దసరా సెలవులు.. ఏపీలో ఎన్ని రోజులు, తెలంగాణలో ఎన్ని రోజులో తెలుసా?
Dasara Holidays: తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో దసరా పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. 2025 దసరా సెలవులను రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సెలవులు
దసరా పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణలో ఈ పండుగకు బతుకమ్మ జతకావడంతో ఉత్సాహం మరింత పెరుగుతుంది. బతుకమ్మ ముగింపు తర్వాత దసరా వేడుకలు జరుగుతాయి. ప్రజలు ఇళ్లను అలంకరించి, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రమంతటా బతుకమ్మ జాతరలు, దసరా శోభాయాత్రలు విశేషంగా ఆకర్షిస్తాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో దసరా సందర్భంగా శరన్నవరాత్రులలో భాగంగా తొమ్మిది రోజులపాటు ప్రత్యేక అలంకారాలు, పూజలు నిర్వహిస్తారు. లక్షలాది భక్తులు గుడికి చేరి అమ్మవారిని దర్శించుకుంటారు. రెండు రాష్ట్రాల్లోనూ దసరాకు కుటుంబసభ్యులు, బంధువులు కలిసే పండుగ కావడంతో ఎక్కువగానే సెలవులు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో దసరా సెలవుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
KNOW
తెలంగాణలో 13 రోజులు దసరా సెలవులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈసారి విద్యార్థులకు దసరా సెలవులు చాలానే లభించనున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉన్నాయి.
అంటే మొత్తం 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేయనున్నారు. బతుకమ్మ పండుగ, దసరా పండుగల నేపథ్యంలో విద్యార్థులకు ఈ సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 4న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 9 రోజులు దసరా సెలవులు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉంటాయి. మొత్తం 9 రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడనున్నాయి.
అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే రాష్ట్రంలోని క్రైస్తవ మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే 6 రోజుల సెలవులు ఇచ్చారు.
దసరా సెలవుల తర్వాత తిరిగి పాఠశాలలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి?
తెలంగాణలో అక్టోబర్ 4న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అక్టోబర్ 3న తరగతులు తిరిగి మొదలవుతాయి. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని షెడ్యూల్ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఇవే అధికారిక తేదీలుగా కొనసాగుతున్నాయి.
దసరా పండుగలో ప్రత్యేక రోజులు, ముఖ్యమైన తేదీలు
ఈసారి దసరా పండుగ సందర్భంలో కొన్ని ప్రత్యేక రోజులు కూడా ఉన్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా ఒకేసారి వస్తాయి. అదనంగా అక్టోబర్ 3న కూడా సెలవు ఉండటం వల్ల విద్యార్థులకు వరుస రోజులు విరామం లభిస్తుంది.
దాదాపు రెండు వారాలు దసరా 2025 సెలవులు
2025లో దసరా సెలవులు తెలంగాణలో దాదాపు రెండు వారాలు ఉన్నాయి. ఏపీలో 9 రోజులు. సెలవులు ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. పాఠశాలల విరామం కారణంగా కుటుంబాలు పర్యటనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ వేడుకలను ముందుగానే ప్రణాళిక చేసుకోవచ్చు.
దసరా సెలవులలో తెలుగు రాష్ట్రాల్లో మీకు మంచి పర్యాటక ప్రాంతాలు గమనిస్తే.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నవరాత్రుల సమయంలో దుర్గమ్మ ప్రతిరోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. చివరి రోజున ప్రభలు ఊరేగింపు అద్బుతంగా ఉంటుంది.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో దసరా పండుగను అకాడాలుగా నిర్వహిస్తారు. ఇది పల్లెతనం ఉట్టిపడేలా సాగే పండుగ. ఆయుధ విన్యాసాలు, కర్రసాము వంటి ప్రదర్శనలు ఉంటాయి. నరకాసుర వధ ఘట్టం ప్రదర్శనతో పండుగ ప్రారంభమవుతుంది.