- Home
- Election
- Telangana Elections
- ఆరోగ్య శ్రీ సేవలు ఏయే హాస్పిటల్స్‌లో ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి? ఫోన్‌లోనే చూసుకోవచ్చు..
ఆరోగ్య శ్రీ సేవలు ఏయే హాస్పిటల్స్‌లో ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి? ఫోన్‌లోనే చూసుకోవచ్చు..
Rajiv Aarogyasri: పేద ప్రజలకు వైద్యం భారం కాకుడదనే ఉద్దేశంతో తీసుకొచ్చని రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు బాగా విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ పథకంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తారు. అయితే మీరు వెళ్లాలనుకునే ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయా.? లేదా అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు పేదలకు ఎంతో మేలు చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం ఈ పథకాన్ని కొనసాగించాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఈ పథకం పేరు సైతం మార్చకుండా అమలు చేశారు. అయితే తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచిన విషయం తెలిసిందే.
గతంలో రూ. 5 లక్షలుగా ఉన్న పరిమితిని ప్రస్తుతం రూ. 10 లక్షలకు పెంచారు. అలాగే ఆరోగ్య శ్రీ సేవ పరిధిలోకి 163 వైద్య చికిత్సలను యాడ్ చేశారు. దీంతో ప్రస్తుతం మొత్తం 1835 చికిత్సలు ఈ పథకం ద్వారా లభిస్తున్నాయి.
తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ సేవలను వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. అయితే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంతకీ ఏయే ఆసపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Arogya-sree-hospital.
* ముందుగా మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో బ్రౌజర్‌ను ఓపెన్ చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
* ఆ తర్వాత పైన బార్‌లో కనిపించే హాస్పిటల్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఇందులో కనిపించే ఆరోగ్యశ్రీ ఆసుపత్రిని క్లిక్ చేయాలి. వెంటనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.
Arogya-sree-hospital.
* వీటిలో సెర్చ్ బై లొకాలిటీ అనే ఆప్షన్‌తో మీకు దగ్గరల్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల వివరాలు తెలుసుకోవచ్చు.
* జిల్లా, మండల్, ఆసుపత్రిని ఎంచుకోగానే. సదు ఆసుపత్రికి సంబంధించి పూర్తి వివరాలు, లొకేషన్‌తో పాటు పాటు మిత్ర నెంబర్ కూడా లభిస్తుంది. దీంతో సులభంగా ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల వివరాలను తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: టెట్ రాసిన వారికి అలర్ట్, కీ విడుదలకు రంగం సిద్ధం.. ఎలా చెక్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్