమలు రావడం పూర్తిగా తప్పుడు ప్రచారం అని కంపెనీ తెలిపింది. ఇంధనంలో ఉపయోగించే ఇథనాల్ అనేక శుద్ధి ప్రక్రియల తర్వాత తయారవుతుందని పేర్కొంది. ఫెర్మెంటేషన్, డిస్టిలేషన్ వంటి ప్రక్రియల ద్వారా ఇథనాల్‌లో ఉండే చక్కెర వంటి పదార్థాలు పూర్తిగా తొల‌గిస్తార‌ని వివరించింది. అందువల్ల చీమలను ఆకర్షించే అంశాలు అందులో ఉండవని స్పష్టం చేసింది.

BPCL has examined the claims circulating on social media regarding ants congregating around vehicle fuel filler caps and their alleged association with E20 petrol.

Fuel-grade ethanol used for petrol blending is produced through fermentation and distillation processes that… pic.twitter.com/1qED7xBBhe

— Bharat Petroleum (@BPCLimited) June 17, 2026

Related Articles

Related image1
Holidays: విద్యార్థులతో పాటు ఉద్యోగులకు ఊహించని సెలవులు.. ఈ నెలలో 3 రోజుల లాంగ్ వీకెండ్
Related image2
మాటలతో కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్.. రోడ్డుపై గుంతలు ఉంటే ముందే హెచ్చరిస్తుంది
35
ఇథనాల్‌లో చీమలను ఆకర్షించే పదార్థాలు ఉండవా?
Image Credit : Asianet News

ఇథనాల్‌లో చీమలను ఆకర్షించే పదార్థాలు ఉండవా?

BPCL ప్రకారం, పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ "డినేచర్డ్ ఎథనాల్" రూపంలో ఉంటుంది. అంటే దానిలో ప్రత్యేక రసాయనాలు కలపడం వల్ల అది తాగడానికి అనువుగా ఉండదు. అలాగే ఈ రసాయనాలు కీటకాలను ఆకర్షించే లక్షణాలు కూడా కలిగి ఉండవు. అంతేకాకుండా E20 పెట్రోల్ వాసన కూడా సాధారణ పెట్రోల్ వాసనలాగే ఉంటుందని, చీమలు లేదా ఇతర కీటకాలను ప్రత్యేకంగా ఆకర్షించే గుణం లేదని కంపెనీ వెల్లడించింది.

45
E20 పెట్రోల్ అంటే ఏమిటి?
Image Credit : X/Twitter

E20 పెట్రోల్ అంటే ఏమిటి?

E20 అనేది 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే ఇంధనం. దేశంలో ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రోత్సహిస్తోంది. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. దీంతో రైతులకు కూడా అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తున్నాయి.

55
పర్యావరణానికి E20 ఎలా ఉపయోగపడుతుంది?
Image Credit : X/Twitter

పర్యావరణానికి E20 ఎలా ఉపయోగపడుతుంది?

E20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు కొంత మేర తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న అనేక కొత్త వాహనాలు E20 ఇంధనానికి అనుకూలంగా తయారవుతున్నాయి. పాత వాహనాల్లో ఉపయోగించినప్పుడు మైలేజీలో స్వల్ప మార్పులు కనిపించవచ్చని చెబుతున్నప్పటికీ, సాధారణ వినియోగదారులకు పెద్దగా ఇబ్బందులు ఉండవని ఆటోమొబైల్ నిపుణులు పేర్కొంటున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Free LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికి ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి?
Recommended image2
Telegram Banned: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్‌తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది?
Recommended image3
PAN Card: పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు
Related Stories
Recommended image1
Holidays: విద్యార్థులతో పాటు ఉద్యోగులకు ఊహించని సెలవులు.. ఈ నెలలో 3 రోజుల లాంగ్ వీకెండ్
Recommended image2
మాటలతో కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్.. రోడ్డుపై గుంతలు ఉంటే ముందే హెచ్చరిస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved