- Home
- Technology
- WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా
WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా
WhatsApp Tips : మీ వాట్సాప్ నెంబర్ ఎవరైనా బ్లాక్ చేశారనే అనుమానముందా..? అయితే వెంటనే Meta AI ని ఉపయోగించి ఆ డౌట్ క్లియర్ చేసుకొండి… మీరు ఏం చేయాలో తెలుసా?

వాట్సాప్ టిప్స్
WhatsApp Tips : ఒకప్పుడు ఏదైనా సమాచారం పంపాలంటే పావురాలతో, దూతలతో పంపేవారు... రాజులకాలం ముగిశాక పోస్టాఫీసులు వచ్చాయి... ఆ తర్వాత సాధారణ ఫోన్ లో ఎస్ఎంఎస్ లు వచ్చాయి... ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చాక అంతా వాట్సాప్ మయం అయిపోయింది. ఇప్పుడు ఏ సమాచారం పంపాలన్నా వాట్సాప్ లోనే... చివరకు పెళ్ళికి ఆహ్వానాలు, ఆఫీసులకు సెలవులు, అధికారిక సమాచారం కూడా వాట్సాప్ లోనే. ఇంకా చెప్పాలంటే వాట్సాప్ లేకుంటే ఏ సమాచారం చేరవేయలేమనే పరిస్థితి. ప్రస్తుతం కోట్లాది మంది ఈ మెసేజింగ్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో తప్పకుండా వాట్సాప్ ఉండాలనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వాట్సాప్ గురించి ఆసక్తికర టిప్స్ ఇక్కడ తెలుసుకుందాం.
మీ నెంబర్ బ్లాక్ చేశారా..?
సాధారణంగా వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ లేదా ఫోటో, వీడియోలు పంపగానే సింగిల్ టిక్ వస్తుంది. అవతలి వాళ్లు అది చూశారంటే రెండు బ్లూ టిక్స్ వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అవతలి వ్యక్తులు మీ నంబర్ బ్లాక్ చేస్తే ఆ విషయం తెలియదు... పంపిన మెసేజ్ లకు సింగిల్ టిక్ మాత్రమే వస్తుంది. వాళ్ళ ఫోన్ లో డాటా ఆప్ చేసినా, నెట్ వర్క్ పరిధిలో లేకున్నా కూడా ఇలాగే సింగిల్ టిక్ ఉంటుంది. మరి మన నెంబర్ బ్లాక్ చేశారో లేదా మెసేజ్ చూడలేదో తెలుసుకోవడం ఎలా?
వాట్సాప్ లో మీ నెంబర్ బ్లాక్ చేస్తే ఇలా తెలుసుకొండి
మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారని అనుమానం వస్తే ఇలా చేయండి. మీ వాట్సాప్ నుండి బ్లాక్ చేశారని అనుమానం వచ్చిన నెంబర్ కు @MetaAI Hi అని మెసేజ్ చేయండి. ఒకవేళ వాళ్లు మీ నెంబర్ బ్లాక్ చేశారంటే తిరిగి ఎలాంటి రిప్లై రాదు... కానీ నెట్ వర్క్ లేకపోవడం లేదా మరేదైన కారణాలతో మీరు పంపే మెసేజ్ లు చూడకుంటే రిప్లై వస్తుంది. ఇలా ఎవరైనా మీ నెంబర్ ను బ్లాక్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు.
మీ వాట్సాప్ చాట్స్ ఇతరులు చూస్తున్నారా... తెలుసుకోవడం ఎలా?
ఇక మీ ఫోన్ ను ఉపయోగించకుండానే వాట్సాప్ ను ఇతరులు వాడే ప్రమాదముంది... ఇలా జరుగుతుందని మీకు అనుమానం వస్తే ఈ టిప్ ఫాలో కండి. మీ వాట్సాప్ ఓపెన్ చేసి పైన కుడివైపు చివరన ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేయండి. అక్కడ 'linked devices' అనే ఆప్షన్ కనిపిస్తుంది... దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ నెంబర్ వాట్సాప్ వెబ్ ద్వారా ఇతర ఏవైనా డివైజెస్ కు కనెక్ట్ అయివుంటే తెలుస్తుంది. ఇలా ఏదైనా కనిపిస్తే వెంటనే డిస్ కనెక్ట్ చేయండి.
వాట్సాప్ లో మీ చాటింగ్ లాక్ చేసుకోవచ్చు తెలుసా?
వాట్సాప్ లో మన చాటింగ్ ను రహస్యంగా ఉంచుకునే ఆప్షన్ కూడా ఉంది... లాక్ చేయవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేయగానే పైన్ లాక్డ్ చాట్ అని కనిపిస్తుంది. ఇందులో మీరు రహస్యంగా చాటింగ్ చేయాలనుకునేవారి నెంబర్ యాడ్ చేయవచ్చు. దీంతో మీ వాట్సాప్ సాధారణ చాటింగ్ ఇది కనిపించదు... ప్రత్యేకంగా లాక్డ్ చాట్స్ లో మాత్రమే కనిపిస్తాయి. మీ ఫింగర్ ప్రింట్, పాటర్న్, పాస్ వర్డ్, ఫేస్ ఐడి వంటివి లాక్ గా ఉపయోగించవచ్చు.

