MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert: మ‌రింత బ‌ల‌ప‌డుతోన్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు

IMD Rain Alert: మ‌రింత బ‌ల‌ప‌డుతోన్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు

IMD Rain Alert: ఏపీలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 12 2026, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉత్తర తమిళనాడు నుంచి రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాల సూచన
Image Credit : Gemini AI

ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాల సూచన

బుధవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులు కూడా ఉండొచ్చని హెచ్చరించింది.

పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మేఘాలు కమ్ముకుని ఉరుములు వినిపించిన వెంటనే చెట్ల కింద‌ నిలబడకుండా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

Related Articles

Related image1
Ceiling Fan: క‌రెంట్ లేక‌పోయినా న‌డిచే సీలింగ్ ఫ్యాన్.. ఇంతకీ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందంటే.?
Related image2
Hyderabad: రూ. 530 కోట్ల‌తో మెగా ప్రాజెక్ట్‌.. హైద‌రాబాదీలకు ట్రాఫిక్ క‌ష్టాల నుంచి విముక్తి
34
ఏజెన్సీ ప్రాంతాల్లో వడగాలుల హెచ్చరిక
Image Credit : Asianet News

ఏజెన్సీ ప్రాంతాల్లో వడగాలుల హెచ్చరిక

మరోవైపు అల్లూరి జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలు మధ్యాహ్న వేళ బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు తగినంత నీరు తాగుతూ ఎండ నుంచి రక్షణ పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

44
పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
Image Credit : Gemini AI

పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

మంగళవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు భారీగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 42.4 డిగ్రీలు, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42 డిగ్రీలు నమోదయ్యాయి.

అలాగే ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 41.9 డిగ్రీలు, మార్కాపురం జిల్లా కంభంలో 41.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 41.3 డిగ్రీలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా తెరన్నపల్లి, వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో 41.1 డిగ్రీలు నమోదయ్యాయి.

అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 41 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో 40.6 డిగ్రీలు, చిత్తూరు జిల్లా రాయలపేటలో 40.5 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరులో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Related Stories
Recommended image1
Ceiling Fan: క‌రెంట్ లేక‌పోయినా న‌డిచే సీలింగ్ ఫ్యాన్.. ఇంతకీ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందంటే.?
Recommended image2
Hyderabad: రూ. 530 కోట్ల‌తో మెగా ప్రాజెక్ట్‌.. హైద‌రాబాదీలకు ట్రాఫిక్ క‌ష్టాల నుంచి విముక్తి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved