MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert : ఈ రెండ్రోజులూ భారీ వర్షాలే.. ఈ పది జిల్లాల్లో పవర్ ఫుల్ వానలు, ఇక అతలాకుతలమే

IMD Rain Alert : ఈ రెండ్రోజులూ భారీ వర్షాలే.. ఈ పది జిల్లాల్లో పవర్ ఫుల్ వానలు, ఇక అతలాకుతలమే

Rain Alert : సాధారణంగా వేసవిలో కురిసే వర్షాలు ఉరుములు మెరుపులు, పిడుగులతో ప్రమాదకరంగా ఉంటాయి. వీటిని ఈదురుగాలులు, వడగళ్లు తోడయ్యాయో అల్లకల్లోలం సృష్టించడం ఖాయం. ఈ రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వానలే కురుస్తాయట. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 26 2026, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో ఎండావాన
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల్లో ఎండావాన

Thunderstorm Warning : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రోహిణి కార్తె వచ్చేసింది కాబట్టి రోకళ్లు పగిలే స్థాయిలో ఎండలు కొనసాగుతున్నాయి... ఉదయమే సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం సమయంలో మండుటెండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... ఏకంగా 46-48 డిగ్రీల అత్యదిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మధ్యాహ్నమంతా ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు సాయంత్రం చల్లని వర్షాలు ఉపశమనం కల్పిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వర్షాలు కొనసాగుతున్నాయి... ఎండలతీవ్రత ఇలా తగ్గగానే అలా ఆకాశంలో మేఘాలు కమ్మేస్తున్నాయి... వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఇలా తెలుగు ప్రజలకు ఎండలనుండి ఉపశమనం లభిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : Gemini AI

తెలంగాణలో భారీ వర్షాలు

అయితే రాబోయే 48 గంటల్లో (మే 26, 27 తేదీల్లో) తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ, సౌత్, సెంట్రల్ తెలంగాణ జిల్లాలైన కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఈ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... ఇలా 50 నుండి 60 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 20 నుండి 30 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.

ఇవాళ, రేపు (మంగళ, బుధవారం) హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. నగరంలో కొన్నిచోట్ల 40 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడై ప్రమాదకరంగా మారతాయి... కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ మ్యాన్ సూచించారు.

Related Articles

Related image1
IMD Rain Alert: మ‌రింత బ‌ల‌ప‌డుతోన్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు
Related image2
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే
35
తెలంగాణలో ఎండలు...
Image Credit : ai photo

తెలంగాణలో ఎండలు...

ఓవైపు వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూనే మరోవైపు ఎండలు కూడా మండిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఈ రెండ్రోజులూ మధ్యాహ్నం సమయంలో ఎండలు.. సాయంత్రం సమయంలో వానలు ఉంటాయట. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షతీవ్రత తక్కువగా ఉంటుంది.. ఎండలు మండిపోతాయని హెచ్చరించారు. అత్యధికంగా 43 నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయట... హైదరాబాద్ లో 40 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

45
ఆంధ్ర ప్రదేశ్ లో జోరువానలు
Image Credit : AI

ఆంధ్ర ప్రదేశ్ లో జోరువానలు

తెలంగాణలో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండావాన పరిస్థితి ఉంటుందట. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

కొన్నిచోట్ల గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయి.. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని APSDMA హెచ్చరించింది. కాబట్టి ప్రజలు వర్షం కురిసే సమయంలో చెట్లు, పోల్స్,హోర్డింగ్స్ క్రింద నిలబడరాదని… సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.

55
ఏపీలో మండుటెండలు..
Image Credit : chatgpt

ఏపీలో మండుటెండలు..

ఓవైపు వర్షాలు కురుస్తున్నా మరోవైపు ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ శనివారం (మే 30 వరకు) వరకు ఏపీలో ఈ ఉధృతి కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఏ జిల్లాలో ఎంత ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయంటే..

45°C - 46°C : ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం.

42°C - 44°C : విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, నెల్లూరు.

40°C - 42°C : శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాయలసీమ జిల్లాలు.

26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bakrid 2026 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడు.. బుధవారమా, గురువారమా?
Recommended image2
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే
Recommended image3
TGSRTC: ఇక‌పై బ‌స్సుల్లో పోకీరిల ఆట‌లు సాగ‌వు.. భ‌రోసా ప్రాజెక్ట్ ప్రారంభించిన తెలంగాణ ప్ర‌భుత్వం
Related Stories
Recommended image1
IMD Rain Alert: మ‌రింత బ‌ల‌ప‌డుతోన్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు
Recommended image2
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved