MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • IMD Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

IMD Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

IMD Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాలకు ఐఎండీ హై అలర్ట్ ఇచ్చింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2026, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దంచికొట్టనున్న వానలు.. గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈదురు గాలులు
Image Credit : Gemini

దంచికొట్టనున్న వానలు.. గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈదురు గాలులు

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల జోరు మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని పలు ప్రాంతాలకు హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండంగా మారడంతో పాటు నైరుతి రుతుపవనాలు దేశంలో చాలా యాక్టివ్‌గా కదులుతున్నాయి.

ఈ డబుల్ ఇంపాక్ట్ వల్ల రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారింది. వెదర్ అంతా కూడా కూల్ అయింది. పలు ప్రాంతాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) అధికారికంగా ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తెలంగాణలో గాలుల బీభత్సం
Image Credit : Getty

గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తెలంగాణలో గాలుల బీభత్సం

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో వర్షాలు గట్టిగానే పడనున్నాయి. కేవలం వానలే కాదు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా జూలై 11 వరకు ఈ బలమైన గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఈ ఈదురు గాలుల వల్ల చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, రోడ్లపై వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా బైక్ రైడర్స్ చాలా అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు.

34
రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Image Credit : Gemini AI

రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో చాలా కీలకమని అధికారులు చెప్తున్నారు. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కుమరమ్ భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ తుపాను వాతావరణం ఏర్పడేలా కనిపిస్తోంది.

పిడుగులు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నందున, ఉరుములు వచ్చేటప్పుడు ఎవరూ చెట్ల కింద గానీ, ఓపెన్ ప్లేసెస్‌లో గానీ నిలబడకూడదని వాతావరణ అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అటు గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఒక్కసారిగా పుంజుకోనుంది. లోతట్టు ప్రాంతాల జనాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అధికారులు తెలిపారు.

44
ఏపీలోనూ మొదలైన వానల జోరు.. కోస్తాంధ్ర అలర్ట్
Image Credit : Gemini

ఏపీలోనూ మొదలైన వానల జోరు.. కోస్తాంధ్ర అలర్ట్

తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాల ప్రభావం గట్టిగానే కనిపించబోతోంది. ఏపీలోని పలు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వానలు పడే సూచనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) సమాచారం ప్రకారం.. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నాయి.

శ్రీకాకుళంతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా వానలు జోరుగా కురిసే ఛాన్స్ ఉంది. మిగిలిన జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా చినుకులు పడుతూ క్లైమేట్ పూర్తిగా మారబోతోందని అధికారులు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే
Recommended image3
నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు
Related Stories
Recommended image1
Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Recommended image2
Bonalu Potharaju Story: అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో కొరడా దెబ్బల రహస్యం ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved