- Home
- Automobile
- Bikes
- మాటలతో కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్.. రోడ్డుపై గుంతలు ఉంటే ముందే హెచ్చరిస్తుంది
మాటలతో కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్.. రోడ్డుపై గుంతలు ఉంటే ముందే హెచ్చరిస్తుంది
Ather: ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ తన ప్రముఖ స్కూటర్ మోడళ్లైన Ather Rizta, Ather 450 Series కోసం కొత్త AtherStack 7 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో వాయిస్ కమాండ్ త పాటు మరెన్నో కొత్త ఫీచర్లు వచ్చాయి.

ఇక స్కూటర్‌తో మాట్లాడొచ్చు
కొత్త వాయిస్ కమాండ్ ఫీచర్ ద్వారా రైడర్ తన మాటలతో స్కూటర్‌కు ఆదేశాలు ఇవ్వవచ్చు. నావిగేషన్ ప్రారంభించడం, ఫోన్ కాల్స్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం వంటి పనుల కోసం స్క్రీన్‌ను పదే పదే తాకాల్సిన అవసరం ఉండదు. సాధారణ సంభాషణ భాషను అర్థం చేసుకునేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దీంతో ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు మీదే దృష్టి నిలుపుకోవచ్చు. ముఖ్యంగా నగరాల్లో రోజూ ప్రయాణించే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
OTA అప్‌డేట్‌తో ఇంట్లో నుంచే కొత్త ఫీచర్లు
ఈ అప్‌డేట్‌ను OTA (Over-The-Air) విధానంలో అందిస్తున్నారు. అంటే స్కూటర్ యజమానులు సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ద్వారా స్కూటర్ సాఫ్ట్‌వేర్ దానంతటదే అప్‌డేట్ అవుతుంది. దీంతో ఇప్పటికే ఈ మోడళ్లను ఉపయోగిస్తున్న కస్టమర్లు కూడా కొత్త ఫీచర్లను సులభంగా పొందవచ్చు.
రోడ్డుపై గుంతలు ఉంటే ముందే హెచ్చరిక
AtherStack 7లో అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ Pothole Alerts. స్కూటర్‌లో అమర్చిన సెన్సర్లు రోడ్డుపై ఉన్న గుంతలను గుర్తించి ముందుగానే రైడర్‌కు సమాచారం ఇస్తాయి. హెచ్చరిక కేవలం డిస్‌ప్లేలో మాత్రమే కాకుండా వాయిస్ అలర్ట్ రూపంలో కూడా వస్తుంది. దీంతో ఆకస్మికంగా గుంతలు ఎదురై ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.
ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులకు సమాచారం
కొత్తగా తీసుకొచ్చిన క్రాష్ అలర్ట్స్ ఫీచర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్కూటర్‌కు తీవ్రమైన ప్రమాదం జరిగితే రైడర్ లైవ్ లొకేషన్‌ను అత్యవసర కాంటాక్ట్ నంబర్లకు పంపే సామర్థ్యం దీనికి ఉంది. అంతేకాదు, చిన్న షాక్‌లకు, తీవ్రమైన ప్రమాదాలకు మధ్య తేడాను కూడా ఈ వ్యవస్థ గుర్తించగలదని కంపెనీ తెలిపింది. అవసరమైతే స్కూటర్ స్క్రీన్‌పై ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలు కూడా చూపిస్తుంది.
దొంగతనాలకు చెక్ పెట్టే స్మార్ట్ ఫీచర్లు
స్కూటర్ భద్రత కోసం పార్క్‌సేఫ్, లాక్ సేఫ్ ఫీచర్లను కూడా యాడ్ చేశారు. స్కూటర్‌ను టోయింగ్ చేసే అవకాశం ఉన్న ప్రదేశంలో పార్క్ చేస్తే పార్క్‌సేఫ్ హెచ్చరిస్తుంది. ఎవరైనా స్కూటర్‌ను అనుమానాస్పదంగా తాకినా లేదా దొంగతనం చేయడానికి ప్రయత్నించినా లాక్‌సేఫ్ వెంటనే యజమాని మొబైల్‌కు అలర్ట్ పంపుతుంది. అథర్ యాప్ ద్వారా స్కూటర్‌ను రిమోట్‌గా లాక్ చేయడం లేదా పనిచేయకుండా నిలిపివేయడం కూడా సాధ్యమవుతుంది. అలాగే జరుగుతున్న ఛార్జింగ్ ప్రక్రియను కూడా దూరం నుంచే ఆపేయవచ్చు. ఈ కొత్త ఫీచర్లతో Ather స్కూటర్లు మరింత స్మార్ట్‌గా, భద్రంగా మారనున్నాయని కంపెనీ చెబుతోంది

