MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Touchscreen Technology: వేలి స్పర్శ తగలగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది ? అందుకే ఫింగర్ ప్రింట్ పెడతారు

Touchscreen Technology: వేలి స్పర్శ తగలగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది ? అందుకే ఫింగర్ ప్రింట్ పెడతారు

Touchscreen Technology: ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. పాస్ వర్డ్ పెట్టినా ఏదో ఒక భయం. అందుకే చాలా ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటుంటారు. అయినా వేలితో టచ్ చేయగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది? ఇది మీరెప్పుడైనా ఆలోచించారా?

2 Min read
Author : Nandini Arava
Published : Aug 15 2026, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వేలి స్పర్శ తగలగానే ఎలా ఓపెన్ అవుతుంది
Image Credit : AI

వేలి స్పర్శ తగలగానే ఎలా ఓపెన్ అవుతుంది

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. పాస్ వర్డ్ పెట్టినా ఏదో ఒక భయం. అందుకే చాలా ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటుంటారు. అయినా వేలితో టచ్ చేయగానే ఫోన్ ఎలా ఓపెన్ అవుతుంది? ఇది మీరెప్పుడైనా ఆలోచించారా?

దీని వెనుక 'కెపాసిటివ్ టచ్‌స్క్రీన్' (Capacitive Touchscreen) అనే సూపర్ టెక్నాలజీ ఉంది. మన స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ బయటి నుంచి చూస్తే ఒకే లేయర్‌లా కనిపించినా, దాని లోపల చాలా లేయర్లు ఉంటాయి. ఇందులో డిస్‌ప్లే ప్యానెల్‌తో పాటు, 'టచ్ సెన్సింగ్ లేయర్' (స్పర్శను గుర్తించే పొర) కూడా ఉంటుంది. ఈ లేయర్, చాలా చిన్న చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను, లోపల జరిగే మార్పులను కూడా పసిగట్టగలదు. మీరు స్క్రీన్‌ను తాకినప్పుడు, మీ వేలు ఈ సిస్టమ్‌లో కొన్ని మార్పులను సృష్టిస్తుంది. ఫోన్ ఆ మార్పునే 'టచ్' అని గుర్తిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టచ్ చేయగానే ఏం జరుగుతుంది?
Image Credit : AI Generated Image

టచ్ చేయగానే ఏం జరుగుతుంది?

అన్ని స్మార్ట్‌ఫోన్లలో కెపాసిటివ్ టచ్ టెక్నాలజీనే వాడుతున్నారు. స్క్రీన్ టచ్ లేయర్‌లో, కంటికి కనిపించని చాలా సన్నని ఎలక్ట్రోడ్‌లతో ఒక గ్రిడ్ (Grid) ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్‌ల చుట్టూ ఒక చిన్న ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటుంది. మీరు స్క్రీన్‌ను తాకనంత వరకు, ఈ సిస్టమ్ నార్మల్ గానే ఉంటుంది. కానీ, మీ వేలు స్క్రీన్ తాకగానే సిగ్నల్స్ మొదలవుతాయి. ఇక్కడే మన శరీరం పాత్ర కీలకం. మనిషి శరీరం అనేది ఒక విద్యుత్ వాహకం. అందుకే మనం చాలా సేపు…సిస్టమ్ దగ్గర కూర్చుంటే..అప్పుడు మనల్ని ఎవరైనా టచ్ చేస్తే షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. అందుకే, మన వేలు స్క్రీన్‌పై తాకినప్పుడు, అక్కడి 'కెపాసిటెన్స్' లో మార్పు వస్తుంది. ఫోన్‌ లోపల ఉండే 'టచ్ కంట్రోలర్' ఈ మార్పును కనిపెట్టేస్తుంది.

Related Articles

Related image1
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Related image2
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?
33
మీరు ఎక్కడ టచ్ చేశారో ఫోన్‌కు ఎలా తెలుస్తుంది?
Image Credit : stockPhoto

మీరు ఎక్కడ టచ్ చేశారో ఫోన్‌కు ఎలా తెలుస్తుంది?

స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్‌లోని ఎలక్ట్రోడ్‌లు ఒక నెట్‌వర్క్‌లా పనిచేస్తాయి. వేలు ఒక ప్రదేశాన్ని తాకినప్పుడు, ఆ ప్రాంతంలోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌లో మార్పు వస్తుంది. టచ్ కంట్రోలర్ ఈ మార్పులను గుర్తించి, పొజిషన్‌ను లెక్కిస్తుంది. ఆ తర్వాత డేటాను స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్‌కు (OS) పంపుతుంది.

ఉదాహరణకు, మీరు స్క్రీన్ కింద ఎడమ వైపు ఉన్న ఒక యాప్ ఐకాన్‌ను టచ్ చేశారనుకుందాం. వెంటనే టచ్ సిస్టమ్ ఆ ప్రదేశం X, Y కోఆర్డినేట్‌లను అడుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఆ ప్రదేశంలో ఉన్న యాప్ ఐకాన్‌నే నొక్కారని అర్థం చేసుకుని, వెంటనే ఆ యాప్‌ను ఓపెన్ చేస్తుంది. అదీ లెక్క.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంట్లోని గ్యాడ్జెట్లను కంట్రోల్ చేయొచ్చు.. ఈ స్మార్ట్ ప్లగ్‌తో సాధ్య‌మే
Recommended image2
Reels: రీల్స్ తెగ చూస్తుంటారా.? మీ జేబుకు చిల్లు ప‌డుతున్న‌ట్లే, ఎలాగంటే
Recommended image3
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Related Stories
Recommended image1
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image2
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved