MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Tech News
  • Reels: రీల్స్ తెగ చూస్తుంటారా.? మీ జేబుకు చిల్లు ప‌డుతున్న‌ట్లే, ఎలాగంటే

Reels: రీల్స్ తెగ చూస్తుంటారా.? మీ జేబుకు చిల్లు ప‌డుతున్న‌ట్లే, ఎలాగంటే

Reels: రీల్స్ చూడటం చాలా కామన్ గా మారింది. "ఒక్క రీల్ మాత్రమే చూస్తా" అనుకుని ఫోన్ తీసుకుంటే గంటలు గడిచిపోతున్నాయి. ఈ అలవాటు కేవలం సమయాన్ని మాత్రమే కాదు.. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, పనితీరు, ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలుసా?

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 12 2026, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అస‌లీ రీల్స్ ఎలా మొద‌ల‌య్యాయి.?
Image Credit : Gemini AI

అస‌లీ రీల్స్ ఎలా మొద‌ల‌య్యాయి.?

రీల్స్ అంటే మొబైల్‌లో నిలువుగా (Vertical) చూసే చిన్న వీడియోలు. ఈ కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రధానంగా టిక్‌టాక్‌కు దక్కుతుంది. 2017లో అంతర్జాతీయంగా ప్రారంభమైన ఈ యాప్.. 2018లో భారత్‌లో విపరీతమైన ఆదరణ పొందింది. తర్వాత 2020లో ఇన్‌స్టాగ్రామ్ కూడా రీల్స్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అనంతరం ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లూ షార్ట్ వీడియోల ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతిరోజూ రీల్స్ చూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రీల్స్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?
Image Credit : Lava.com

రీల్స్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?

రీల్స్‌కు ఆకర్షితులవడం వెనుక మన మెదడు పనితీరు కీలక పాత్ర పోషిస్తుంది. మనకు నచ్చిన లేదా ఆశ్చర్యపరిచే వీడియో కనిపించినప్పుడు మెదడులో డోపామిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దీంతో మనకు ఆనందంగా అనిపిస్తుంది. అదే అనుభూతిని మళ్లీ పొందాలనే ఉద్దేశంతో మరో రీల్, ఇంకో రీల్ చూస్తూ పోతాం. అలాగే తదుపరి వీడియో ఎలా ఉంటుందో తెలియకపోవడం కూడా ఆసక్తిని పెంచుతుంది. ఒక వీడియో పూర్తయ్యేలోపే మరో వీడియో ఆటోమేటిక్‌గా రావడం వల్ల ఆపాలనే ఆలోచన కూడా రాదు. దీంతో గంటల తరబడి రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేస్తుంటారు.

35
రీల్స్ వల్ల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితికి ఎలా నష్టం?
Image Credit : Getty

రీల్స్ వల్ల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితికి ఎలా నష్టం?

పనిపై దృష్టి తగ్గుతుంది

ఎక్కువసేపు రీల్స్ చూడటం వల్ల ఏ పనిపైనా ఎక్కువసేపు ఏకాగ్రతతో ఉండటం కష్టమవుతుంది. ఆఫీసులో పనిచేసే సమయంలో కూడా చాలామంది మధ్యలో రీల్స్ చూస్తుంటారు. దీంతో పని నాణ్యత తగ్గడంతో పాటు ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ఒక అధ్యయనం ప్రకారం భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్ వినియోగ సమయంలో దాదాపు ఐదో వంతు షార్ట్ వీడియోలకే కేటాయిస్తున్నారు. అలాగే 64 శాతం మంది గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత ఎక్కువగా రీల్స్ చూస్తున్నామని అంగీకరించారు.

అవసరం లేని ఖర్చులు, అప్పులు పెరిగే ప్రమాదం

సోషల్ మీడియా అల్గోరిథమ్ మనకు నచ్చే వస్తువుల ప్రకటనలు, వీడియోలను ఎక్కువగా చూపిస్తుంది. దీంతో అవసరం లేకపోయినా వెంటనే కొనాలనే కోరిక కలుగుతుంది. దీనినే ఇంపల్స్ బాయింగ్ అంటారు. ఫలితంగా పొదుపు తగ్గిపోవడం, క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలపై ఆధారపడటం పెరిగే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.

యువతలో నైపుణ్యాల అభివృద్ధి దెబ్బతింటుంది

చదువు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కెరీర్ అభివృద్ధికి ఉపయోగపడే సమయాన్ని చాలామంది రీల్స్ చూస్తూ గడుపుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం Gen Z యువతలో 89 శాతం మంది ప్రతిరోజూ రీల్స్ చూస్తున్నారు. వీరిలో చాలామంది రోజుకు రెండు గంటలకు పైగా షార్ట్ వీడియోలు చూస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇదే సమయాన్ని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి వినియోగిస్తే వ్యక్తిగతంగానే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికీ ఉపయోగపడుతుంది.

45
మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
Image Credit : Getty

మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

గంటల తరబడి నిరంతరం రీల్స్ లేదా సోషల్ మీడియా స్క్రోల్ చేయడాన్ని డూమ్ స్క్రోలింగ్ అంటారు. దీని వల్ల నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్, మానసిక అలసట వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటే ఉద్యోగాల్లో గైర్హాజరు పెరుగుతుంది. పనితీరు తగ్గుతుంది. దీని ప్రభావం వ్యక్తిగత ఆదాయంపైనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతుంది.

తప్పుదారి పట్టించే పెట్టుబడి సలహాలు

రీల్స్‌లో చాలామంది స్టాక్ మార్కెట్, క్రిప్టో, మ్యూచువల్ ఫండ్లు, వ్యాపార అవకాశాలపై తక్కువ సమయంలో పెద్ద లాభాలు వస్తాయని చెబుతుంటారు. అయితే అలాంటి వీడియోలు చేసే వారిలో చాలామందికి సరైన అర్హతలు లేదా అధికారిక అనుమతులు ఉండవు. కేవలం వ్యూస్, లైక్స్, స్పాన్సర్‌షిప్‌ల కోసం రీసెర్చ్‌ లేకుండా పెట్టుబడి సలహాలు ఇస్తుంటారు. వాటిని నమ్మి పెట్టుబడులు పెడితే డబ్బు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

55
రీల్స్ అలవాటును ఎలా తగ్గించుకోవాలి?
Image Credit : gemini

రీల్స్ అలవాటును ఎలా తగ్గించుకోవాలి?

రీల్స్‌ను పూర్తిగా మానేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ కొన్ని అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

రోజుకు సమయం నిర్ణయించుకోండి: రీల్స్ చూడటానికి రోజుకు 15 నుంచి 20 నిమిషాల సమయం మాత్రమే కేటాయించండి.

నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి: సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఆఫ్ చేస్తే అవసరం లేకుండా యాప్ ఓపెన్ చేసే అలవాటు తగ్గుతుంది.

మంచి అలవాట్లు పెంచుకోండి: ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, నడక, వ్యాయామం, సంగీతం వినడం, కుటుంబంతో గడపడం వంటి పనులు చేయండి.

డిజిటల్ డీటాక్స్ పాటించండి: వారానికి కనీసం ఒక రోజు సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.

మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి: "ఇప్పుడు రీల్స్ చూడటం నిజంగా అవసరమా? ఈ సమయాన్ని చదువుకు లేదా పనికి ఉపయోగిస్తే బాగుండదా?" అని ఆలోచించే అలవాటు పెంచుకోండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి
Recommended image2
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Recommended image3
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
Related Stories
Recommended image1
Highway: ఇక‌పై ఆ దేశాల‌కు కారులో వెళ్లిపోవ‌చ్చు.. 1360 కి.మీల భారీ ర‌హ‌దారి నిర్మాణం
Recommended image2
హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు 18 నుంచి ఆ మార్గంలో వ‌న్‌వే. ఏకంగా ఏడాది పాటు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved