MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • Holiday : ఈ ఒక్కరోజే స్కూళ్లు, ఆఫీసులు.. మీకు ఈ మెసేజ్ వచ్చిందో మళ్లీ సెలవే..!

Holiday : ఈ ఒక్కరోజే స్కూళ్లు, ఆఫీసులు.. మీకు ఈ మెసేజ్ వచ్చిందో మళ్లీ సెలవే..!

Ambedkar Jayanti Holiday : ఇటు తెలంగాణ, అటు ఏపీలో గత వీకెండ్ వరుసగా రెండ్రోజులు సెలవులు వచ్చాయి. ఇవాళ ఒక్కరోజే వర్కింగ్ డే… మళ్లీ రేపు మరో సెలవులు వస్తోంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 13 2026, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగోళ్లకు మరో సెలవు..
Image Credit : Asianet News

తెలుగోళ్లకు మరో సెలవు..

Holidays : తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త. ఎగ్జామ్స్ సమయం కావడంతో చదువుల ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు, పనిఒత్తిడితొ సతమతం అవుతున్న ఉద్యోగులకు ఇప్పటికే వరుసగా రెండ్రోజులు (ఏప్రిల్ 11 రెండో శనివారం, ఏప్రిల్ 12 ఆదివారం) సెలవులు వచ్చాయి. ఇప్పుడు మరో సెలవు వస్తోంది... రేపు (ఏప్రిల్ 14) ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో సెలవే. ఇప్పటికే విద్యాసంస్థలు పిల్లల పేరెంట్స్ కు సెలవు మెసేజ్ లు పంపించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అంబేద్కర్ జయంతి సెలవు...
Image Credit : Getty

అంబేద్కర్ జయంతి సెలవు...

ఏప్రిల్ 14న అంటే రేపు (మంగళవారం) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. అందుకే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవు ఉంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సెలవు ఉంది. బ్యాంక్ ఉద్యోగులకు కూడా అంబేద్కర్ జయంతి సెలవు వర్తిస్తుంది… అంటే రేపు బ్యాంకులు మూతపడి ఉండనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి ఏప్రిల్ 14న సెలవు ఉంది. ప్రైవేట్ విద్యాసంస్థలు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు సెలవు మెసేజ్ పంపిస్తోంది. ఇలా మీకు కూడా మెసేజ్ వచ్చిందా...? అయితే మీ పిల్లలకు స్కూల్ లేనట్లే. ఈ సెలవు విద్యార్థుల పరీక్షలకు సంసిద్దం అయ్యేందుకు ఉపయోగపడతాయి.

35
ఏప్రిల్ 14 ఆప్షనల్ హాలిడే కూడా...
Image Credit : Getty

ఏప్రిల్ 14 ఆప్షనల్ హాలిడే కూడా...

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి మాత్రమే కాదు తమిళ్ న్యూ ఇయర్. అయితే అంబేద్కర్ జయంతికి తెలంగాణ, ఏపీలో సాధారణ సెలవు ఇచ్చింది... కానీ తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది.  ఇలా ఆప్షనల్ హాలిడే అవసరం లేకుండానే రేపు (మంగళవారం) సాధారణ సెలవు వస్తోంది.

45
ఏప్రిల్ 20న మరో సెలవు..
Image Credit : Getty

ఏప్రిల్ 20న మరో సెలవు..

ఏప్రిల్ 20న అంటే వచ్చే సోమవారం మరో సెలవు వస్తోంది. బసవ జయంతి సందర్భంగా హాలిడే ఉంది... కానీ ఇది కేవలం తెలంగాణలోనే, ఏపీలో సెలవు ఉండదు. ఇది ఆప్షనల్ హాలిడే.. కాబట్టి అవసరం అనుకుంటే తెలంగాణ ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఇలా ఈవారం మాదిరిగానే వచ్చవారం కూడా ఆది, సోమవారం రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.

55
వేసవి సెలవులు.
Image Credit : unsplash

వేసవి సెలవులు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మే మొత్తం సెలవులే.. జూన్ 11 వరకు సెలవులు ఉంటాయి... జూన్ 12 విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి. దాదాపు 48 రోజుల పాటు తెలుగు విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ఉంటాయి… ఈ సెలవుల్లో సొంతూళ్లలో గడిపేందుకు పిల్లలు సిద్దంగా ఉన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
ఉద్యోగాలు, కెరీర్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image3
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Related Stories
Recommended image1
Bank Holidays : ఏప్రిల్ 1 నుండి వరుసగా సెలవులు.. ఈ నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్ !
Recommended image2
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved