MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు

Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు

Bathukamma Dasara Special Trains: బతుకమ్మ, దసరా పండుగల సందడి మొదలైంది. బతుకమ్మ, దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 9 నుంచి 25 వరకు సికింద్రాబాద్, కాగజ్‌నగర్, హైదరాబాద్ మధ్య 34 ప్రత్యేక రైలు సర్వీసులను ఎస్‌సీఆర్ అందుబాటులోకి తెచ్చింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 09 2026, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పండుగకి ఊరెళ్తున్నారా? ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 34 స్పెషల్ ట్రైన్స్ వచ్చేశాయి
Image Credit : chatgpt

పండుగకి ఊరెళ్తున్నారా? ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 34 స్పెషల్ ట్రైన్స్ వచ్చేశాయి

దసరా, బతుకమ్మ వచ్చాయంటే చాలు సొంతూర్ల బాట పట్టే ప్రయాణికులతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడిపోతుంటాయి. ఈ పండుగ రద్దీని తట్టుకోవడం ప్రయాణికులకు ప్రతీ ఏటా పెద్ద సవాలుగా మారుతుంది. అయితే ఈ పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి ఉత్తర తెలంగాణ వైపు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం 34 ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక సేవలు అక్టోబర్ 25 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సికింద్రాబాద్ టూ కాగజ్‌నగర్: రైలు నంబర్ 07711 టైమింగ్స్
Image Credit : Asianet News

సికింద్రాబాద్ టూ కాగజ్‌నగర్: రైలు నంబర్ 07711 టైమింగ్స్

సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వైపు ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా రైలు నంబర్ 07711ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

• ఈ రైలు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.

• మార్గమధ్యంలో వివిధ స్టేషన్లను కవర్ చేస్తూ అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది.

• అక్టోబర్ 9 నుంచి 25 వరకు ఈ మార్గంలో ప్రతిరోజూ ఒక సర్వీసు చొప్పున మొత్తం 17 సర్వీసులు నడవనున్నాయి.

• మధ్యాహ్నం వేళల్లో ప్రయాణించాలనుకునే వారికి ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

35
సిర్పూర్ కాగజ్‌నగర్ టూ హైదరాబాద్: రైలు నంబర్ 07712 షెడ్యూల్
Image Credit : Asianet News

సిర్పూర్ కాగజ్‌నగర్ టూ హైదరాబాద్: రైలు నంబర్ 07712 షెడ్యూల్

తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికుల కోసం రైలు నంబర్ 07712 సర్వీస్‌ను ఎస్‌సీఆర్ తీసుకొచ్చింది.

• ఈ ప్రత్యేక రైలు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరుతుంది.

• రాత్రి ప్రయాణాన్ని పూర్తి చేసుకుని అదే రోజు రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది.

• ఈ తిరుగు ప్రయాణ సర్వీస్ కూడా అక్టోబర్ 9 నుంచి 25 వరకు ప్రతిరోజూ అందుబాటులో ఉంటూ మొత్తం 17 సర్వీసులుగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చనుంది.

45
ఉత్తర తెలంగాణను కలుపుతూ కీలక స్టేషన్లలో హాల్టింగ్
Image Credit : Getty

ఉత్తర తెలంగాణను కలుపుతూ కీలక స్టేషన్లలో హాల్టింగ్

హైదరాబాద్ నగరాన్ని ఉత్తర తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాలతో అనుసంధానించడంలో ఈ ప్రత్యేక రైళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం రెండు వైపులా ఈ క్రింది కీలకమైన స్టేషన్లలో ఆగనున్నాయి..

• చర్లపల్లి

• భువనగిరి

• జనగాం

• కాజీపేట

• జమ్మికుంట

• పెద్దపల్లి

• రామగుండం

• మంచిర్యాల

• బెల్లంపల్లి

• ఆసిఫాబాద్ రోడ్

ఈ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించడం వల్ల చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల ప్రజలకు పండుగ ప్రయాణం చాలా ఈజీ కానుంది.

55
సీటింగ్, కోచ్ వివరాలు: ముందస్తు రిజర్వేషన్ బెటర్
Image Credit : pinterest

సీటింగ్, కోచ్ వివరాలు: ముందస్తు రిజర్వేషన్ బెటర్

పండుగ రద్దీ సమయంలో ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ చైర్ కార్ (AC Chair Car), సెకండ్ సిట్టింగ్ (Second Sitting) తరగతి కోచ్‌లను ఏర్పాటు చేశారు. పండుగ రోజుల్లో చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రయాణికులు ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచిస్తున్నారు. పండుగ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే వారికి ఈ 34 స్పెషల్ సర్వీసులు ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారనున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
పండుగలు
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Cyclone: తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు.. 5 ఐదు రోజులు భారీ వర్షాలు
Recommended image2
Cyclone Murasu : ఏపీనే కాదు తెలంగాణను వదలని మురసు తుపాను.. ఇక కుండపోత వర్షాలే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image3
వారికి వెంట‌నే చేయూత పింఛ‌న్‌.. కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం
Related Stories
Recommended image1
Flipkart Big Billion Days Sale: రచ్చ లేపుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్.. 65 ఇంచుల టీవీపై రూ. 22,000 తగ్గింపు
Recommended image2
Hair Care Tips: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా? అసలు నిజమేంటి.. డాక్టర్లు ఏం చెప్తున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved