MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Telangana
  • Hyderabad: ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లోకి జిల్లాల బ‌స్సులు రాకుండా కొత్త బ‌స్ ట‌ర్మిన‌ల్

Hyderabad: ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లోకి జిల్లాల బ‌స్సులు రాకుండా కొత్త బ‌స్ ట‌ర్మిన‌ల్

హైదరాబాద్ లో  రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఆర్టీసీ అడుగులు వేస్తోంది. అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకల కోసం కొత్త బస్ టెర్మినల్‌ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, నగర రద్దీ తగ్గి ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసే అవకాశముంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 19 2025, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త బస్ టెర్మినల్‌కి ప్రణాళికలు సిద్ధం
Image Credit : Google Gemini AI

కొత్త బస్ టెర్మినల్‌కి ప్రణాళికలు సిద్ధం

హైదరాబాద్‌కు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా బస్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బస్సులన్నీ నగర కేంద్రంలోని ఎంజీబీఎస్‌ (MGBS)కు చేరడానికి ట్రాఫిక్ కారణంగా ఆల‌స్య‌మ‌వుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కొత్త ఇంటర్‌స్టేట్ బస్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆరాంఘర్‌ వద్ద 7.22 ఎకరాల భూమి గుర్తింపు
Image Credit : Google Gemini AI

ఆరాంఘర్‌ వద్ద 7.22 ఎకరాల భూమి గుర్తింపు

జాతీయ రహదారి 44 పక్కన ఉన్న ఆరాంఘర్‌ ప్రాంతాన్ని ఈ టెర్మినల్‌ కోసం ఎంపిక చేశారు. ఇక్కడ ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ (ICSW) భవనాలున్నాయి. వాటికి పరిహారంగా రూ. 6 కోట్లు చెల్లించేందుకు ఆర్టీసీ అంగీకరించింది. ఈ భూమిని అధికారికంగా బస్ టెర్మినల్‌ కోసం కేటాయించాలని 2025 జనవరిలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెవెన్యూశాఖకు లేఖ రాశారు. అయినా ఇప్పటివరకు ఈ ప్రతిపాదన రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పెండింగ్‌లోనే ఉంది.

Related Articles

Related image1
School Holidays: స్కూళ్ల‌కు సెల‌వులే సెల‌వులు.. ఒక్క రోజు మ్యానేజ్ చేస్తే వ‌రుస‌గా ఐదు రోజులు
Related image2
Zodiac sign: బాబా వంగా భవిష్యవాణి.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు
35
ప్రస్తుత బస్ స్టేషన్లపై పెరుగుతోన్న భారం
Image Credit : Google Gemini AI

ప్రస్తుత బస్ స్టేషన్లపై పెరుగుతోన్న భారం

హైదరాబాద్‌లో ప్రస్తుతం రెండు ప్రధాన బస్ టెర్మినల్స్ ఉన్నాయి. వీటిలో ఒక‌టి ఎంజీబీఎస్‌. ఇక్క‌డికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లే బ‌స్సులు వ‌స్తుంటాయి. ఇక మ‌రో టర్మిన‌ల్ జేబీఎస్‌. సికింద్రాబాద్‌లో ఉన్న ఈ స్టేషన్ ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, మెదక్ తదితర ప్రాంతాల నుంచి బ‌స్సులు వ‌స్తుంటాయి. ఈ రెండు బ‌స్ స్టేష‌న్ల‌పై ఒత్తిడి పెరుగుతోంది. అదే విధంగా ఔట‌ర్ రింగ్ రోడ్డు నుంచి ఈ స్టేష‌న్ల‌కు చేరుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతోంది.

45
త‌గ్గ‌నున్న ట్రాఫిక్
Image Credit : Google Gemini AI

త‌గ్గ‌నున్న ట్రాఫిక్

నూతన టెర్మినల్ ఏర్పాటుతో పాటు నగరంలోకి ప్రవేశించే బస్సుల సంఖ్య తగ్గుతుంది. ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాదు, ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రాత్రిపూట నగరంలోకి వచ్చే బస్సులు నేరుగా ఆరాంఘర్‌ టెర్మినల్‌ వద్దే ఆగిపోతే, నగరప్రజలకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

55
త్వ‌ర‌లోనే టెర్నిన‌ల్‌ నిర్మాణం
Image Credit : Google Gemini AI

త్వ‌ర‌లోనే టెర్నిన‌ల్‌ నిర్మాణం

ఇప్పటికే భూ సంబంధిత నివేదికలు సిద్ధమవుతున్నాయి. రంగారెడ్డి కలెక్టరేట్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగానే బస్ టెర్మినల్ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ నగరానికి మరో కీలక బస్సు కేంద్రం లభించనుంది. నగర చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది.

కాగా గ‌తంలో న‌గ‌రానికి నాలుగు వైపుల ఇలాంటి టర్మిన‌ల్స్‌ను నిర్మించే ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయి. దీంతో జిల్లాల నుంచి హైద‌రాబాద్ వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌న్నీ ఆయా మార్గ‌ల్లో ఉన్న ట‌ర్మిన‌ల్స్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతాయి. అక్క‌డి నుంచి ప్ర‌యాణికులు సిటీ బ‌స్సుల్లో న‌గ‌రంలోకి వెళ్లాల్సి ఉంటుంది. మ‌రి ఈ ట‌ర్మిన‌ల్స్ ఆరంఘ‌ర్‌తోనే ఆగిపోకుండా న‌గ‌ర న‌లుమూల‌ల విస్త‌రిస్తుందో చూడాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ... తెలుగు రాష్ట్రాలపై స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
Recommended image2
80s AI: ట్రెండ్ ఫాలో అవుతోన్న సీఎం సాబ్‌.. రేవంత్ రెడ్డి రెట్రో లుక్ చూశారా.?
Recommended image3
School Holidays : ఈ శని, ఆది, సోమవారం సెలవులు కన్ఫర్మ్... వచ్చే గురువారం మరో హాలిడే రెడీ
Related Stories
Recommended image1
School Holidays: స్కూళ్ల‌కు సెల‌వులే సెల‌వులు.. ఒక్క రోజు మ్యానేజ్ చేస్తే వ‌రుస‌గా ఐదు రోజులు
Recommended image2
Zodiac sign: బాబా వంగా భవిష్యవాణి.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved