హైదరాబాద్‌లో ఓ ర్యాపిడో కెప్టెన్ కస్టమర్‌ను బైక్ పై ఎక్కించుకుని ట్రిప్ ప్రారంభించాడు. కానీ, మధ్యలోనే బైక్‌లో పెట్రోల్ అయిపోయింది. కానీ, ఆ కస్టమర్ బైక్ దిగడానికి ససేమిరా అన్నాడు. దీంతో కస్టమర్ బైక్ పై ఉండగానే కెప్టెన్ దాన్ని తోసుకుంటూ తీసుకెళ్లాడు.
Hyderabad Rapido Driver: గిగ్ వర్కర్ల కష్టాలు చాలా తరుచుగా చూస్తూనే ఉంటాం. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌ల కష్టాలతోపాటు ర్యాపిడో కెప్టెన్‌ల బాధలూ వర్ణనాతీతంగా ఉన్నాయి. తాజాగా, ఓ వీడియో ర్యాపిడో డ్రైవర్ కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపింది. హైదరాబాద్‌లో ఓ ర్యాపిడో డ్రైవర్ కస్టమర్‌ను బైక్ పై ఎక్కించుకున్నాడు. ట్రిప్ స్టార్ట్ చేశాడు. కానీ, మార్గం మధ్యలోనే బైక్‌లో పెట్రోల్ అయిపోయింది. దీంతో ఆ డ్రైవర్ విషయాన్ని కస్టమర్‌కు చెప్పాడు.
కానీ, కస్టమర్ డ్రైవర్ పట్ల సహానుభూతితో వ్యవహరించలేదు. తాను ట్రిప్‌కు డబ్బులు చెల్లిస్తున్నానని, అలాంటప్పుడు పెట్రోల్ అయిపోయిన కారణంగా ఎందుకు నడవాలి? అనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది. బైక్‌లో పెట్రోల్ అయిపోయినా సరే.. తాను బైక్ దిగబోనని భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో ఆ ర్యాపిడో కెప్టెన్ చేసేదేమీ లేకపోయింది.
సమీప పెట్రోల్ బంక్ వరకు బైక్‌ను తోసుకువెళ్లాలని అనుకున్నాడు. కస్టమర్ బైక్ దిగకపోవడంతో ఆయన బైక్ పై కూర్చుని ఉండగానే ఆ స్కూటీని లాక్కుంటూ తీసుకెళ్లున్నప్పుడు కొందరు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నది.
