MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • Whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌.. ఇక స్టేటస్ లవర్స్ కు ఆ బాధ తప్పినట్లే!

Whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌.. ఇక స్టేటస్ లవర్స్ కు ఆ బాధ తప్పినట్లే!

WhatsApp Collage Feature: వాట్సాప్‌లో కొత్తగా కొలేజ్ ఫీచర్ వచ్చింది. స్టేటస్‌ కోసం యాప్‌లోనే కొలేజ్ రూపొందించుకునే సదుపాయం వచ్చింది. ఒకేసారి ఆరు ఫోటోలు లేఔట్‌లో అమర్చుకుని స్టేటస్‌గా పెట్టుకోవచ్చు, థర్డ్ పార్టీ యాప్ అవసరం లేదు.

2 Min read
Author : Rajesh K
| Updated : Aug 10 2025, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాట్సాప్ స్టేటస్ లవర్స్‌కి గుడ్ న్యూస్
Image Credit : Getty

వాట్సాప్ స్టేటస్ లవర్స్‌కి గుడ్ న్యూస్

WhatsApp Collage Feature:వాట్సాప్ స్టేటస్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఎప్పుడూ స్టేటస్‌లో కొత్త ఫోటోలు, వీడియోలు పెట్టే వారికి వాట్సాప్ వినియోగదారుల కోసం మరో అదిరిపోయే ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇకపై ఫోటోలు ఎడిట్ చేయడానికి లేదా థర్డ్ పార్టీ యాప్స్ తో అవసరం లేకుండా చేసింది. యాప్‌లోనే కొలేజ్ రూపొందించుకునే సదుపాయం అందుబాటులోకి రావడంతో, స్టేటస్ అప్‌డేట్ చేయడం మరింత ఈజీగా మారింది. వాట్సాప్‌ న్యూ స్టేటస్ ఫీచర్‌ వివరాలు మీ కోసం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
"వాట్సప్‌లో కొత్త కొలేజ్ ఫీచర్ – ఒకేసారి ఆరు ఫోటోలు స్టేటస్‌లో!"
Image Credit : Getty

"వాట్సప్‌లో కొత్త కొలేజ్ ఫీచర్ – ఒకేసారి ఆరు ఫోటోలు స్టేటస్‌లో!"

వాట్సప్ వినియోగదారులకు ఇది నిజంగా గుడ్ న్యూసే.. ఇప్పటివరకు ఒక్క స్టేటస్‌లో ఎక్కువ ఫోటోలు పెట్టాలంటే ఎడిటింగ్ యాప్స్ సహాయం తప్పనిసరి అయ్యేది. ఒక్కొక్కదాన్ని విడిగా అప్‌డేట్ చేయడం లేదా థర్డ్ పార్టీ యాప్‌ల సహాయం తీసుకుని ఫోటోలను కలిపి పెట్టుకోవాల్సి వచ్చేది.

ఇప్పుడు ఆ అవసరం లేకుండా యాప్‌లోనే ఫోటోలను ఎంపిక చేసి కొలేజ్ లేఅవుట్‌గా మార్చే బిల్ట్-ఇన్ ఎడిటర్‌ను వాట్సప్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో ఒకేసారి ఆరు ఫోటోలను స్టేటస్‌గా పెట్టుకోవచ్చు, అంటే పుట్టినరోజు పార్టీ, ఫ్యామిలీ గ్యాదరింగ్, ట్రిప్ లేదా ఏదైనా ప్రత్యేక ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలన్నీ ఒకే స్టేటస్‌లో చూపించుకోవచ్చు. అదీ మీకు నచ్చిన లేఅవుట్‌లో స్టేటస్ పెట్టుకోవచ్చు.

35
లేఔట్ ఆప్షన్ ఎలా వాడాలి?
Image Credit : Getty

లేఔట్ ఆప్షన్ ఎలా వాడాలి?

వాట్సప్‌లో లేఔట్ ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం. మొదట, వాట్సప్ యాప్‌లో “Status” సెక్షన్‌కి వెళ్లి “My Status”పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఫోనులోని గ్యాలరీ నుంచి ఒకేసారి ఆరు ఫోటోలు వరకు ఎంపిక చేసుకోవచ్చు. ఫోటోలు ఎంచుకున్న వెంటనే స్క్రీన్‌లో “Layout” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకుంటే, మీరు అనేక రకాల కొలాజ్ స్టైల్స్‌లో ఫోటోలను అమర్చుకోవచ్చు. లేఔట్ సెట్ చేసిన తరువాత, మీ స్టేటస్‌ను మరింత ఆకర్షణీయంగా చేయాలంటే మ్యూజిక్, స్టిక్కర్లు, టెక్స్ట్ వంటి ఇతర ఎడిటింగ్ టూల్స్ కూడా ఉపయోగించవచ్చు. అంతిమంగా, ఈ అన్ని ఎడిటింగ్ పూర్తి చేసుకుని “Send” బటన్ నొక్కితే చాలు. స్టేటస్‌ రెడీ.

45
లేఔట్, మ్యూజిక్, స్టిక్కర్లతో స్టేటస్ కొత్త లుక్
Image Credit : Getty

లేఔట్, మ్యూజిక్, స్టిక్కర్లతో స్టేటస్ కొత్త లుక్

వాట్సప్ ఈ కొత్త అప్డేట్ దశలవారీగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే కొంతమంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది, మిగిలిన వారికి త్వరలో అప్‌డేట్ రూపంలో అందజేయనుంది. ఈ లేఔట్ ఫీచర్‌తో పాటు మ్యూజిక్ స్టిక్కర్స్, ఫోటో స్టిక్కర్స్ వంటి మరో రెండు కొత్త ఆప్షన్లు కూడా త్వరలో యాప్‌లో చేరబోతున్నాయి, ఇవి స్టేటస్‌కు న్యూ లుక్ ను ఇవ్వడానికి సహాయపడతాయి.

55
క్రియేటర్లకి ఉపయోగకరం
Image Credit : Getty

క్రియేటర్లకి ఉపయోగకరం

డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, స్టోరీలు క్రియేటివ్‌గా పెట్టేవారికి ఈ లేఔట్ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పుట్టినరోజులు, ఈవెంట్‌లు, ట్రిప్ ఫోటోలను ఒకేసారి సులభంగా పంచుకోవాలనుకునే వారికి ఇది సమయాన్ని చాలా ఆదా చేస్తుంది. వాట్సప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపర్చడమే ఈ మార్పుల లక్ష్యం. ఇప్పుడు వాట్సప్‌లోనే ఈ ఫీచర్ రావడంతో ఎటువంటి అదనపు యాప్ అవసరం ఉండదు. ఇలా కంటెంట్ క్రియేటర్లకు మరింత క్రియేటివ్ స్టోరీస్ రూపొందించడానికి సహాయపడుతుంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphone Deals: ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ సేల్స్.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్ల పై బిగ్ డిస్కౌంట్స్.. టాప్ 5 డీల్స్ ఇవే
Recommended image2
Flipkart Big Billion Days: ధమాకా ఆఫర్.. రూ. 5,799 కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఛాన్స్
Recommended image3
Best Laptop Deals: రూ. 30 వేల నుంచి రూ. 50 వేల బడ్జెట్‌లో టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్.. SBI కార్డ్‌పై భారీ ఆఫర్లు
Related Stories
Recommended image1
WhatsApp: వాట్సాప్ స్టోరేజ్ నిండిపోయిందా? డౌన్‌లోడ్ క్వాలిటీ ఫీచర్‌‌తో ఆ సమస్యే ఉండదు
Recommended image2
WhatsApp Quick Recap: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. అలాంటి వారికి ఇదో ఓ వరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved