MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Hyderabad: ఎంత‌కు తెగించ్చార్రా.? ఇది తెలిస్తే ఇక‌పై బ‌య‌ట ఫుడ్ చ‌చ్చినా తిన‌రు

Hyderabad: ఎంత‌కు తెగించ్చార్రా.? ఇది తెలిస్తే ఇక‌పై బ‌య‌ట ఫుడ్ చ‌చ్చినా తిన‌రు

Hyderabad: మ‌నిషిని ఎంత డెవ‌ల‌ప్ అవుతున్నాడో అంత‌లా మోసాలు కూడా పెరుగుతున్నాయి. అడ్డ‌దారిలో డ‌బ్బులు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకోసం ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని సైతం ప్ర‌మాదంలో ప‌డేస్తున్నారు కొంద‌రు కేటుగాళ్లు. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Mar 26 2026, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాస్క్ ఫోర్స్ దాడులతో బయటపడిన అక్రమాలు
Image Credit : Gemini AI

టాస్క్ ఫోర్స్ దాడులతో బయటపడిన అక్రమాలు

టాస్క్‌ఫోర్స్ అధికారుల‌కు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఆహార భద్రతా నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘించినట్లు గుర్తించారు. పరిశుభ్రత లేకుండా ఆహార పదార్థాలు తయారు చేయడం, ప్రమాదకర రసాయనాలు కలపడం వంటి అనేక అక్రమాలు బయటపడ్డాయి. నాసిక‌రం వ‌స్తువుల‌తో త‌యారు చేసిన వ‌స్తువుల‌ను మార్కెట్లో విక్ర‌యిస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అత్తాపూర్‌లో క‌ల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్
Image Credit : stockPhoto

అత్తాపూర్‌లో క‌ల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్

జూబ్లీహిల్స్ జోన్‌కు చెందిన కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీ ప్రాంతంలో దాడులు నిర్వహించింది. ‘డెక్కన్ ట్రేడర్స్’ పేరుతో నడుస్తున్న రెండు గోదాములను తనిఖీ చేశారు. ఈ కేసులో సోహైల్ చరణియా (38), రహీమ్ చరణియా (36), అమిత్ చరణియా (35)లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

34
ప్రమాదకర రసాయనాలతో పేస్ట్ త‌యారీ
Image Credit : stockPhoto

ప్రమాదకర రసాయనాలతో పేస్ట్ త‌యారీ

పోలీసుల సమాచారం ప్రకారం నిందితులు పూర్తిగా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. ఇందులో అసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్స్, వెల్లుల్లి తొక్కలు వంటి పదార్థాలు కలిపి తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉత్పత్తులను హైదరాబాద్‌లోని కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు పెద్ద మొత్తంలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాడుల్లో 70 క్వింటాళ్ల అల్లం–వెల్లుల్లి పేస్ట్, సింథటిక్ కలర్ ప్యాకెట్లు, 40 లీటర్ల యాసిడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

44
కాటేదాన్‌లో అక్రమ బేకరీ యూనిట్‌పై మరో దాడి
Image Credit : social media

కాటేదాన్‌లో అక్రమ బేకరీ యూనిట్‌పై మరో దాడి

మరో ఘటనలో మార్చి 24న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కాటేదాన్ ప్రాంతంలో ఉన్న ‘మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ’ అనే అక్రమ ఆహార తయారీ కేంద్రంపై దాడి చేశారు. ఈ కేసులో అఫ్రిది అన్సారీ (22), యాసిన్ (32), ఖత్రేశన్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు పాడైన గుడ్లు, రసాయనాలు ఉపయోగించి కేకులు, డోనట్ బన్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పాడైన గుడ్లతో కేకులు తయారు చేసి విక్రయం

ఈ యూనిట్‌లో పూర్తిగా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్, కాల్షియం ప్రొపియోనేట్, పొటాషియం సోర్బేట్, PGPR లిక్విడ్ వంటి రసాయనాలను ఉపయోగించి పాడైన పదార్థాలను ప్రాసెస్ చేస్తున్నారు. తయారు చేసిన కేకులు, డోనట్ బన్స్‌ను తాజాగా తయారైనవి అన్నట్టు మార్కెట్‌లో విక్రయిస్తూ ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడుల్లో 330 పాడైన గుడ్లు, 150 కిలోల కేకులు, డోనట్ బన్స్, పెద్ద మొత్తంలో రసాయనాలు, డాల్డా, పాలు పొడి, సింథటిక్ కలర్స్, ఫ్లేవర్స్, బేకింగ్ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు

ఈ ఘటనలపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..
Recommended image2
విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
Recommended image3
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Related Stories
Recommended image1
Philips: ఇంట్లో ఇదొక్క‌టి ఉంటే చాలు.. ఇక‌పై గ్యాస్ సిలిండ‌ర్ కొనాల్సిన ప‌ని ఉండ‌దు.
Recommended image2
Summer: ఎయిర్ కండిష‌న్ జాకెట్‌.. ఇది వేసుకుంటే ఎంత ఎండ‌లో ప‌నిచేసినా కూల్‌గా ఉండొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved