Whatsapp: వాట్సాప్‌లో మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే.?
Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంత క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

వాట్సాప్‌లో మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇది వరకే వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్‌గా మార్చే సదుపాయాన్ని ప్రవేశపెట్టిన వాట్సాప్, ఇప్పుడు సందేశాలను యూజర్ కోరిన భాషలో చదివే అవకాశం కూడా ఇవ్వనుంది. వాట్సాప్ బ్లాగ్ ప్రకారం, ఈ ఫీచర్ భాష అంతరాలను తొలగించడానికి ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపింది.
ఏ సందర్భాల్లో ఉపయోగించవచ్చు?
ఈ ఫీచర్ వ్యక్తిగత చాట్స్, గ్రూప్ సందేశాలు, అలాగే ఛానల్స్‌లో వచ్చే మెసేజ్‌లకు కూడా వర్తిస్తుంది. ఆండ్రాయిడ్, iOS యూజర్లకు ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఇతర యూజర్లకు అందుబాటులోకి తీసుకున్నారు. ఆండ్రాయిడ్‌లో ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీ, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, అరబిక్ భాషలకు సపోర్ట్ చేస్తుండగా.. iOS యూజర్లు మొత్తం 19 భాషలలో అనువాదం పొందగలుగుతారు.
మెసేజ్‌ను ట్రాన్స్‌లేట్ చేసే విధానం
వాట్సప్‌లో మెసేజ్ ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటే ముందుగా మీరు ఆ మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు “Translate” అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకుని మీరు కావలసిన భాషను సెలెక్ట్ చేస్తే, ఆ సందేశం వెంటనే ట్రాన్స్‌లేట్ అవుతుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు “Auto-Translation” సదుపాయం కూడా ఉంది, దీన్ని ఎంచుకుంటే వచ్చే ప్రతి సందేశం ఆటోమేటిక్‌గా మీకు నచ్చిన భాషలోకి మారుతుంది.
గోప్యతకు పెద్ద పీట
ఈ ట్రాన్స్‌లేషన్ ప్రక్రియ డివైజ్‌లోనే జరుగుతుంది. అంటే, మీ సందేశాలను సర్వర్‌లోకి పంపి చదవడం జరుగదు. వాట్సాప్ AI సదుపాయాలతో ఈ ఫీచర్ రూపొందించినందున, భవిష్యత్‌లో మరిన్ని భాషలకు సపోర్ట్ చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకుంది.
భవిష్యత్ ప్రణాళికలు
వాట్సాప్ ఈ ఫీచర్ ద్వారా భాషా అవరోధాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. యూజర్లు వివిధ భాషల్లో వచ్చిన సందేశాలను తక్షణమే అర్థం చేసుకోవడం ద్వారా చాట్ అనుభవం మరింత సులభం అవుతుంది. అలాగే AI ఆధారిత ఫీచర్ల ద్వారా, భవిష్యత్‌లో మరిన్ని భాషలకు, అంతర్జాతీయ వినియోగదారులకు కూడా ఈ సదుపాయం విస్తరించబడే అవకాశం ఉంది.