MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • డ్రోన్‌లతో పంటలు.. AIతో దిగుబడి. సౌతిండియాలో తొలిసారి బీఎస్సీ అగ్రిటెక్ కోర్సు.. ఎంసెట్ ర్యాంక్‌తో ప‌నేలేదు

డ్రోన్‌లతో పంటలు.. AIతో దిగుబడి. సౌతిండియాలో తొలిసారి బీఎస్సీ అగ్రిటెక్ కోర్సు.. ఎంసెట్ ర్యాంక్‌తో ప‌నేలేదు

B Sc Agritech: ఒక‌ప్పుడు వ్యవసాయం అంటే నాగలి, ట్రాక్టర్, ఎరువులు, నీటి పారుదల మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు వ్యవసాయ రంగం వేగంగా సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా అగ్రిటెక్ నిపుణుల‌కు డిమాండ్ పెరుగుతోంది.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 15 2026, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వ్యవసాయంలో టెక్నాలజీ విప్లవం.. అదే Agritech
Image Credit : Gemini AI

వ్యవసాయంలో టెక్నాలజీ విప్లవం.. అదే Agritech

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం స్మార్ట్ ఫార్మింగ్ దిశగా అడుగులు వేస్తోంది. రైతులు ఇక సంప్రదాయ పద్ధతులకే పరిమితం కావడం లేదు. పంటల ఆరోగ్యం, నీటి వినియోగం, ఎరువుల మోతాదు, పురుగుమందుల అవసరం వంటి అంశాలను AI, డ్రోన్‌లు, డేటా అనలిటిక్స్ సహాయంతో ముందుగానే అంచనా వేస్తున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా అగ్రికల్చర్‌తో పాటు టెక్నాలజీపై అవగాహన ఉన్న నిపుణుల అవసరం భారీగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని బీఎస్‌సీ అగ్రిక‌ల్చ‌ర్‌తో పాటు బీఎస్‌సీ అగ్రిటెక్ (Hons.) వంటి ఆధునిక కోర్సులను రూపొందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సౌత్ ఇండియాలోనే తొలిసారి B.Sc Agritech (Hons.)
Image Credit : Gemini AI

సౌత్ ఇండియాలోనే తొలిసారి B.Sc Agritech (Hons.)

దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఈ ప్రత్యేక అగ్రిటెక్‌ కోర్సును కావేరి విశ్వవిద్యాలయం అందిస్తోంది. ఈ కోర్సులో వ్యవసాయ శాస్త్రంతో పాటు ఆధునిక సాంకేతిక అంశాలను సమగ్రంగా బోధిస్తారు. వెబ్ డెవలప్‌మెంట్, అగ్రికల్చర్ అప్లికేషన్ల రూపకల్పన, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, ప్రెసిషన్ ఫార్మింగ్, స్మార్ట్ ఫార్మింగ్ వంటి భవిష్యత్‌కు అవసరమైన సబ్జెక్టులు ఇందులో భాగంగా ఉంటాయి. అంతేకాకుండా నీటి వినియోగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఇజ్రాయెల్ వ్యవసాయ విధానాలపై కూడా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దీంతో చదువు పూర్తయ్యే సమయానికి విద్యార్థులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు అత్యాధునిక అగ్రి-టెక్నాలజీపై కూడా పట్టు సాధించే అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
USA: అమెరికాలో బ‌ట్ట‌లు బ‌య‌ట ఆరేయ‌డం నిషేధమ‌ని తెలుసా.? మ‌రి వారి ప‌రిస్థితి ఏంటో ఆలోచించారా?
Related image2
Railway: రైలు స‌డ‌న్ బ్రేక్ ఎందుకు వేయ‌కూడ‌దు.. పెద్ది సినిమాలో చూపించింది నిజ‌మేనా.?
35
డ్రోన్ ట్రైనింగ్ నుంచి ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ వరకు
Image Credit : Gemini AI

డ్రోన్ ట్రైనింగ్ నుంచి ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ వరకు

ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ కావేరి సీడ్స్ మద్ధతు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన శిక్షణా విధానం ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తున్నారు. క్యాంపస్‌లోనే DGCA ఆమోదం పొందిన డ్రోన్ ట్రైనింగ్ సదుపాయం ఉండటంతో విద్యార్థులు చదువుతో పాటు డ్రోన్ ఆపరేటర్ సర్టిఫికేషన్ కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుత బ్యాచ్‌లో పలువురు ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే వర్మీ కంపోస్టింగ్ సర్టిఫికేషన్, ఆధునిక వ్యవసాయ ల్యాబ్‌లు, హైటెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ వంటి అవకాశాలు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.

45
చదువు పూర్తికాకముందే ఉద్యోగ అవకాశాలు
Image Credit : Gemini AI

చదువు పూర్తికాకముందే ఉద్యోగ అవకాశాలు

అగ్రి-టెక్ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి విస్తృత స్థాయిలో కెరీర్ అవకాశాలు ఉన్నాయి. అగ్రి-టెక్ కంపెనీలు, డ్రోన్ సర్వీసు సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ప్రెసిషన్ ఫార్మింగ్ సంస్థలు, డిజిటల్ అగ్రికల్చర్ కంపెనీలు, అగ్రి స్టార్టప్‌లు వంటి రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రత్యేకంగా DGCA గుర్తింపు పొందిన డ్రోన్ ఆపరేటర్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. కొన్ని ప్రముఖ కంపెనీలు నెలకు రూ.45 వేల వరకు వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. దీంతో చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఏర్పడే అవకాశం ఉంది.

55
ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేదు.. ఇప్పుడే అడ్మిషన్లు
Image Credit : Gemini AI

ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేదు.. ఇప్పుడే అడ్మిషన్లు

వ్యవసాయం, టెక్నాలజీ రెండింటిపైనా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ కోర్సు మంచి అవకాశంగా నిలుస్తోంది. ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండానే అర్హత కలిగిన విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చు. భవిష్యత్ వ్యవసాయం పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా మారుతున్న నేపథ్యంలో అగ్రి-టెక్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా చెప్పవచ్చు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 92814 16210 నంబర్‌ను సంప్రదించవచ్చు. ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
విద్య
తెలంగాణ
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో ముంబై తరహా కుండపోత వర్షాలే, ఇక అల్లకల్లోలమేనా?
Recommended image2
Rain Alert : తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకొండి.. ఇక వర్షాలు షురూ కాబోతున్నాయి, ఎప్పట్నుంచో తెలుసా?
Recommended image3
Telangana Niagara: తెలంగాణలో నయాగరా జలపాతం.. వీకెండ్ ట్రిప్ కోసం బెస్ట్ ప్లేస్.. రూట్ మ్యాప్, ఫుల్ డీటెయిల్స్ ఇవే !
Related Stories
Recommended image1
USA: అమెరికాలో బ‌ట్ట‌లు బ‌య‌ట ఆరేయ‌డం నిషేధమ‌ని తెలుసా.? మ‌రి వారి ప‌రిస్థితి ఏంటో ఆలోచించారా?
Recommended image2
Railway: రైలు స‌డ‌న్ బ్రేక్ ఎందుకు వేయ‌కూడ‌దు.. పెద్ది సినిమాలో చూపించింది నిజ‌మేనా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved