MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • గోలీమార్‌.. హైద‌రాబాద్‌లో పోలీసుల కాల్పులు. అస‌లేం జ‌రిగిందంటే.?

గోలీమార్‌.. హైద‌రాబాద్‌లో పోలీసుల కాల్పులు. అస‌లేం జ‌రిగిందంటే.?

Hyderabad: నిజామాబాద్‌లో బైక్ దొంగ రియాజ్ చేతిలో ప్ర‌మోద్ అనే కానిస్టేబుల్ హ‌త్య‌కు గురికావ‌డం ఆ త‌ర్వాత రియాజ్ మ‌ర‌ణించ‌డం తెలిసిందే. తాజాగా హైద‌రాబాద్‌లో మ‌రోసారి కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. 

2 Min read
Narender Vaitla
Published : Oct 26 2025, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చాదర్‌ఘాట్‌లో పోలీసు కాల్పులు
Image Credit : Generated by google gemini AI

చాదర్‌ఘాట్‌లో పోలీసు కాల్పులు

హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా గ్రౌండ్ దగ్గర శనివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. మొబైల్‌ స్నాచింగ్‌ చేస్తున్న ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్య అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో ఒక దొంగ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో డీసీపీ ఆత్మరక్షణలో కాల్పులు జరిపిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

25
కాల్పుల్లో ఎవరు గాయపడ్డారు?
Image Credit : hyderabadpolice.gov.in

కాల్పుల్లో ఎవరు గాయపడ్డారు?

డీసీపీ చైతన్య మూడు రౌండ్లు కాల్పులు జరిపార‌ని తెలుస్తోంది. ఈ దాడిలో ఒక దొంగకు ఛాతీ, భుజం, మెడ భాగాల్లో గాయాలు అయ్యాయి. గాయపడిన అతడిని వెంటనే నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. మరో దొంగ పారిపోయాడు. డీసీపీతో ఉన్న గన్‌మన్ కూడా తోపులాటలో స్వల్పంగా గాయపడ్డాడు.

Related Articles

Related image1
రూ. 20 వేల పెట్టుబడితో నెలకు రూ. 30 వేల ఆదాయం.. సొంత ఊరిలోనే డబ్బులు సంపాదించే అవకాశం
Related image2
ఈ ఉద్యోగం చేస్తున్న వారిలోనే వివాహేత‌ర సంబంధాలు ఎక్కువంటా.. స‌ర్వేలో విస్తుపోయే నిజాలు
35
గాయపడిన దొంగ ఎవరు?
Image Credit : Gemini

గాయపడిన దొంగ ఎవరు?

పోలీసులు గాయపడిన దొంగను మహ్మద్‌ ఒమర్‌ అన్సారీగా గుర్తించారు. అతడు పాతబస్తీకి చెందిన రౌడీషీటర్‌. మొబైల్‌ దొంగతనాలు, దాడులు వంటి పలు కేసులు అతనిపై ఉన్నాయి. రెండు సంవత్సరాలు జైలులో ఉండి, ఇటీవలే బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. ఒమ‌ర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

45
సీపీ సజ్జనార్ స్పందన
Image Credit : our own

సీపీ సజ్జనార్ స్పందన

ఈ ఘటనపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్ స్పందించారు. పోలీసులు ఎవరిపైనా అనవసరంగా కాల్పులు జరపరని, కానీ ఆత్మరక్షణ కోసం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. "పోలీసులపై దాడి చేస్తే ఎవరినీ విడిచిపెట్టం. ప్రజల భద్రత కోసం పోలీసులే కష్టపడుతున్నారు," అని ఆయన హెచ్చరించారు.

#WATCH | Hyderabad, Telangana: Police Commissioner VC Sajjanar says, "Around 5 pm, DCP Chaitanya and his gunman saw a mobile snatching at Chadar Ghat Victory Playground. They tried to apprehend the offender, who attacked with a knife. During the scuffle, DCP fired two rounds,… pic.twitter.com/85ZqzbBUy7

— ANI (@ANI) October 25, 2025

55
కొన‌సాగుతోన్న ద‌ర్యాప్తు
Image Credit : Telangana Police

కొన‌సాగుతోన్న ద‌ర్యాప్తు

డీసీపీ చైతన్య ఫిర్యాదుతో సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని క్లూస్‌ టీమ్‌ పరిశీలించి ఆధారాలు సేకరిస్తోంది. పరారీలో ఉన్న మరో దొంగ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గాయపడిన డీసీపీ, గన్‌మన్‌ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
హైదరాబాద్
నేరాలు, మోసాలు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved