Toddy drink: సీసా కల్లు తాగుతున్నారా.? అందులో ఏం కలుపుతున్నారో తెలిస్తే జీవితంలో దాని జోలికి వెళ్లరు.
చెట్టు కల్లు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే కృత్రిమ కల్లు మాత్రం ప్రాణాలకే ప్రమాదమని మీకు తెలుసా.? చెట్టు కల్లు లభ్యత తగ్గిపోవడం, తక్కువ ధరకే సీసాలో కళ్లు లభిస్తుండంతో చాలా మంది వాటికి అలవాటుగా మారుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కల్లు లేకుండా రోజు గడవని వారు చాలా మంది. అయితే ఈ కల్లులో కలిపే పదార్థాల గురించి తెలిస్తే జీవితంలో ఇకపై దాని జోలికి వెళ్లరు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Toddy
కల్లు తాగి అపస్మాకర స్థితిలోకి
ఈ నెల 7వ తేదీన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కికి చెందిన కల్లు డీపోలో కల్లు తాగిన 69 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిలో 17 మంది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం వీరంతా నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో కల్లు తాగి ఇలాంటి సంఘటనలు ఎదురైనా ఈసారి మాత్రం బాధితుల్లో విచిత్రమైన లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్యులు అసలేం జరిగిందన కోణంలో పరీక్షలు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

toddy
అధిక లాభాల కోసం ఎంతకైనా తెగిస్తోన్న అక్రమార్కులు
కృత్రిమ కల్లు తయారీలో చెట్టు నుంచి వచ్చే కల్లు అసలు వాడడమే లేదు. పూర్తిగా నీరు, రసాయనాలతో తయారు చేస్తున్నారు. మొదట్లో ఈ కల్లు తయారీలో క్లోరోహైడ్రేట్ రసాయనాన్ని ఉపయోగించే వారు. కానీ దీనిపై ప్రభుత్వం నిషేధం విధించడంతో డైజోఫాం ఉపయోగించారు. ప్రస్తుతం కృత్రిమ కల్లు తయారీకి ఆల్ఫ్రాజోలం రసాయనం వాడుతున్నారు. అయితే ఈ ఖర్చును కూడా తగ్గించుకునేందుకు అక్రమార్కులు యాంటీ సైకోటిక్ డ్రగ్ వాడుతున్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఇది తక్కువ ధరకు లభించడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

toddy shop
ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే.?
యాంటీ సైకోటిక్ డ్రగ్‌తో తయారు చేసిన కల్లు తీసుకున్న వారు గంటల వ్యవధిలోనే నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. నాలుక దొడ్డుగా మారడం, రోబోలాగా మారిపోవడం, సిరలు పడిపోవడం, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తాజాగా కామారెడ్డిలో వెలుగులోకి వచ్చిన సంఘటనలో ‘యాంటీ సైకోటిక్ గ్రూపు’నకు చెందిన డ్రగ్స్‌ను కల్లులో వాడినట్టు అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్‌ను ‘మేజర్ మెంటల్ డిజార్డర్’ ఉన్నవారికి ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు.

రుచి కోసం ఇంత దారుణమైనవి కలుపుతారా.?
కృత్రిమ కల్లు తయారీలో ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరోహైడ్రేట్, సిట్రిక్ యాసిడ్ లాంటి రసాయనాలను కలుపుతారు. అలాగే పులుపు కోసం నిమ్మ ఉప్పు, తెలుపు కోసం సిల్వర్ వైట్, కప్ పౌడర్, తీపి కోసం శాక్రీన్, నురగ కోసం కుంకుడు రసం, యూరియా, సోడా యాష్, అమ్మోనియా మిశ్రమం, డ్రై ఈస్ట్ రసాయనాలను ఉపయోగిస్తున్నారు.