రూ. 20 వేల పెట్టుబడితో నెలకు రూ. 30 వేల ఆదాయం.. సొంత ఊరిలోనే డబ్బులు సంపాదించే అవకాశం
Business Idea: ఉన్న ఊరిలోనే ఉంటూ డబ్బులు సంపాదించాలని చాలా మంది కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల వ్యాపారాలను అన్వేషిస్తుంటారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించే ఇలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ
ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే ఫుడ్ కోర్ట్‌లు, రెస్టారెంట్లు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు వీధి స్థాయిలో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్‌లు బాగా పాపులర్ అవుతున్నాయి. చిన్న పట్టణాలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, సినిమా థియేటర్ల దగ్గర ఇవి మంచి ఆదాయం ఇస్తాయి. ఒక చిన్న స్టాల్ పెట్టి రోజువారీ లాభాలు ఆర్జించవచ్చు.
ప్రారంభించేందుకు కావాల్సిన సామగ్రి
ఈ వ్యాపారం మొదలుపెట్టేందుకు అవసరమైన ముఖ్యమైన సామాగ్రి ఇవే..
* ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్: సుమారు రూ. 3,500 నుంచి ప్రారంభమవుతుంది.
* స్టాల్ ఏర్పాటు: సాధారణ ప్లాస్టిక్ లేదా టేబుల్ స్టాల్ రూ. 5,000 లోపే వస్తుంది.
* పొటాటో ఫింగర్ చిప్స్: 2.5 కిలోల ప్యాక్ రూ. 270– రూ. 300 మధ్యలో లభిస్తుంది.
* నూనె, మసాలాలు, ప్యాకెట్లు: రూ.1,000 లోపే సరిపోతాయి. (ఒక్క రోజు నడిపించేందుకు)
మొత్తం మీద మొదట్లో రూ. 20,000 నుంచి రూ. 30,000 పెట్టుబడితో ఈ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు.
తయారీ విధానం సులభం
తయారీ ప్రక్రియ చాలా సింపుల్. ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్‌లో నూనె వేసి, వేయించడమే. అవి బంగారు రంగులోకి మారిన తర్వాత చాట్ మసాలా లేదా ప్రత్యేక సాస్ చల్లాలి. వేడి వేడి ఫ్రైస్ కస్టమర్లను ఆకర్షిస్తాయి. మీరు మీ సొంత బ్రాండింగ్‌తో కూడా ప్యాకెట్లను రడీ చేసుకోవచ్చు.
లాభాలు ఎలా ఉంటాయంటే.?
ఒక్క ప్యాకెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి సుమారు రూ. 20 ఖర్చవుతుంది. దాన్ని రూ. 50కి విక్రయిస్తే ఒక్క ప్యాకెట్‌పై రూ. 30 లాభం వస్తుంది. తక్కువలో తక్కు రోజు 40 ప్యాకెట్లు అమ్మినా.. రూ. 1200 వరకు లాభం పొందొచ్చు. ఇలా చూసుకుంటే నెలకు రూ. 35000 వరకు ఆదాయాన్ని పొందొచ్చు. అదనంగా వీకెండ్ లేదా ఈవెంట్స్ సమయంలో విక్రయాలు పెరిగితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.
ఎలా ప్రారంభించాలి.?
ప్రారంభంలో చిన్న స్టాల్‌తో మొదలుపెట్టి, క్రమంగా లొకేషన్‌లు పెంచుకోవచ్చు. కస్టమర్లకు ప్రత్యేక సాస్‌లు, చీజ్ ఫ్రైస్ లేదా పెరి పెరి ఫ్రైస్ వంటి వేరియేషన్లు అందిస్తే మీ బ్రాండ్‌కు మంచి గుర్తింపు వస్తుంది. కొద్దికాలంలోనే ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ చిన్న వ్యాపారం నుంచి పెద్ద ఫుడ్ బ్రాండ్‌గా ఎదగొచ్చు.