MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Flipkart Big Billion Days Sale: రచ్చ లేపుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్.. 65 ఇంచుల టీవీపై రూ. 22,000 తగ్గింపు

Flipkart Big Billion Days Sale: రచ్చ లేపుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్.. 65 ఇంచుల టీవీపై రూ. 22,000 తగ్గింపు

Flipkart Big Billion Days Sale: పండుగల సీజన్ వేళ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ హోమ్ ఎలక్ట్రానిక్స్ ప్రియులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం టీవీలై బంపర్ ఆఫర్లు ఉన్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 05 2026, 11:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
65 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీల పై ఫ్లిప్‌కార్ట్ ధమాకా డీల్స్
Image Credit : Flipkart

65 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీల పై ఫ్లిప్‌కార్ట్ ధమాకా డీల్స్

మీరు మీ ఇంటి కోసం ఒక కొత్త పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక సూపర్‌ గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే తీసుకురాబోతున్న బిగ్ బిలియన్ డేస్ (BBD) సేల్ భారీగా డబ్బులు ఆదా చేసే అవకాశం ఇస్తోంది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ ఉత్పత్తులపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు లభించనున్నాయి. ఇందులో భాగంగా ఒక అద్భుతమైన టీవీ డీల్ వివరాలు బయటకు వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అక్టోబర్ 9 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం
Image Credit : Gemini AI

అక్టోబర్ 9 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం

ఫ్లిప్‌కార్ట్ సంస్థ అక్టోబర్ 9వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అధికారికంగా ప్రారంభించబోతోంది. అయితే ఈ సేల్ ప్రారంభం కావడానికి ముందే చాలా రకాల ప్రొడక్ట్స్ డీల్స్, వాటి ఆఫర్ ధరలను కంపెనీ కస్టమర్ల కోసం రివీల్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా టీసీఎల్ (TCL) కంపెనీకి చెందిన 65 ఇంచుల భారీ స్మార్ట్ టీవీ ధరను కూడా వెల్లడించింది. సేల్ ప్రారంభానికి ముందు వరకు మార్కెట్‌లో ఈ టీవీ ధర ₹61,990 గా ఉంటే, సేల్‌లో భాగంగా ఈ భారీ టీవీని కేవలం ₹39,999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు ₹22,000 మేర భారీ తగ్గింపు లభిస్తోంది.

36
కళ్ళు చెదిరే డిస్‌ప్లే, అద్భుతమైన విజువల్స్
Image Credit : Flipkart

కళ్ళు చెదిరే డిస్‌ప్లే, అద్భుతమైన విజువల్స్

ఈ టీవీకి సంబంధించిన ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 65 ఇంచుల పెద్ద సైజ్ డిస్‌ప్లే స్క్రీన్ ఉంటుంది. ఇది సాధారణ ప్యానెల్ కాదు, క్వాలిటీ విజువల్స్ ఇచ్చే QLED ప్యానెల్‌తో పనిచేస్తుంది. QLED టెక్నాలజీ వల్ల పిక్చర్ క్వాలిటీ చాలా స్పష్టంగా, కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా, స్క్రీన్ స్క్రోలింగ్ లేదా కంటెంట్ చూసేటప్పుడు ఎక్కడా ఆటంకం లేకుండా చాలా స్మూత్ ఫీల్ ఇవ్వడానికి ఇందులో 60-120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. దీనివల్ల ప్రతి సీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.

46
థియేటర్ లాంటి పవర్ ఫుల్ సౌండ్ క్వాలిటీ
Image Credit : Gemini AI

థియేటర్ లాంటి పవర్ ఫుల్ సౌండ్ క్వాలిటీ

మంచి పిక్చర్ క్వాలిటీ ఉన్న టీవీకి మంచి ఆడియో కూడా తోడైతేనే ఆ మజా వేరుగా ఉంటుంది. ఈ టీసీఎల్ 65 ఇంచుల క్యూఎల్ఈడీ టీవీలో సరిగ్గా అదే అందించారు. ఈ స్మార్ట్ టీవీలో 2 స్పీకర్లను అమర్చారు. ఇవి మొత్తం 28W సౌండ్ అవుట్‌పుట్‌ను జనరేట్ చేస్తాయి. అంటే మీకు నాణ్యమైన విజువల్స్ లభించడమే కాకుండా, ఇంట్లోనే థియేటర్ అనుభూతిని ఇచ్చే విధంగా పవర్‌ఫుల్ సౌండ్ కూడా అందుతుంది. మూవీస్, స్పోర్ట్స్ చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

56
ల్యాగ్ లేని గూగుల్ టీవీ ప్రాసెసింగ్, స్టోరేజ్
Image Credit : Flipkart

ల్యాగ్ లేని గూగుల్ టీవీ ప్రాసెసింగ్, స్టోరేజ్

సాధారణంగా స్మార్ట్ టీవీలు వాడేటప్పుడు చాలామంది ఎదుర్కొనే పెద్ద సమస్య హ్యాంగ్ కావడం లేదా ల్యాగ్ అవ్వడం. ఈ సమస్య లేకుండా చేసేందుకు టీసీఎల్ ఈ టీవీలో గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించింది. అప్లికేషన్‌లు వేగంగా పనిచేయడానికి, ఓపెన్ అవ్వడానికి 2జీబీ ర్యామ్ సపోర్ట్ ఉంది. దాంతో పాటు మీకు కావలసిన యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దీనివల్ల టీవీలో కంటెంట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ల్యాగ్ లేదా డిలే ఉండదు.

66
కనెక్టివిటీకి సరిపడా పోర్టులు
Image Credit : Flipkart

కనెక్టివిటీకి సరిపడా పోర్టులు

ఇతర డివైజ్‌లను ఈ టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి కంపెనీ పూర్తి సదుపాయాలు కల్పించింది. పోర్టుల విషయానికి వస్తే, ఇందులో 3 హెచ్డీఎంఐ పోర్టులు, 1 యూఎస్బీ పోర్ట్ లభిస్తాయి. వీటి సహాయంతో ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్, సెట్‌టాప్ బాక్స్, లేదా పెన్‌డ్రైవ్‌లను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ షేరింగ్ చేసుకోవడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఫెస్టివ్ సీజన్‌లో తక్కువ ధరలో పెద్ద టీవీ కొని ఇల్లు మార్చాలని చూస్తున్న వారికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ వాచ్ మీ పిల్ల‌ల‌పై ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతుంది.. జీపీఎస్ ట్రాకింగ్‌తోపాటు ఎన్నో ఫీచ‌ర్లు
Recommended image2
Door Bell: వైర్ అవ‌స‌రం లేదు, క‌రెంట్‌తో ప‌నే లేదు.. రూ. 500కే వైర్‌లెస్ డోర్‌బెల్
Recommended image3
JioBharat: యూపీఐ పేమెంట్స్‌, లైవ్ టీవీ.. రూ. 299కే జియో ఫోన్‌, ఎలాగంటే
Related Stories
Recommended image1
Andhra's Goa: గోవా దాకా ఎందుకు? మన దగ్గరే 'ఆంధ్రా గోవా'.. ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image2
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved