MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి

Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి

సింగర్‌ మంగ్లీ ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కుంది. ఆమె మోసం చేసిందని లాయర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందనేది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 13 2026, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మంగ్లీపై కేసు
Image Credit : instagram/@iammangli

మంగ్లీపై కేసు

సింగర్‌ మంగ్లీ ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. ఆమె మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు వంద మంది నుంచి డబ్బులు వసూలు చేసిందని, రియల్‌ ఎస్టేట్‌ వంటి ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్‌ మెంట్‌ చేశారని, కానీ ఆ తర్వాత లాభాలు కాదు కదా అసలు పెట్టుబడి ఇవ్వకుండా మోసం చేశారని చెప్పి లాయర్‌ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి వీరు రూ.150-200కోట్ల వరకు వసూలు చేశారని ఆరోపిస్తూ సుబ్బారావు.. మంగ్లీతోపాటు ఆమె సోదరుడు శివ, అలాగే మధుతోపాటు మరికొంత మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మైక్రో ఫైనాన్స్ కేసుపై మంగ్లీ వివరణ
Image Credit : Asianet News

మైక్రో ఫైనాన్స్ కేసుపై మంగ్లీ వివరణ

దీనిపై సింగర్‌ మంగ్లీ స్పందించింది. మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తనకు డబ్బు ఆశ లేదని, పాటలే తన ప్రపంచమని చెప్పింది. ఈ కేసులో తన సోదురుడికి కూడా ఎలాంటి ఇన్వాల్వ్ మెంట్ లేదని, న్యాయవాది సుబ్బు ప్రచారం కోసం, పాపులర్ అయ్యేందుకు తనపై కేసు పెట్టారని మంగ్లీ చెప్పింది. `ప్రోగ్రామ్స్ కోసం నా సోదరుడి ద్వారా చాలా మంది నన్ను సంప్రదిస్తుంటారు. లాయర్ సుబ్బు పబ్లిసిటీ కోసం, ఆ పబ్లిసిటీ ద్వారా బిగ్ బాస్ కు వెళ్లాలనే నాపై కేసు పెట్టాడు. నేను కూడా న్యాయపరంగా అతన్ని ఎదుర్కొంటా. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో తమకు ప్రచారం చేయాలంటూ వివిధ పార్టీల వారు నాకు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. నేను ఒప్పుకోలేదు. నా సోషల్ మీడియా పోస్టులు కూడా చెక్ చేసుకోండి. ఈ మైక్రో ఫైనాన్స్ మోసంలో బాధితుల తరుపున కూడా నేను సపోర్ట్ గా నిలబడతాను` అని ఆమె తెలిపింది.

35
మంగ్లీ పారితోషికం
Image Credit : instagram/@iammangli

మంగ్లీ పారితోషికం

ఫోక్‌ సాంగ్స్ తో, మంచి ఊపు తెచ్చే పాటలతో పాపులర్‌ అయిన మంగ్లీ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందనేది చూస్తే, తెలంగాణ జానపద గీతాలతో కెరీర్‌ని స్టార్ట్ చేసింది మంగ్లీ. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల పాటలు స్టార్ట్ చేసింది. అనతి కాలంలోనే స్టార్‌ సింగర్‌గా ఎదిగింది. ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ సింగర్‌గా రాణిస్తోంది. ఆమె గొంతులో ఉన్న ప్రత్యేకమైన బేస్, ఎనర్జీ పాటలకు కొత్త జవజీవాలను అందిస్తుంది. ప్రస్తుతం ఆమె ఒక్కో పాటకి తీసుకుంటున్న పారితోషికం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  పది, ఇరవై వేల నుంచి కెరీర్‌ని స్టార్ట్ చేసిన మంగ్లీ ఇప్పుడు లక్షల్లో పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. ఆమె ఒక్కో సినిమా పాటకి రూ. 2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు పారితోషికం అందుకుంటుంది. గతంలో సింగర్లకు తక్కువ మొత్తమే ఇచ్చేవారు, కానీ మంగ్లీకి ఉన్న మాస్ ఫాలోయింగ్, ఆమె పాడితే పాట హిట్ అవుతుందనే నమ్మకంతో నిర్మాతలు ఇంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. పెద్ద సినిమాలైతే ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది.

45
ఈవెంట్లు, లైవ్ షోల ద్వారా భారీ ఆదాయం
Image Credit : instagram/@iammangli

ఈవెంట్లు, లైవ్ షోల ద్వారా భారీ ఆదాయం

సినిమా పాటల కంటే మంగ్లీ స్టేజ్ షోలు, లైవ్ పెర్ఫార్మెన్స్‌ల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో, లోకల్ ఈవెంట్లలో ఒక్క ప్రోగ్రామ్ కోసం ఆమె సుమారు రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తారని టాక్. ఆమె పాడే విధానం, స్టేజ్ మీద ఆమె ఇచ్చే ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేయడమే దీనికి ప్రధాన కారణం. మంగ్లీ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటుంది. ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు, గణేషుడి పండగకి, సంక్రాంతి పండుగల వేళ ఆమె విడుదల చేసే పాటలు కోట్లలో వ్యూస్ సాధిస్తాయి. వీటి ద్వారా వచ్చే యూట్యూబ్ ఆదాయం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుంచి భారీగానే సంపాదిస్తోంది మంగ్లీ. ఇలా నాలుగైదు దారుల్లో సంపాదిస్తోంది మంగ్లీ. ఇప్పుడు ఆమె ఆదాయం స్టార్‌ సింగర్స్ ని మించి ఉండటం విశేషం.

55
మంగ్లీని పాపులర్‌ చేసిన పాటలు
Image Credit : Asianet News

మంగ్లీని పాపులర్‌ చేసిన పాటలు

మంగ్లీ కెరీర్‌ను మలుపు తిప్పిన పాటలు ఆమె రేంజ్‌ను పెంచేశాయి. 'సారంగ దరియా' (లవ్ స్టోరీ), 'రా రా రెడ్డి' (మాచర్ల నియోజకవర్గం), 'జిలేలమ్మ జిట్టా' (ధమాకా) వంటి పాటలు ఆమెను పాన్-ఇండియా లెవల్‌కు తీసుకెళ్లాయి. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ చిత్రం 'కాంతార'లో ఆమె పాడిన పాటలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో, ఇతర భాషా చిత్రాల నుండి కూడా ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Dacoit 3 days Collections: ఇండస్ట్రీకి షాకిస్తోన్న అడవిశేష్‌, డెకాయిట్‌ 3 రోజుల కలెక్షన్లు.. అసలు పరీక్ష ఏంటంటే?
Recommended image2
Tamanna Regret: ప్రభాస్‌ని రిజెక్ట్ చేసి తప్పు చేసిన తమన్నా.. ఎప్పుడూ బాధపడేది ఈ విషయంలోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved