- Home
- National
- PM Modi: మెట్రో కొత్త లైన్, 3 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోడీ.. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్టేనా?
PM Modi: మెట్రో కొత్త లైన్, 3 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోడీ.. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్టేనా?
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో మూడు వందే భారత్ రైళ్లతో పాటు కొత్త మెట్రో లైన్ కూడా ప్రారంభించారు. అలాగే, మెట్రో ఫేజ్-3 ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.

కర్ణాటక పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కర్ణాటక పర్యటనలో భాగంగా బెంగళూరుకు చేరుకున్నారు. హాల్ (HAL) విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా మేఖ్రి సర్కిల్ హెలిప్యాడ్‌కి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సంగొళ్లి రాయణ్ణ రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు.
ఇక్కడ బెంగళూరు–బెలగావి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అలాగే, అమృత్‌సర్–శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా, నాగపూర్ (అజ్ని)–పూణే వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభించారు.
ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳಿಗೆ ಚಾಲನೆ ನೀಡಲು ರಾಜ್ಯಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ಪ್ರಧಾನಿ ಶ್ರೀ @narendramodi ಅವರನ್ನು ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ @BSYBJP , ಪ್ರತಿಪಕ್ಷ ನಾಯಕರಾದ ಶ್ರೀ @RAshokaBJP ಆತ್ಮೀಯವಾಗಿ ಸ್ವಾಗತಿಸಿದರು.
ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಉಸ್ತುವಾರಿಗಳಾದ ಡಾ. @AgrawalRMD , ಸಹ ಉಸ್ತುವಾರಿಗಳಾದ ಶ್ರೀ @ReddySudhakar21… pic.twitter.com/XmIwFVWCT1— BJP Karnataka (@BJP4Karnataka) August 10, 2025
KNOW
ప్రధాని మోడీ ప్రారంభించిన మూడు వందే భారత్ రైళ్ల వివరాలు
బెంగళూరు - బెలగావి: కళ్యాణ కర్ణాటక రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.
అమృత్‌సర్ - శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా: ఆధ్యాత్మిక ప్రయాణికులకు మెరుగైన ప్రయాణాలు అందిస్తుంది.
నాగపూర్ (అజ్ని) - పూణే: మహారాష్ట్రలో వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుంది.
బెంగళూరు–బెలగావి రైలు బుధవారం తప్ప వారంలో అన్ని రోజులు నడుస్తుంది. ఉదయం 5.20కు బెలగావి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.50కు బెంగళూరుకు చేరుతుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2.20కు ప్రారంభమై రాత్రి 10.40కు బెలగావికి చేరుతుంది. యశ్వంతపుర, తుమకూరు, దావణగిరి, హావేరి, హుబ్లీ–ధారవాడ స్టేషన్లలో ఆగుతుంది.
Live : ಬೆಂಗಳೂರಿನ ಕೆಎಸ್ಆರ್ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ನಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ಶ್ರೀ @narendramodi ಅವರಿಂದ ವಂದೇ ಭಾರತ್ ರೈಲುಗಳಿಗೆ ಹಸಿರು ನಿಶಾನೆ#KarnatakaWelcomesModi#PMModiInKarnataka#VandeBharathttps://t.co/1MNGhI88Vn
— BJP Karnataka (@BJP4Karnataka) August 10, 2025
బెంగళూరు మెట్రో యెల్లో లైన్ ప్రారంభం
ప్రధాని మోడీ RV రోడ్ (రాగిగుడ్డ) నుంచి బొమ్మసంద్ర వరకు 19.15 కిలోమీటర్ల పొడవైన యెల్లో లైన్ మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ మార్గంలో 16 స్టేషన్లు ఉన్నాయి. హోసూర్ రోడ్, సిల్క్ బోర్డు, ఎలక్ట్రానిక్స్ సిటీ వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ లైన్ ప్రారంభంతో బెంగళూరు మెట్రో నెట్‌వర్క్ మొత్తం పొడవు 96 కిలోమీటర్లకు చేరింది.
Prime Minister Shri @narendramodi flags off the Yellow Metro Line from R.V. Road to Bommasandra!#PMModiInKarnataka#KarnatakaWelcomesModipic.twitter.com/JlEMaUBywU
— BJP Karnataka (@BJP4Karnataka) August 10, 2025
బెంగళూరు ఫేజ్-3 మెట్రో ప్రాజెక్ట్ శంకుస్థాపన
బెంగళూరులో మెట్రో ఫేజ్-3 ప్రాజెక్ట్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. దీనిని ఆరెంజ్ లైన్‌గా పిలుస్తారు. రూ. 15,611 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ పొడవు 44.65 కిలోమీటర్లు. ఇందులో 31 ఎలివేటెడ్ స్టేషన్లు ఉండనున్నాయి. జేపీ నగర్ 4వ ఫేజ్–కెంపపురా (32.15 కి.మీ), హోసహళ్లి-కదబాగెరె (12.5 కి.మీ) లైన్లు ఈ దశలో ఉంటాయి.
🛤️ Big boost for travel!🚇
➔Yellow line of Bangalore Metro,
➔Bangalore Metro Phase-3 project, and
➔Three new #VandeBharat routes are set to redefine travel with speed, comfort & connectivity!
Watch a short film 🎥@PMOIndia@RailMinIndiapic.twitter.com/0xql9L3UrD— PIB India (@PIB_India) August 10, 2025
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరేనా?
బెంగళూరులో ప్రధాని మోడీ ప్రారంభించిన మూడు వందే భారత్ రైళ్లు, యెల్లో లైన్ మెట్రో, ఫేజ్-3 మెట్రో ప్రాజెక్ట్‌లు నగర ట్రాఫిక్ సమస్యలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. యెల్లో లైన్ ద్వారా హోసూర్ రోడ్, సిల్క్ బోర్డు, ఎలక్ట్రానిక్స్ సిటీ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా రోజూ వాహనాల రద్దీ తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
వందే భారత్ రైళ్లు అంతర్ నగర ప్రయాణాలను వేగవంతం చేసి, రోడ్డు మార్గంలో ప్రయాణించే వారి సంఖ్యను తగ్గించవచ్చు. ఫేజ్-3 ఆరెంజ్ లైన్ పూర్తయితే నగరంలో మెట్రో నెట్‌వర్క్ విస్తరించి, మరింతమంది ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రభావం పూర్తిగా కనపించడానికి చాలా సమయం పడుతుంది.