- Home
- Telangana
- Medaram Jathara 2026 : మేడారంకు ఎక్కడెక్కడి నుండి ఆర్టిసి బస్సులుంటాయి.. ఎక్కడి నుండి ఎంత ఛార్జీ..?
Medaram Jathara 2026 : మేడారంకు ఎక్కడెక్కడి నుండి ఆర్టిసి బస్సులుంటాయి.. ఎక్కడి నుండి ఎంత ఛార్జీ..?
Medaram Jathara 2026 : మేడారం మహాజాతర నేపథ్యంలో తెలంగాణ ఆర్టిసి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి బస్సులున్నాయి… ఎక్కడినుండి ఎంత ఛార్జ్ ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

మేడారం జాతరకు వెళుతున్నారా..? అయితే మీకోసమే ఈ సమాచారం
Medaram Jathara 2026 : భారతదేశంలో కాదు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మేడారం సిద్దమయ్యింది. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు తెలుగు రాష్ట్రానుండే కాదు దేశ నలుమూలల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. విదేశాల నుండి వస్తుంటారు. ఇలా ఈసారి కూడా వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తనున్నారు. ఇప్పటికే మేడారం జనసంద్రంగా మారింది... రాబోయే నాలుగురోజులు (జనవరి 28 నుండి 31 వరకు) మరింత కీలకం. ఈ రోజుల్లోనే అసలైన జాతర.
మేడారం జాతర నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, వివిధ ప్రాంతాల నుండి తెలంగాణ ఆర్టిసి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. కేవలం ఈ మహాజాతర కోసమే ఏకంగా 4000 కు పైగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రకటించింది. ఇందుకోసం 11,000 మందికి పైగా అనుభవజ్ఞులైన డ్రైవర్లు, సిబ్బంది పనిచేయనున్నారని ప్రకటించింది. రాష్ట్ర నలుమూలల నుండి బస్సులు నడుపుతున్నామని... మేడారం మహా జాతరకు చేరుకోడానికి అత్యంత భద్రమైన ప్రయాణం ఆర్టిసి అందిస్తుందని ఆర్టిసి ఉన్నతాధికారులు చెబుతున్నారు.
మేడారం జాతర 2026 సందర్భంగా భక్తుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక బస్సులు ప్రారంభించింది.
4000 ప్రత్యేక బస్సులు, 11,000 మంది సిబ్బందితో సురక్షిత ప్రయాణం🚍🙏#medaramjathara2026#sammakkasaralamma#tgsrtc#specialbuses#safejourney#Telanganapic.twitter.com/1dPJjjpkJ3— TGSRTC (@TGSRTCHQ) January 25, 2026
హైదరాబాద్ నుండి మేడారంకు బస్సు ఛార్జీ ఎంత..?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి మేడారంకు భారీగా ఆర్టిసి బస్సులు నడవనున్నాయి. నేరుగా మేడారంకు బస్సు సదుపాయం లేనివారు హైదరాబాద్ కు చేరుకుని ఇక్కడినుండి వెళ్లవచ్చు. జనవరి 28 నుండి 31 వరకు 24 గంటలూ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టిసి అధికారులు తెలిపారు.
ఛార్జీల విషయానికి వస్తే... హైదరాబాద్, మేడారం మధ్య నడిచే ప్రత్యేక బస్సుల్లో రూ.600 నుండి రూ.630 ఛార్జీ ఉంటుందని ఆర్టిసి ప్రకటించింది. హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ బస్టాండ్ (MGBS)తో పాటు ఇతర బస్టాండులు, వివిధ ప్రాంతాలను నుండి మేడారంకు బస్సులు నడుస్తాయి. బస్సు రకం (ఎక్స్ ప్రెస్, సెమీ డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ), ప్రారంభమయ్యే ప్రాంతాన్ని బట్టి ఛార్జీలు మారుతుంటాయి.
ప్రధాన పట్టణాల నుండి మేడారంకు ఆర్టిసి బస్ ఛార్జీలు
- హన్మకొండ - రూ.250
- వరంగల్ - రూ.250
- కరీంనగర్ - రూ.390
- పెద్దపల్లి - రూ.420
- భద్రాచలం - రూ.300
- ఖమ్మం - రూ.480
- ఆసిఫాబాద్ - రూ.590
- పరకాల - రూ.250
- మహబూబాబాద్ - రూ.360
- ములుగు - రూ.160
- భూపాలపల్లి - రూ.230
- మంథని - రూ.350
- గోదావరిఖని - రూ.400
- హుస్నాబాద్ - రూ.350
- హుజురాబాద్ - రూ.320
- బెల్లంపల్లి - రూ.520
- చెన్నూరు - రూ.450
- మంచిర్యాల - రూ.440
వివిధ ప్రాంతాల నుండి మేడారంకు బస్సు ఛార్జీలు
- కాజీపేట - రూ.250
- జనగాం - రూ.400
- స్టేషన్ ఘనపూర్ - రూ.330
- నర్సంపేట - రూ.270
- కొత్తగూడ - రూ.330
- చిట్యాల - రూ.260
- గూడూరు - రూ.300
- తొర్రూరు - రూ.360
- వర్ధన్నపేట - రూ.300
- ఆత్మకూరు - రూ.210
- మల్లంపల్లి - రూ.190
- ఘన్ పూర్ (ము) - రూ.200
- జంగాలపల్లి - రూ.150
- పస్రా - రూ.80
- గొవిందరావుపేట - రూ.100
- తాడ్వాయి - రూ.60
- ఇల్లందు - రూ.400
- ఇల్లందు (వయా గుండాల) - రూ.270
- కొత్తగూడెం - రూ.350
- మణుగూరు - రూ.210
- ఏటూరు నాగారం - రూ.80
- మంగపేట - రూ.110
- పాల్వంచ - రూ.310
- కాళేశ్వరం - రూ.360
- సిరోంచ (మహారాష్ట్ర) - రూ.400
- కాటారం - రూ.290
- మందమర్రి - రూ.470
- శ్రీరాంపూర్ - రూ.430
- చర్ల - రూ.250
- వెంకటాపూర్ - రూ.150
- వాజేడు - రూ.120
- పేరూరు - రూ.160
మేడారం జాతరలో అసలైన ఘట్టాలివే..
జనవరి 28 (బుధవారం) నుండి మేడారంలో అసలైన మహా జాతర మొదలవుతుంది... అడవుల నుండి అమ్మవార్లు గద్దెలపైకి చేరుకుంటారు. మొదటిరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో జాతర ఘట్టం మొదలవుతుంది. జనవరి 29(గురువారం) సమ్మక్క కూడా గద్దెపై కొలువుదీరుతుంది. ఇలా జనవరి 30న (శుక్రవారం) సమ్మక్క-సారలమ్మ ఇద్దరు దేవతలు గద్దెలపై కొలువై భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక జనవరి 31(శనివారం) సాయంత్రం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవుళ్లు తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం జాతర ముగుస్తుంది.

