Hyderabad Rains: హైదరాబాద్‌పై మళ్లీ వర్ష బీభత్సం.. తెలంగాణకు అతిభారీ వర్షాలు
Heavy Rains in Telangana: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో 17వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి.

హైదరాబాద్ లో దంచికొడుతున్న వానలు
Telangana Rains: హైదరాబాద్ మళ్లీ వర్ష బీభత్సం మొదలైంది. ప్రస్తుతం వానలు దంచికొడుతున్నాయి. కొన్ని రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వానతో నగర జీవనం అతలాకుతలమవుతోంది. వాతావరణ శాఖ ఇప్పటికే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఉధృతం కానుందని హెచ్చరికలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం నగరంలోని బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో రహదారులు చెరువులను తలపించాయి. ఉప్పల్‌లో ట్రాఫిక్ సమస్యలు, అమీర్‌పేట్, మైత్రివనం వద్ద వాటర్‌లాగింగ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.
#HyderabadRains Havoc
@ Malakpet RUB. It's Terrible! pic.twitter.com/JYEAvdtK9m— Hi Hyderabad (@HiHyderabad) August 9, 2025
KNOW
భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
భారీ వర్షాల క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం అన్ని శాఖలకు పరిస్థితిని నిరంతరం సమీక్షించమని ఆదేశించింది.
నగరంలో భారీ వర్షం
సహాయక చర్యల్లో హైడ్రా DRF బృందాలు
నగరంలో శనివారం రాత్రి భారీవర్షం కురిసింది. రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటలవరకు 10 నుంచి 14 సెంటీమీటర్ల వరకు కురిసిన వర్షంతో రహదారులను, లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వర్షం సమాచారం ముందుగానే తెలుసుకున్న హైడ్రా DRF… pic.twitter.com/Hm32aLmVuC— HYDRAA (@Comm_HYDRAA) August 9, 2025
తెలంగాణ వ్యాప్తంగా వర్షాల అలర్ట్
ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, రాబోయే అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఆదివారం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశాముందని అధికారులు హెచ్చరించారు.
🌧 Hyderabad Rainfall Alert 🌩
Heavy & intense rain with thunderstorms expected this evening!
☔ 30–60 mm rainfall likely in many parts of the city
🏠 Stay indoors
🚫 Avoid unnecessary travel.@harichandanaiaspic.twitter.com/HwKX3SWfdK— Collector Hyderabad (@Collector_HYD) August 10, 2025
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు
శనివారం రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగర శివార్లను వణికించింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని తొర్రూర్‌లో 13.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో వర్షం కారణంగా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
@Hyderabadrains
Sri krishna Nagar b block yousuf guda pic.twitter.com/XhZkgTI7j7— Arun (@ArunArunajith58) August 9, 2025
ఈ వారంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
భారత వాతావరణ శాఖ ప్రకారం ఈ వారంలో తెలంగాణ వ్యాప్తంగా వర్ష ప్రభావం ఉండనుంది. ఆగస్టు 14 నుండి 17 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ నిపుణులు టి. బాలాజీ అంచనా ప్రకారం.. అల్పపీడన ప్రాంతం (LPA) ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి ప్రస్తుతం 27.5 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదవుతున్నాయి.
Once again, ALERTING from August 14 to 17, an LPA will bring FLOODING RAINS across the entire TELANGANA.
Officials are urged to be prepared and take all necessary actions in advance.
2nd Update on LPA coming Tomorrow stay tuned for the latest on the Aug 14–17 flooding rain… https://t.co/mXqeFjSOOW— Hyderabad Rains (@Hyderabadrains) August 10, 2025