MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.

Bullet Train: హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన మార్గం, స్టేషన్ల వివరాలపై కీలక వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా సుమారు 607 నుండి 626 కిలోమీటర్ల పొడవునా ఈ మార్గం సాగనుంది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 18 2026, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుల్లెట్ రైలుపై కీలక అప్డేట్
Image Credit : Gemini AI

బుల్లెట్ రైలుపై కీలక అప్డేట్

భారతదేశంలోని రెండు ప్రధాన ఐటీ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రతిపాదిత హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) కారిడార్‌కు సంబంధించిన రూట్ మ్యాప్, స్టేషన్ల వివరాలపై ఇటీవల కీలక సమాచారం వెలువడింది. సుమారు 607 నుండి 626 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్లనుంది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించి, కీలక సూచనలు చేశారు.

హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ దక్షిణాదిలోని రెండు అతిపెద్ద మెట్రో నగరాలను కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, దక్షిణ భారతదేశంలో అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైలు మార్గంగా నిలుస్తుంది. ఇది ముంబై-హైదరాబాద్ లైన్‌కు పొడిగింపుగా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు సర్వే తుది దశకు చేరుకోగా, సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (DPR) మార్చి 2027 నాటికి సిద్ధం కానుందని సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రతిపాదిత మార్గం, స్టేషన్లు
Image Credit : X

ప్రతిపాదిత మార్గం, స్టేషన్లు

హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ దాదాపు 607 నుంచి 626 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా. ఈ మార్గం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ కారిడార్‌లో మొత్తం 12 నుండి 15 స్టేషన్లు ఉండే అవకాశం ఉంది.

తెలంగాణలో ప్రతిపాదిత స్టేషన్లలో హైదరాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, భారత్ ఫ్యూచర్ సిటీ ముఖ్యమైనవి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, షంషాబాద్‌ను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. అలాగే, నల్లమల అటవీ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా ఉన్న మన్ననూర్ సమీపంలో, కృష్ణా నది బ్యాక్‌వాటర్స్ అందాలకు ప్రసిద్ధి చెందిన సోమశిల ప్రాంతంలో, వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల సమీపంలో స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ స్టేషన్లు పర్యాటకాభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

Related Articles

Related image1
Phonepe: మీ ఫోన్‌లో ఫోన్‌పే యాప్ ఉందా.. ఎక్కువ రోజులు వాడ‌క‌పోతే ఛార్జీలు త‌ప్ప‌వా.?
Related image2
మాటలతో కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్.. రోడ్డుపై గుంతలు ఉంటే ముందే హెచ్చరిస్తుంది
35
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే..
Image Credit : AI

ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే..

ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, ధోన్, గూటి, అనంతపురం, దుద్దెబండ, హిందూపురం వంటి ప్రాంతాల్లో స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. కర్ణాటకలో అలీపుర (గౌరిబిదనూరు తాలూకా), దేవనహళ్లి (కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ కోసం), కోడిహళ్లి, వైట్‌ఫీల్డ్, బైయప్పనహళ్లి వంటి స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరు నగరంలోకి ప్రవేశించేటప్పుడు రైలు దాదాపు 12 కిలోమీటర్ల మేర భూగర్భ సొరంగంలో ప్రయాణించే అవకాశం ఉంది.

45
ప్రయాణ సమయం, ప్రాజెక్టు పురోగతి
Image Credit : Gemini

ప్రయాణ సమయం, ప్రాజెక్టు పురోగతి

ప్రస్తుతం హైదరాబాద్ నుండి బెంగళూరుకు రైలులో ప్రయాణించడానికి 8.5 నుండి 12 గంటల సమయం పడుతోంది. బస్సులో సుమారు 9-10 గంటలు పడుతుంది. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే, ఈ ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు లేదా 3 గంటల లోపునకు తగ్గిపోతుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కారిడార్‌లో రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా రూపొందించారు.

55
త్వరలోనే డీపీఆర్
Image Credit : x

త్వరలోనే డీపీఆర్

ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే మద్ధతు ప్రకటించాయి. ఇటీవల కర్ణాటక మంత్రివర్గం కూడా ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. భూసేకరణ వంటి కీలక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ప్రాజెక్టు నిర్మాణానికి వేగం పెంచనుంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ త్వరలో సిద్ధం కానుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?
Recommended image2
Now Playing
అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu
Recommended image3
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే
Related Stories
Recommended image1
Phonepe: మీ ఫోన్‌లో ఫోన్‌పే యాప్ ఉందా.. ఎక్కువ రోజులు వాడ‌క‌పోతే ఛార్జీలు త‌ప్ప‌వా.?
Recommended image2
మాటలతో కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్.. రోడ్డుపై గుంతలు ఉంటే ముందే హెచ్చరిస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved