MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • Mangli : సింగర్ మంగ్లీ అరెస్ట్ ఖాయమేనా..?

Mangli : సింగర్ మంగ్లీ అరెస్ట్ ఖాయమేనా..?

ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ మంగ్లీ అరెస్ట్ అవుతారా..?  అంటే అవుననే ప్రచారం సాగుతోంది. ప్రజలనుండి డబ్బులు వసూలుచేసిన స్కాం వ్యవహారంలో దూకుడు పెంచిన CID విచారణ వేగవంతం చేసింది.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 16 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మంగ్లీని అరెస్ట్ చేస్తారా..?
Image Credit : Instagram/iammangli

మంగ్లీని అరెస్ట్ చేస్తారా..?

Mangli Arrest : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సింగర్ సత్యవతి అలియాస్ మంగ్లీ వ్యవహారం సంచలనంగా మారింది. తెలంగాణ జానపద పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సినిమా పాటలు పాడే స్థాయికి చేరుకుంది మంగ్లీ. ఇలా సెలబ్రిటీగా మారిన ఆమె తన పేరును అడ్డం పెట్టుకుని భారీ స్కాంకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి... ఆమెపై హైదరాబాద్ లో కేసు కూడా నమోదయ్యింది. ఈ క్రమంలోనే ఏ క్షణంలో అయినా మంగ్లీ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మంగ్లీ కేసులో సిఐడి దూకుడు..
Image Credit : X/Telangana Police

మంగ్లీ కేసులో సిఐడి దూకుడు..

మంగ్లీపై వచ్చిన ఆర్థిక మోసాల ఆరోపణలు వంద కోట్లకు సంబంధించినవి కావడంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసు విచారణను CID కి అప్పగించింది. దీంతో ఆరోపణలు వస్తున్నట్లు స్వయంగా ఈ స్కాంలో మంగ్లీ పాల్గొన్నారా..? తెరవెనక ఉండి నడిపించారా..? అనేది తేల్చే పనిలో పడింది సిఐడి. అంతేకాదు ప్రధాన నిందితుడు మధు పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు.

ఈ కేసులో సిఐడి దూకుడుగా ముందుకు వెళుతోంది. ప్రజలను మోసం చేసినట్లు ఏ చిన్న క్లూ దొరికినా మంగ్లీని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆమెను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు సేకరిస్తేనే ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వస్తుందని CID భావిస్తోంది... అందుకే ఆమె అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది.

Related Articles

Related image1
Mangli Controversies : మంగ్లీని చుట్టు ముట్టిన వివాదాలు, స్టార్ సింగర్ ను టెన్షన్ పెట్టిన కాంట్రవర్సీలు ఇవే..
Related image2
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
35
అసలు ఏమిటీ స్కాం..?
Image Credit : X

అసలు ఏమిటీ స్కాం..?

సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాబాల్లో వాటా ఇస్తామని చెప్పి హైదరాబాద్ కు చెందిన కొందరు మోసాలకు తెరతీశారు. ఇలా హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ తో మంగ్లీకి సంబంధాలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. ఈ స్కాంలో కీలకమైన రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ పరారీలో ఉన్నారు.

మధు గ్యాంగ్ ప్రజల నుండి రూ.10 కోట్ల నుండి రూ.150 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్కాంలో మంగ్లీ ప్రమేయం ఉందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల తరపున హైదరాబాద్ లాయర్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది.

45
లాయర్ సుబ్బారావు ఆరోపణలేంటి..?
Image Credit : instagram

లాయర్ సుబ్బారావు ఆరోపణలేంటి..?

సింగర్ మంగ్లీతో పాటు ఆమె తమ్ముడు శివ పేరుచెప్పి కొందరు వ్యక్తులు బాధితులను పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించినట్లు సుబ్బారావు ఆరోపిస్తున్నారు. ఇలా అధిక లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశారంటున్నారు. ఇప్పుడు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బాధితులను బెదిరిస్తున్నారని సుబ్బారావు పోలీసులకు తెలిపారు. అయితే ఈ స్కామ్ ఏ 10, 20 కోట్లది కాదు... ఏకంగా రూ.150 కోట్లదని ప్రచారం జరుగుతోంది.

55
మంగ్లీ రియాక్షన్..
Image Credit : instagram

మంగ్లీ రియాక్షన్..

తనపై వచ్చిన ఆర్థిక నేరాల ఆరోపణలపై మంగ్లీ కూడా స్పందించారు. పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఆమె కౌంటర్ ఫిర్యాదు దాాఖలుచేశారు. ఈ సమయంలో ఆమె మాట్లాడుతూ.. తాను కేవలం పాటలు పాడుకుంటూ కష్టపడి ఈ స్థాయికి వచ్చానని... ఎవరినీ మోసం చేయలేదని చెప్పుకొచ్చారు. కొందరు కావాలనే తనపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై పోలీసులకు ఫిర్యాదుచేసిన న్యాయవాది సుబ్బారావు రూ.10 లక్షలు డిమాండ్ చేశారని.. డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో డబ్బు కట్టలతో తన తమ్ముడు ఉన్నట్లుగా ఓ ఫోటో వైరల్ అవుతోంది.. కానీ అందులో ఉన్నది తన తమ్ముడు కాదన్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి, తప్పుగా చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ స్కాంలో తాను నిందితురాలిని కాదు బాధితురాలినే అంటోంది మంగ్లీ. తన పేరును వాడుకుని ఎవరో మోసాలు చేస్తే తనకేం సంబంధమని అంటున్నారు. నిజానికి తన పేరు చెడగొడుతున్నందుకు తానే బాధితురాలిని అని ఆమె వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. తనకు ఏ స్కాంతో సంబంధాలు లేవన్నారు మంగ్లీ. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
వినోదం
హైదరాబాద్
మోసం
ప్రసిద్ధ వ్యక్తులు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert: అల్ప‌పీడ‌న ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ఖాయం
Recommended image2
Kavitha: ఈసారి కేటీఆర్‌కు క‌విత రాఖీ క‌డ‌తారా లేదా.? అన్న‌పై చెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
50 అంత‌స్తుల్లో అద్భుత నిర్మాణం.. ఒక్కో ఫ్లాట్ ధ‌ర ఏకంగా రూ. 2 కోట్లు, ఎక్క‌డంటే.?
Related Stories
Recommended image1
Mangli Controversies : మంగ్లీని చుట్టు ముట్టిన వివాదాలు, స్టార్ సింగర్ ను టెన్షన్ పెట్టిన కాంట్రవర్సీలు ఇవే..
Recommended image2
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved